Saturday, October 29, 2011

సామెతలు 76


1. మీబిడ్ద కింత తవుడంటే, మీబిడ్డ కిన్ని పాలు అన్నట్లు.
2. మీర లేని చుట్టం వస్తే, మిడకక తెల్లారదు.
3. మీసం పస మగ మూతికి.
4. మీసాల పసేగానీ, కోస నా బట్ట.
5. మీసాలు వడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటవని నమ్మక మేమి?
6. మీసాలెందుకు రాలేదురా? అంటే, మేనత్త (చాలు) చీలిక అని, గడ్డం వచ్చిందేమిరా? అంటే, అది మేనమామ పోలిక అన్నాడట.


ము


7. ముంజ ముదిరినా, లంజ ముదిరినా కొరగావు.
8. ముంజలు తిన్నవానికంటే, మోరులు తిన్నవానికే తంటా.
9. ముంజేతి కంకణానికి అద్ద మెందుకు?
10. ముంజేతిలో సత్తువ ఉంటే, మణికట్టులతో వడ్లు మొదుగుతాయి.
11. ముంజేయి ఆడితే, మోచేయి ఆడుతుంది.
12. ముంజేయి మళ్ళితేనే మోచేయి మళ్ళేది.
13. ముండకు దొరికేది మొరటు (మోటు) మొగుడే.
14. ముండాకొడుకే కొడుకు, రాజు కొడుకే కొడుకు.
15. ముండ చావనూ చావదు, ముట్టు తప్పనూ తప్పదు.
16. ముండ పెంచిన కొడుకు - ముకుదారం (తాడు) లేని కోడె.
17. ముండ ముప్పావుకు చెడ్డది, నరకుడు పావుకు చెడ్డాడు (నరకుడు=నరుడు).
18. ముండ మొయ్యవచ్చును గానీ, నింద మొయ్యరాదు.
19. ముండమోపి కాళ్ళకు మ్రొక్కితే, నీవూ నావలనే వర్థిల్లమని దీవించిందట.
20. ముండమోపి కేల ముత్యాల పాపిట.
21. ముండమోపి బలుపు - పాండురోగి తెలుపు.
22. ముండాకొడుకు మూటికి జెడితే, ముండ నూటికి జెడుతుంది.
23. ముండపై వలపుతో మోవి అనగానే జొల్లు, జుంటితేనె గాదు.
24. ముండ్లమీద పడ్డ బట్ట మెల్లిగా తీసుకోవలె.
25. ముండా కాదు ముత్తైదువా కాదు.
26. ముంత మూతికట్టు, సంచి సభ కట్టు.
27. ముంతెడు నీళ్ళకు ఉలిక్కి పడితే, బానెడు నీళ్ళు నీబావ పోసుకుంటాడా?
28. ముంతెడు పాలకు ముత్యమంత చేమిరి (మజ్జిగ).
29. ముందటివానికి ముంతం బలి, వెనకటివానికి తెడ్డెం బలి.
30. ముందరికాళ్ళకు బంధాలు వేసి, ముండల తాళ్ళు తెంపినట్లు.
31. ముందరికి వచ్చి కాలు విరుగపడ్డట్లు.
32. ముందరేరు పోతే, ఆరేరే ముందరే రౌతుంది.
33. ముందు అరకకు మొనగాళ్ళను కట్టవలె.
34. ముందు ఆకు (విస్తర) వేయించుకుంటే, రరువాత ఎప్పుడైనా తినవచ్చు.
35. ముందు(కుపోతే) గొయ్యి, వెనుక(కుపోతే) నుయ్యి.
36. ముందుకుపోతే మురికిముండ, వెనుకకుపోతే వెఱ్ఱిముండ.
37. ముందువచ్చే చండ్లను వెనుకకు నెట్టితే పోతవా?
38. ముందు చచ్చింది ముత్తైదువ, వెనుక చచ్చింది విధవ.
39. ముందు చూస్తే అయ్యవారి గుఱ్ఱంగా ఉంది. వెనుకచూస్తే సాహేబు గుఱ్ఱంగా ఉంది.
40. ముందుచేసిన తప్పు మూలను ఉంటే, వెనుకచేసిన తప్పు మంచం కాడికి వచ్చినట్లు.
41. ముందు నడిచే ముతరాచువాణ్ణి, వెనుకవచ్చే ఏనాదివాణ్ణి నమ్మరాదు.
42. ముందు నడిచే ముతరాచువాణ్ణి, ప్రక్కన వచ్చే పట్రాతివాణ్ణి నమ్మరాదు.
43. ముందు నడిపించి, కొంకులు కొట్తినట్లు.
44. ముందున్నది ముసళ్ళ పండుగ.
45. ముందున్నది ముసార్ల పండుగ.
46. ముందు పెళ్ళాం బిడ్డలు ముంత ఎత్తుక తిరుగుతూ ఉంటే, లంజకు బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.
47. ముందు పోటు, వెనుక తన్ను (ఎద్దు చేసే పని).
48. ముందుపోయేది ముండ్లకంప, వెనుకపోయేది వెన్నముక్క.
49. ముందు ముచ్చట్లు, వెనుక తప్పట్లు (చప్పట్లు).
50. ముందు మునగ, వెనుక వెలగ (ఇంటికి కూడదు).
51. ముందు మురిసినమ్మ పండుగ గుర్తెరుగదు.
52. ముందు ముల్లు త్రొక్కి, వెనుక భద్రం అన్నట్లు.
53. ముందు వచ్చినందుకు మున్నూరు వరహాలు దండుగ, మళ్ళీ ఏలవస్తివే? మాయదారి తొత్తా?
54. ముందు వచ్చిన చెవులకంటే, వెనుక వచ్చిన కొమ్ములు (వాడి) ఎక్కువ.
55. ముందు వచ్చినదానికి మూగుళ్ళు, వెనుక వచ్చినదానికి వేగుళ్ళు.
56. ముందువాగికి ముందోపులు, వెనుకవారికి దొప్పదోపులు.
57. ముందు వాళ్ళకి మూకి(కు)ళ్ళు, వెనుక వాళ్ళకు నాకి(కు)ళ్ళు.
58. ముందు సంతకి అరవు ఏడ్చింది.
59. ముందే ముక్కిడి పైన పడిశం.
60. ముక్కిడికి తోడు పడిశము.
61. ముక్కిడి కిచ్చిన నత్తు, విత్తిన మొలువని వితు.
62. ముక్కిడి తొత్తుకు ముత్యపు నత్తేల?
63. ముక్కిడిదాని పాటకు ముండోడి మెచ్చుకోలు.
64. ముక్కు ఉండేవరకు పడిశ ముంటుంది.
65. ముక్కు ఏదిరా? అంటే, తలతిప్పి చూపించాడట.
66. ముక్కు కోసినా, ముందటి మొగుడే మేలు.
67. ముక్కుకోస్తే మూడ్నాళ్లకొస్తుంది, కొప్పకోయరా కుమ్మరిమగడా.
68. ముక్కు చిన్నది, ముత్యం పెద్దది (ముక్కెర పెద్దది).
69. ముక్కు చొచ్చి కంట్లో ప్రవేశించినట్లు.
70. ముక్కు డుస్సిన పసరం లాగు.
71. ముక్కు దాటితే ముఱికి, నాలుక దాటితే నరకం.
72. ముక్కు నలిపి దీపం పెట్టమంటే, మొగుడి (మామ) ముక్కు నలిపిందట.
73. ముక్కు పట్టని ముత్యం, చెవు పట్టని కమ్మ.
74. ముక్కు పట్టిన వానిచేత చీదించినట్లు.
75. ముక్కు పట్టుకుంటే ప్రాణం పోతుంది (దుర్బలుడనుట).
76. ముక్కు మూరెడు, సిగ బారెడు.
77. ముక్కు మూసుకుంటే, మూడు ఘడియలు.
78. ముక్కు మొగం లేని బిడ్డ, మొదలు తుది లేని పాట.
79. ముక్కులో ఏవేలు పెట్టినా సరిపోతుంది.
80. ముక్కులో చీమిడొయ్! అంటే, నీచేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.
81. ముక్కులోని వెంట్రుక కొప్పులోనికి వచ్చి, మూగవాడు అమ్మా! అన్ననాటికి చూతాంలే.
82. ముక్కెడి ముక్కుకు తక్కెడు బంగారమట.
83. ముఖం అందం, ముడ్డికి చేటు.
84. ముఖము చూస్తే కనబడదా మీగాళ్ళ వాపు?
85. ముఖము తేట, ముడ్డి తీట.
86. ముఖము బాగోలేదని అద్దం పగులగొట్టినట్లు.
87. ముఖము మాడుపు దీపమింటికి కొరగాదు, ఱంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు, ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు.
88. ముఖములో సుఖంలేదు, మోకాళ్ళలో బిగువులేదు.
89. ముఖస్తుతి, చేసినవానిని చేయించుకొనినవానిని ఇద్దరిని చెరచును.
90. ముఖానికి ముక్కాసర, దండకు కొలికాసర.
91. ముఖాలు చూచి బొట్టు పెడతారు, పిఱ్ఱలు చూచి పీటవేస్తారు.
92. ముగ్గిరి మధ్య ముంత దాగింది.
93. ముగ్గుపిండి అట్లకు పనికి వచ్చునా?
94. ముగ్గురికి తెలిస్తే మూడులోకాలకు పాకుతుంది.
95. ముగ్గురిని కూల్చెరా ముండదైవం.
96. ముగ్గురు ఆడవాళ్ళు కూడితే, పట్టపగలే చుక్కలు పొడుస్తాయి.
97. ముగ్గురు బిడ్దలను కంటే, ముసలివానికైనా కొరగాదు.
98. ముగ్గురు మూడు లోకాలయితే, ముసలిది మాయలోకం.
99. ముగ్గురెక్కిన బండి పొలిమేర దాటదు.
100. ముచ్చు ముండకేల ముంజేతి కడియాలు?

No comments: