Wednesday, November 17, 2010

సామెతలు-18

1. కనుమనాడు కాకినైనా కదలనీయరు.
2. కనుమనాడు మినుము కొరకాల.
3. కనుమల మీద మెయులొస్తే, కళ్ళముందర వాన.
4. కనుమకు కాకర, భోగికి పొట్ల.
5. కనుమనాడు కాకి కూడా మునుగుతుంది.
6. కనుసైగకు రాని కాంతను బలిమిడి కరమిడ వశమగునా?
7. కన్నతల్లికి కడుపు కాలితే, పిన్న తల్లికి పిఱ్ఱ కాలిందట.
8. కన్నతల్లికైనా కనుమరుగుండాల.
9. కన్నపుదొంగ వాడలేదని ముంత ఇంటివానిని వదలి పోవునా?
10. కన్నామేగానీ, కడుపులోపెట్టుకొని ఉంటామా?
11. కన్నెఱికానికి కాసులేని ఆయన కలకాలం కాపాడుతాడా?
12. కన్నెనిచ్చిన వానిని, కన్నిచ్చినవానిని (దృష్టి, ఙ్ఞానము) కడవరకు మరువరాదు.
13. కన్నీరు కిందికి కారుతుంది, పన్నీరు పైకి చిమ్ముతుంది.
14. కన్ను ఉండా, కనుపాపను కొన్నట్లు.
15. కన్ను ఎరుగకున్నా, కడుపు ఎరుగుతుంది.
16. కన్ను ఎఱ్ఱబడ్డా, మిన్ను ఎఱ్ఱబడ్డా కారక మానదు.
17. కన్ను కైకలూరులో, కాపురం డోకిపఱ్ఱులో.
18. కన్ను గుడ్డిదైతే కడుపు గుడ్డిదా?
19. కన్ను గుడ్డిదైనా నిద్రకేంలోటు?
20. కన్నుచూసి కాటుక, పిఱ్ఱచూసి పీట.
21. కన్ను చూసినదాన్ని నమ్మితే, చెవి విన్నదాన్ని నమ్ముతుంది.
22. కన్ను పోయేటంత కాటుక పెట్టుకుంటారా?
23. కన్ను మనదే, వేలూ మనదే అని పొడుచుకుంటామా?
24. కన్నులు కంచాలమీద నోరు రామరామ
25. కన్నులు పెద్దవైతే కనుపాపలు పెద్దవవుతాయా?
26. కన్నేలపోయెనోయి కనకలింగమా? అంటే, చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నట్లు.
27. కన్నులెంత పెద్దవైనా కలిమే, చన్నులెంత పెద్దవైనా జవ్వనమే.
28. కన్ను వంటి ప్రకాశం లేదు, మన్నువంటి ఆధారం లేదు.
29. కన్నెరుగకున్న కడుపెరుగు.
30. కన్నొకటిలేదుగానీ (కా)కంతుడు కాడా?
31. కన్నొకటిలేదు గానీ కవాటంలాంటి బిడ్డ.
32. కన్యలో (కన్యామాసం=ఆశ్వయిజం) చల్లితే ఊదుకొని తినటానికి ఉండవు.
33. కన్యలో చల్లితే కనుగంతులకైనా చాలవు.
34. కపటము బయట దేవుడు, ఇంత దెయ్యము.
35. కప్ప కాతులేదు, బాపన పోటులేదు.
36. కప్ప కూతలు కూయు కాలభుజంగము.
37. కప్పలు అరుస్తూనే ఉంటవు, దరులేమో (గట్లు) పడుతూనే ఉంతవి.
38. కప్పలు ఎఱుగునా కడలిలోతు.
39. కప్పలు కూస్తే వర్షం కురిసినట్లు.
40. కప్పి పెట్టేస్తే కంపు కొట్టకుండా ఉంటుందా?
41. కప్పుర మిచ్చి ఉప్పు కొన్నట్లు.
42. కమలాసనుని కలహంసకు తూటికాడలే తిండి.
43. కమ్మ అండగాదు, తుమ్మ నీడకాదు.
44. కమ్మకు వరుసలేదు, కప్పకు తోకలేదు.
45. కమ్మ (కాపు) గుట్టు కడప దాటదు.
46. కమ్మని రోగాలు, తియ్యని మందులు.
47. కమ్మ నీచు కడిగినాపోదు, కాకిచిప్ప పెట్టి గోకినా పోదు.
48. కమ్మత్యాగంబు భువిలోన నమ్మకమ్మ.
49. కమ్మనీ, తుమ్మనీ నమ్మరాదు.
50. కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు.
51. కమ్మించి (ప్రోత్సాహించి) కడగా తొలిగేవాడు.
52. కమ్ముల దుప్పటికి కొమ్ముల బఱ్ఱె.
53. కయ్యానికైనా, వియ్యానికైనా, నెయ్యానికైనా సమత ఉండాలి.
54. కరక, తురక రెండూ భేదికారులే; ఒకటి లోపలికి పోవాలి; ఇంకొకటి దగ్గఱకు వస్తే చాలు.
55. కరక్కాయ కన్నతల్లి.
56. కరచీ కాటుబడనట్లు.
57. కరడి కాటు పడినవాడు కంబళి చూచినా భయపడును.
58. కరణం, కంసాలి కపటం మరువరు (విడువరు).
59. కరణం కాపు నా పక్కనుంటే, కొట్టరా మొగుడా, ఎట్లా కొడ్తావో-అన్నదట.
60. కరణం గంటమెత్తితే కంఠానికి రావాలిగానీ, లేకుంటే శంఠానికి రాదు.
61. కరణంతో కంటు, కాటికి పోయినా తప్పదు.
62. కరణంతో కంటు పడితే, కాడి కదలదు.
63. కరణం సాధుకాదు, కాకి తెలుపు కాదు.
64. కరణము గ్రామ దండుగ గోరు, జంబూకంబే వేళ శవము గోరు.
65. కరణముల ననుసరింపక విరసంబున తిన్నతిండి వికటించును.
66. కరణానికి కాపుకే జత, ఉలికి గూటానికే జత.
67. కరణానికి తిట్టుదోషం లేదు, చాకలికి ముట్టుదోషం లేదు.
68. కరణాన్నీ, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు.
69. కరణాలు కాపులు ఏకమయితే కాకులు కూడా ఎగురవు.
70. కరవగ వచ్చునే బలిమి గాడిదకున్ పులితోలు కప్పినన్.
71. కరవమంటే పామైనా కరవదు.
72. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.
73. కరికి ప్రాణము తొండము, సిరికి ప్రాణాము మగువ.
74. కరి గుట్టులో కాలుపెట్టదు, అంబటిలో వేలు పెట్టదు.
75. కరిని గాంచిన కుక్క మొరిగిన సామ్యమౌ.
76. కరువు కాలంలో ఒల్లని మొగుడు, పంతకాలంలో పంపమని వచ్చాడట.
77. కరువుకు గ్రహణాలెక్కువ.
78. కరువుకు చింతలు, కాలానికి మామిళ్ళు.
79. కరువుకు తోడు ఆవపంట కలిగినట్లు.
80. కరువుకు దాసరులైతే, పదాలెక్కడ వస్తాయి?
81. కరువుకు మామిళ్ళు, కాలానికి నేరేళ్ళు.
82. కరువునాటి కష్టలుండవు కానీ, కష్టాలనాటి మాటలుంటాయి.
83. కరువులో అధిక మాసం.
84. కరువులో అరువు.
85. కరువులో బిడ్డను అమ్ముకొన్నట్లు.
86. కరువు వస్తుందని సద్ది కట్టిపెట్టినట్లు.
87. కర్మకంతం లేదు, కాలానికి నిశ్చయం లేదు.
88. కర్మ చండాలుని కంటే, జాతి చండాలుడు మేలు.
89. కర్మంగాలి మొగుణ్ణి కంబట్లో కట్టి, భుజం మీద వేసుకుంటే, జారి వీధిలో పడ్డట్టు.
90. కర్కాటకం బిందిస్తే కాటకం ఉండదు (కర్కాటక మాసం=శ్రావణం).
91. కర్కాటకం వర్షిస్తే, కాడిమోకు కూడా తడవదు.
92. కర్ణుడులేని భారతం, శొంఠిలేని కషాయం ఒక్కటే.
93. కర్ణుని తల భారత మన్నట్లు.
94. కర్ణునితో ఉందమ్మా భారతయుద్దం అంతా అన్నట్లు.
95. కర్ణునితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి.
96. కఱకుల కళ్ళెం కల్యాణికి కాక గాడిదకేల? (కల్యణి=పంచ కల్యణి, గుఱ్ఱం).
97. కఱిచే కుక్కకు కఱ్ఱ అడ్డం.
98. కఱిచేది చెఱుకు, పట్టేది అనుము.
99. కఱ్ఱకు పెట్టినా, గొఱ్ఱెకు పెట్టినా చెడదు.
100. కఱ్ఱ చేతలేనివాణ్ణి గొఱ్ఱెకూడా కఱుస్తుంది.

No comments: