Thursday, November 25, 2010

సామెతలు 21

1. కార్తెమూల మెరుపు కార్తెకు బలం (కార్తెమూల= ఈశాన్యము, కృత్తిక నక్షత్రపు దిక్కు).
2. కార్తెమూల మబ్బు కారక మానదు.
3. కాలంతో కరవులేదు, మగనితో దరిద్రంలేదు.
4. కాలం కర్మం కలిసి రాకుంటే, కమలబాంధవునికైనా కష్టలు తప్పవు.
5. కాలం కానప్పుడు, ఆలే తేలై కరుస్తుంది.
6. కాలం గడచిపోవును, మాట నిలిచిపోవును.
7. కాలం తప్పినవాడిని పై (మీద) బట్టే పామై కరుస్తుంది.
8. కాలం తీరిందంటే, పమిటచెంగే పామై కరుస్తుంది.
9. కాలం నాటి కందిగింజ, పెద్దలనాటి పెసరగింజ.
10. కాలం పోతుంది, మాట నిలుస్తుంది.
11. కాలం మారి కంచు పెంకైనట్లు.
12. కాలం మూడిన వ్యక్తికి కాశీకిపోయినా సేగితప్పదు.
13. కాలంలో విత్తనాలు కలలోనైనా చల్లాలి.
14. కాలం వస్తే, గాడిదకాళ్ళు తిన్నన.
15. కాల కర్మగతుల కనిపెట్టవలెనయా.
16. కాలక్షేపంలేకపోతే, కంచిమేకను కొనుక్కోమన్నారు.
17. కాలతంతే పెరిగేది పుచ్చకాయ, కుళ్ళేది గుమ్మడీకాయ.
18. కాలను పాతకొయ్య, తాగను పాతకల్లు, నమ్మను పాత స్నేహితుడు, చదవను పాత పుస్తకాలు శ్రేష్టములు.
19. కాలమందు చేస్తే దేవతలకు ప్రీతి, అకాలమందు చేస్తే అసురులకు ప్రీతి; ఇద్దరివాతా మన్నుకొడతాను అన్నట్లు.
20. కాలమా ? యాలమా? కడకు చూడె పెళ్ళామా?
21. కాలమొక్కరీతి గడిపినవాడే గడచి బ్రతికినవాడు.
22. కాలానికి కడగండ్లు, దేశానికి (ముప్పు) తిప్పలు.
23. కాలికి చుట్టుకున్న పాము కఱవక మానదు.
24. కాలికి దూరమైతే కంటికి దూరమా?
25. కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.
26. కాలికి బలపం కట్టుకొని కడప ముగ్గులు పెడతాడు.
27. కాలికి రాని చెప్పును కంచెలో వేయమన్నారు.
28. కాలికి రాని చెప్పు కడగా ఉంచు.
29. కాలికోసం చెప్పులు ఒళ్ళో పెట్టుకోవాలి?
30. కాలినట్టి మ్రాకు కడురమ్యమై ఉండును.
31. కాలితో కదుపుకోవటం, చేతితో జుఱ్ఱుకోవడం.
32. కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగానీ, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా?
33. కాలిది తీసి నెత్తికి రాసుకున్నట్లు.
34. కాలిన గుడిసెకు పీకిన వాసమే లాభం.
35. కాలిన మన్నూ,కాలని మన్నూ అంటవు (అతకవు).
36. కాలి మెట్లు తలకెక్కినట్లు.
37. కాలి కడుగ ముంత లేదు, కల్లుకు కళాయి గిన్నె.
38. కాలికాలిన పిల్లి వలె (తిరుగాడుట).
39. కాలూ చెయ్యీ ఉన్నంతకాలం కాలం గడుస్తుంది.
40. కాలు జారితే గంగానమ్మదే మహిమ - అన్నట్లు.
41. కాలి జారితే తీసుకోగలం కానీ నోరుజారితే తిసుకోగలమా?
42. కాలి జారితే పడి, నేల అచ్చివచ్చిందికాదు అన్నట్లు.
43. కాలు జారినా మాట సాగినా పడమన్నారు.
44. కాలు జారితే పట్టుకోవచ్చును గానీ మాటజారితే పట్టుకోగలమా?
45. కాలు తొక్కినవేళ, కంకణం కట్టినవేళ.
46. కాలు తొక్కిన మొగుడేనుగంత, కనిపెంచని బిడ్డ బారెడంత.
47. కాలు పట్టుకొని లాగితే చూరు పట్టుకొని వ్రేలాడినట్లు.
48. కాలు వంగిన కానీ గంగానమ్మయినా పట్టదు.
49. కాలువ దాటలేని వాడు కడలి దాటగలడా?
50. కాలు విరిగిన ఎద్దే గట్టెక్కితే, కొమ్ము విరిగిన ఎద్దెక్కదా?
51. కాలే కడుపుకు మండే గంజి.
52. కాల్చిన పందికొక్కులకు కొట్లాట పెట్టేవాడు.
53. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
54. కాళ్ళకు చుట్టుకొన్న పాము కరవక మానునా?
55. కాళ్ళకు మొక్కేవాడుపోయి, కంఠాన్ని పట్టుకునేవాడు వచ్చినట్లు.
56. కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం, కాశీకి పోయినా దొరకదు.
57. కావడీ ఎన్ని వంకలు తిరిగితేనే? ఇల్లు చేరితే సరి.
58. కాశీకి పోగానే కఱ్ఱి కుక్క గంగిగోవు అవుతుందా?
59. కాశీకి పోయి కుక్కపిల్లను తెచ్చినట్లు.
60. కాశీకిపోయి కొంగరెట్ట తెచ్చినట్లు.
61. కాశికి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే.
62. కాశికి పోయినా కర్మం తప్పలేదు.
63. కాశికి పోయినా కావడి బరువు తప్పలేదు.
64. కాశికి పోయి వచ్చింది మొదలుకొని, కామిశెట్టి ఒక్కడే గుద్దకడీగేది మావూళ్ళొ అన్నాడట.
65. కాశిలో కన్ను మూసినా రాని పుణ్యం, కాళహస్తిలో కాలు పెడితే వస్తుంది.
66. కాశిలో కాసుకొక లంజ.
67. కాశిలో బెండను వదిలినాడుగానీ, ముండను వదలలేదు.
68. కాశివాసులైనా కానలేరు మోక్షంబు.
69. కాసిచ్చేదే గొప్ప కలిలో రాజులకు.
70. కాసీ పూసే చింతా, గన్నారపు సంత, నీళ్ళకడవముంత, నిద్రకేమి పుచ్చుకుంటావే?
71. కాసుకు కాలెత్తే దానికి కాశీయాత్ర కావలెనా?
72. కాసుకు గతిలేదు, కోటికి కొడి ఎత్తినాడు. (కొడి=పతాకము).
73. కాసుగలమ్మ కట్టవిప్పా, వీసంగలమ్మ విడవా మడవా.
74. కాసు గొడ్డుకు రూక బందె.
75. కాసును వెతుకగా రత్నము గన్న రీతి.
76. కాసుకు మూతినాకబోతే మూడు నూర్ల ముంగర పోయిందట.
77. కాసులకును దిరుగ కలుగునా మోక్షంబు.
78. కాసులేనివాడు కడు బ్రహ్మచారియౌ.


కి


79. కించిత్తు నల్లి గరచిన మంచమునకు పెట్లు వచ్చు.
80. కింద ఒకబొంత, మీద ఒకబొంత, నాకేమి చింత?
81. కింద పడినా మీసాలకు మన్ను కాలేదన్నట్లు.
82. కిందపడ్డా, పీటికి మన్ను కాలేదు (పీట=వీపు)
83. కిందపెట్టిన పంటలుండవు, పైన పెట్టిన వానలుండవు.
84. కిందబెట్టిన పంటెలుండవు, పైన పెట్టిన బానలుండవు.
85. కింద పడ్డా, పైచేయి నాదే అన్నట్లు.
86. కింద మట్ట రాలుతుంటే, పైమట్ట నానవేస్తుంది.
87. కిఱ్ఱులో కిఱ్ఱు కలిస్తే కంపేడకు పోతుంది?




కీ


88. కీలెంచి మేలెంచవలెను.
89. కీర్తిమార్గం కాటికే దారిచూపును.
90. కీలూడిన యంత్రం-తొండములేని ఏనుగు.
91. కీలెఱిగి వాత పెట్టలి.


కు


92. కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు (తల్లికి).
93. కుంచంలో కుదుళ్ళు పోసినట్లు.
94. కుంచాలమ్మ కూడువేస్తే, మంచాలమ్మ మాయం చేసిందట.
95. కుంచెడుంటే కుడికొప్పు, అడ్డెడుంటే ఎడమకొప్పు.
96. కుంచెడు గింజలకు కూలిపోతే, తూమెడు గింజలు దూడలు తినిపోయినవట.
97. కుంచెడున్నమ్మకు కూర్కు పట్టదు.
98. కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చినట్లు.
99. కూంజరాశి ఉన్న గుహ ప్రవేశించునే, సత్యహీనమైన జంబూకంబు?
100. కుంటి ఎద్దు రానిదే దూలమెత్తరు.

No comments: