Sunday, November 28, 2010

సామెతలు 22

1. కుంటికులాసం, ఇంటికి మోసం.
2. కుంటి గాడిదకు జారిందే సాకు.
3. కుంటి గుఱ్ఱానికి జారిందే సాకు.
4. కుంటి గుఱ్ఱాలు, తోలు కత్తులు.
5. కుంటివానికి కుయుక్తులెక్కువ.
6. కుంటి వాని తిప్పలు కుంటివానికి, గూనివాని తిప్పలు గూనివానికి.
7. కుంటివాని పారుపత్తెము ఇంటి ముందఱే.
8. కుంటి సాకులు-కొంటె మాటలు.
9. కుంటోడైనా ఇంటోడు మేలు.
10. కుండ ఎప్పుడు వేఱో, కుదురు అప్పుడే వేఱు.
11. కుండమార్పు మనువులు కూడైనావస్తవి, కుమ్మయినా అవుతవి.
12. కుండను మూయను మూకుడున్నది గానీ, లోకుల నోరు మూయనేమున్నది?
13. కుండల దుమ్మును రోకళ్ళతో దులిపినట్లు.
14. కుండలు, చేటలు లేవని వండుకతినటం మానుకుంటామా?
15. కుండలు దాచినా, కండలు దాచలేము.
16. కుండలోకి కూడూ, గుదములోకి గూటాము తా తెచ్చుకుంటేనే గానీ రావు.
17. కుండలో కూడుంటే, ముండకు నిద్ర రాదు.
18. కుండలో కూడు కదలకుండా ఉండాల, బిడ్డలు మాత్రం పెరగాల.
19 కుండలో కూడుమాత్రం కుండలో ఉండాల, బిడ్డ గుండ్రాయి మాదిరి కావాల.
20. కుండలో గుఱ్ఱాలు తోలినట్లు.
21. కుండలో మెతుకులన్ని పట్టిచూడవలెనా?
22. కుండలో లేనిది నా సిండలోనుండి తెచ్చిపెట్టనా అన్నదిట.
23. కుండవెళ్ళి బిందెకు తగిలినా, బిందె వచ్చి కుండకు తగిలినా కుండకే మోసం.
24. కుండ వేరైతే, కులం వేరా?
25. కుందేటి కొమ్ము సాధించినట్లు.
26. కుందేలు దొరికే వేళకు కుక్కకు బయటికి వచ్చిందట.
27. కుందేళ్ళతో గూడా పరుగెత్తి, కుక్కలతో గూడా వేటాడినట్లు.
28. కుంపట్లో తామర మొలచినట్లు.
29. కుంభకర్ణుని నోటికి అరకాసు మజ్జిగా?
30. కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదకదా?
31. కుక్క అతిమూత్రవ్యాధి, బంధువైరం లేకుంటే, గంటకు ఆమడదూరం పోతాఅన్నదిట (చూచినదాని మీదంతా కాలెత్తి ఉచ్చపోస్తు, కనబడ్డకుక్కలతో కలహిస్తూ పోతుంటుంది).
32. కుమ్మ ఉట్టిచెర్లు తెంచగలదుకానీ, పాలకుండ పడకుండా పట్టగలదా?
33. కుక్క ఎక్కలేక కాదు చచ్చేది, పెరుక్కోలేక.
34. కుక్క గోవుకాదు, కుందేలు పులి కాదు.
35. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
36. కుక్కకు ఏమితెలుసు మొక్కజొన్న రుచి.
37. కుక్కకు ఏవేషం వేసినా మొరగక మానదు.
38. కుక్కకు కూడా కలిసివచ్చే కాలం ఉంటుంది.
39. కుక్కకు కూడు వేస్తే కూటికుండకు ముప్పు.
40. కుక్కకు జలతారు టోపీ పెట్టినట్లు.
41. కుక్కకు నెయ్యికూడు పెట్టడం, చెడ్డజాతికి విద్య చెప్పినట్లు.
42. కుక్కకున్న గుణము గురునకు లేదయా.
43. కుక్కకు పులితోలు కప్పగానే కరవనేరుస్తుందా?
44. కుక్కకు పుట్టేదంతా గొక్కిరిపండ్లే.
45. కుక్కకు పెత్తనమిస్తే కుండలు కెలకదా?
46. కుక్కకు పెత్తనమిస్తే చెప్పులన్ని కొరికి పెట్టిందట.
47. కుక్క చింపిన విస్తరైనట్లు.
48. కుక్క తెచ్చేవన్నీ గొద్దెలే.
49. కుక్క కూయనేమి గుఱ్ఱమునకు లెక్క.
50. కుక్కతోక గట్ట కుదురునా చక్కగా.
51. కుక్కతోక వంకర తీర్చలేని వారు, ఏటివంకల తీర్చగలరా?
52. కుక్కతోక పట్తుకొని గోదారి ఈదినట్లు (దాటినట్లు).
53. కుక్కదానం పట్టి అయినా కుటుంబాన్ని పోషించాలి.
54. కుక్కను అమ్మితే డబ్బు మొరుగుతుందా?
55. కుక్కని ఎక్కితే సుఖమూ లేదు, కూలబడీతే దుఃఖము (నష్టమూ) లేదు.
56. కుక్కను కొట్ట బచ్చనకోల కావలెనా?
57. కుక్కను తెచ్చి అందలంలో కూర్చోబెడితే, కుచ్చులన్ని తెగకొరికిందట.
58. కుక్కను గుఱ్ఱం వలె సాకి దొంగవస్తే రెడ్డే మొరిగినాడంట.
59. కుక్కను పెంచితే గండాయె, కూటికుండకు చేటాయె.
60. కుక్కను పందివలే పెంచి, దొంగవస్తే ఆలుమగలే మొరిగినారట.
61. కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినా వెనకటి గుణం మానదు.
62. కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
63. కుక్కనోటికి టెంకాయ అబ్బునా?
64. కుక్కపైన గొంగళి వేయగానే గంగిరెద్దు అవుతుందా?
65. కుక్క బతుకు-నక్క చావు.
66. కుక్క బలిస్తే గోనెలు మోస్తుందా?
67. కుక్కబుద్ది దాలికుంటలో ఉన్నంతసేపే.
68. కుక్క ముట్టిన కుండ అక్కఱకు వస్తుందా?
69. కుక్క మొరిగితే జంగం పరపతి పోతుందా?
70 కుక్క అరుపు ఊరిదారి చూపితే, నక్క అరుపు కాటి దారి చూపుతుంది.
71. కుక్కల రంది ఏమిటంటే, చిత్తాకర్తె పెట్టిందేమో చూడు అన్నాడట.
72. కుక్కలకు కులం పంచాయతా?
73. కుక్కలు ఏకులు వడికితే, గుఱ్ఱాలు చీరలు కడతాయి.
74. కుక్కలూ కుక్కలూ పోట్లాడుకొని, కూట్లో దుమ్ముపోసుకున్నాయట.
75. కుక్కలు చెప్పులు వెదుకును, నక్కలు బొక్కలు వెతుకును, తక్కిన నా లంజాకొడుకు తప్పే వెదకున్.
76. కుక్కలు మొరుగుతూనే ఉంటవి, సాతు (బిడారు) సాగిపోతూనే ఉంటుంది.
77. కుక్కవంటి మనసు కూర్చుండనిచ్చునా?
78. కుక్కవస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు.
79. కుక్క సంతకు పోయి వచ్చినట్లు (కొనదు-అమ్మదు).
80. కుక్క సింహమగునే గోదావరికి బోవ.
81. కుక్క స్వారీకి కుచ్చుల జీనా?
82. కుక్కి చక్రమే (బండి) గోల చేసేది.
83. కుచ్చి (గ్రుచ్చి) కుదుటిలో పెడితే, విచ్చికొని వీధిలోకి వచ్చినట్లు.
84. కుచ్చెలక్రింద త్రాచువలె (కుచ్చెల=పేర్చిన పిడకల గుట్ట, పావడ).
85. కుజనుడౌ వైద్యండు ప్రజకు రోగము గోరు, సామాన్య విప్రుండు చావు గొరు.
86. కుటులమానవులకు గుణమేల కలుగురా.
87. కుట్టని రవిక చేతిలో ఉన్నాసరె, ఏలని మొగుడు ఊరిలో ఉన్నా సరె.
88. కుట్టికుట్టి గుంజాగానికి దుప్పటి నేయించినట్లు.
89. కుడితే తేలు, కుట్టకుంటే కుమ్మరి పురుగు.
90. కుట్టిన ఏడు కుట్టెండ, మరోఏడు మట్టెండ, మూడో ఏడు మొదలెండె.
91. కుట్టిన చెవికి బుడగలు లేవు, మధ్యాహ్నం సద్దికి ఉప్పులేదు.
92. కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినమ్మ కుక్కముండ.
93. కుట్టిన తేలు గుణవంతురాలు, కూసినముండ రాళుగాయి ముండ.
94. కుట్టిన తేలు గోడకెక్కె, కూసులంజ రచ్చకెక్కె.
95. కుట్టినమ్మ కుదుట్లో ఉంటే, కూసినమ్మ గయ్యాళి.
96. కుట్టేవాడికి కుడి తట్టు, చీదేవాడికి ఎడమతట్టు ఉండరాదు.
97. కుట్టేవారు చెవులు కుడీతే నొప్పెట్టవు.
98. కుడికన్ను కుదేయ్యటం, ఎడమకన్ను ఎగురేయటం.
99. కుడికాలు పెడితే కుల క్షయం, ఎడమకాలు పెడితే వంశ క్షయం.
100. కుడిచి కూర్చుని గుదంలోకి మేకు తెచ్చుకున్నట్లు.

No comments: