1. కాకి కావుమంటే, మొగుణ్ణి కౌగిలించుకొన్నట్లు.
2. కాకికి కంకెడులేదు, పిట్టకు పిడికెడులేదు.
3. కాకికూత బోలు కర్మ బంధుల కూత.
4. కాకి కూయగాలేచి, కాటుకమాదిరి అన్నం కాకరకాయ మిరియం చేసి, పసువులొచ్చే వేళకు పరుగెత్తి పరుగెత్తి వడ్డించిందట.
5. కాకి గూటిలో కోకిలపిల్ల వలె.
6. కాకి గూడు పెడితే కడపటి వర్షం.
7. కాకి చిక్కిన గొడ్డు డొక్కచీల్చునుగానీ, బలిసిన వసరం పొంత పోగలదా?
8. కాకిని కొడితే గద్ద చచ్చిందట.
9. కాకినితెచ్చి పంజరంలో పెడితే చిలుకపలుకు పలుకుతుందా?
10. కాకిపిల్ల కాకికి ముద్దు.
11. కాకిముక్కున దొండపండు వలె.
12. కాకి ముక్కెర తన్నుకొనిపోయి డొంకలపాల్చేయుగానీ తినగలదా?
13.కాకి సోమాల కుతురు-అంకమ్మకళల అల్లుడు (కాకిసోమాలు=వెఱ్ఱిచేష్టలు; అంకమ్మకళలు=అవ్యక్త చేష్టలు).
14. కాకులు అరుస్తూనే ఉంటవి, కరవాడ ఎండుతూనే ఉంటుంది. (కరవాడ=ఉప్పు పట్టించి ఎండపెట్టిన ఉప్పునీటి చేప).
15. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు.
16. కాకుల మధ్య కోకిల.
17. కాకులు రోకళ్ళెత్తుకు పోయినవి అన్నట్లు.
18. కాకై కలకాలం ఉండేకంటే, హంసై ఆరునెలలున్నా చాలు.
19. కాగల కార్యం గంధర్వులే తిరుస్తారు.
20. కాచిన చెట్టుకు కఱకు రాళ్ళు.
21. కాచినచెట్టుకే కఱ్ఱదెబ్బలు.
22. కాచినగంజి తాగనిస్తే నేను కమ్మనాయుడనే (కాపు) నే కాదు అన్నాడట.
23. కాటికి కాళ్ళుజాచి, తిండికి చేతులు జాచినట్లు.
24. కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.
25. కాటిపోయినా కాసు తప్పదు.
26. కాటికి పోయిన పీనుగు, కట్టెలపాల్గాక ఇంటికి వస్తుందా?
27. కాటి దగ్గఱి మాటలు కూటిదగ్గర ఉండవు.
28. కాతిలో పండినవి, కాకులు తిన్నవి-ఒకటి.
29. కాడికిందకి వచ్చిన గొడ్డు, చేతికిందకు వచ్చిన బిడ్డ.
30. కాడిన పోట్లలో కత్తితో గీకినట్లు. (కాడిన=గుచ్చుకొనిన, తెగిన)
31. కాడు కాలుతూ ఉంటే, కన్నె ఎదుగుతూ ఉంటుంది.
32. కాదు అంటే కళ తక్కువ, అవును అంటే ఆయుస్సెక్కువ.
33. కాదు అన్నవాడే కరణం.
34. కాదు కాదు అంటే, నాది నాది అన్నడట.
35. కాదనకుండా కట్టెనిచ్చెను గానీ వినబడకుండ వీరణాలు వాయించగలవా?
36. కానకుండ మాట్లాడే మాటా, కడగని గుద్ద ఒకటే.
37. కానని ముఖానికి గంధము అక్షతలు.
38. కానవచ్చే కొండలను గట్టెక్కి చూడటం ఎందుకు?
39. కాని కాలాన ఆలే పెండ్లం (వ్యంగ్యం).
40. కాని కాలానికి కంది అయినా కాయదు.
41. కాని కాలానికి కఱ్ఱే పామై కాటేస్తుంది.
42. కానికాలానికి పైబట్టను పక్షులెత్తుకు పోతాయి.
43. కానీకి టెంకాయ ఇస్తారని కాశీకి పోయినట్లు.
44. కానిచోట కందైనా కాయదు.
45. కాని దానికి కంతలు మెండు.
46. కానిపనులు సేయ ఘనులాస పడుదురా?
47. కానిదానికి కష్టం మెండు, చెల్లని కాసుకు గీతలు మెండు.
48. కానివాడు లేనివానితో జత.
49. కానివేళకు కందులే గుగ్గిళయినట్లు. (వ్యంగ్యం).
50. కానుగ నీడ-కన్నతల్లి నీడ.
51. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు.
52. కానుపుతో కూడా తల్లి చేసినట్లు.
53. కాపుకు నెనరు (విశ్వాసం) లేదు, కందికి చమురు లేదు.
54. కాపు చేసిన పాపం కళ్ళంతో తీరుతుంది.
55. కాపు జాడ, గొఱ్ఱె జాడ.
56. కాపుతోనే కఱువూ వచ్చింది.
57. కాపు మంత్రులలో కటేరిదైవము. (కటేరి=క్షుద్రదేవత).
58. కాపురం ఎట్లచేసావే కమ్మతిమ్మక్కా? అంటే, నువ్వు చెప్పినట్లు చేస్తినే బొచ్చుతిమ్మక్క అందట.
59. కాపురం గుట్టు, రోగం రట్టు.
60. కాపురం చేసే కళ, కాలుతొక్కేటప్పుడే కనపడుతుంది.
61. కాపరానికి కడగండ్లు, మొగనికి రేజీకట్లు.
62. కాపుల కష్టం భూపుల సంపద.
63. కాపుల చదువులు కాసులు నష్టం, బాపల సేద్యం భత్యం నష్టం.
64. కాపుల జాతకాలు కరణాలకెరుక.
65. కాపువాడి పస కావడి పంటే చెపుతుంది (పంటి=మట్టికుండ).
66. కాపువాళ్ళింట్లో పందిటి గుంజలుకూడా పనిబెట్టుతారు.
67. కామము కాలమెరుగదు.
68. కామమ్మ మొగుడంటె కామోసు అనుకున్నాను, కాకుంటే కావడి కుండలు పడేయండి.
69. కామరాజు గాదెలు, భీమరాజు పాదులు.
70. కామాతురాణాం న భయం న లజ్జా.
71. కామాతురుడు అర్ధకాంక్ష వీడడు.
72. కామానికి కళ్ళు లేవు, గుడీసేటికి గుణం లేదు (గుడిసేటి=లంజ, దేవదాసి).
73. కామిగాక మోక్షకామి గాడు.
74. కామినీ వేషధారికి సాధ్వి నడతలేమి తెలియును?
75. కామిరెడ్డి అనే భూతానికి, రామిరెడ్డి అనే రక్షరేఖ.
76. కామెర్ల రోగికి కనబడేదంతా పచ్చనే.
77. కాయ కొడవలి నీ చేతికిచ్చినా, నీ ఇష్టంవచ్చినట్లు చేసుకో.
78. కాయతిన్నా కంపే, గడ్డి తిన్నా కంపే.
79. కాయని కడుపు-కాయని చెట్టు.
80. కాయలో పత్తి కాయలో ఉండగానే-కామన్న కారు మూళ్ళు, నాకు మూడు మూళ్ళు (గుడ్డ).
81. కారణం లేక కార్యం పుట్టదు.
82. కారణం లేని కార్యం, పూరణం లేని బూరి, వీరణం లేని పెండ్లి ఉండవు (వీరణం=వాద్యవిశేషం).
83. కారణ గుణమ్ము కలుగదా కార్యమునకు?
84. కారములేని కూర, ఉపకారము లేని మనుష్యుడు.
85. కారాకు వలే కర్మం కాలిపోతుంది. (కారాకు=పండుటాకు).
86. కారాని కాలానికి రారాని పాట్లు.
87. కారాని కాలానికి కప్ప దెయ్యమవుతుంది.
88. కార్చిచ్చుకు గాడ్పు తోడయినట్లు.
89. కారుజొన్న మేసే కోడెకు కైలాసం కావాలా?
90. కారువరికి గొఱ్ఱెలమంద, పిషాణాలకు రొట్ట ఎరువు.
91. కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి.
92. కార్యం నాడు తలవంచుకొని, కలకాలం తలెత్తుకొని తిరుగ వచ్చు.
93. కార్తీకం కలకాశ, వైశాఖం పులకాశ.
94. కార్తీకం రానీ, కమ్మలు కడియాలు చేయిస్తానన్నాడట వైద్యుడు.
95. కార్తీకంలో కలవారి అమ్మాయి, కడవనీళ్ళు తెచ్చే పొద్దుకూడా ఉండదు.
96. కార్తీక పున్నానికి కలకపంతలు.
97. కార్తీక మాసానికి కాకులు తొక్కుతాయి.
98. కార్తీక మాసాన్న కడవలు కడుగ పొద్దుండదు.
99. కార్తీక మాసానికి కుదురంత ఉందునా, మాఘమాసానికి నా మహిమ చూపిస్తాను.
100. కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదిరినా (వదరినా) చెడుతుంది.
No comments:
Post a Comment