Sunday, October 23, 2011

సామెతలు 75


1. మామా! మామా! గోచి ఊడిందేమి? అని వదినె మరదళ్ళు అంటే, మిమ్మల చూచే లేండి, ఊరుకొండి- అన్నాడట.
2. మామిడికాయలు తరిగితే, కత్తిపీట వాదర పులుస్తుందా?
3. మామిడిచెట్టుకు మడిగుడ్డ కట్టి, దొంగలు ఎక్కరులే అన్నట్లు.
4. మామిడి మగ్గితే సజ్జలు పండును.
5. మామిళ్ళ కాఙ్ఞ గానీ, గుగ్గిళ్ళకు ఆఙ్ఞా?
6. మామిళ్ళకు మరణాలు, చింతలకు సిరులు (మామిడికాపు ఎక్కువైన సంవత్సరం అరిష్టము, చింతకాపు ఎక్కువైన సంపద అని).
7. మామిళ్ళు కాస్తే మశూచికాలు మెండు.
8. మామిళ్ళకు మంచు చెఱుపు, కొబ్బరికి కుడితి చెఱుపు.
9. మామిళ్ళు నరికి మోదుగలు నాటినట్లు (పువ్వులకు మురిసి).
10. మాయలవాడు మహితాత్ము సాటియా?
11. మా యింటాయన కెంత మతిమరుపంటే నీళ్ళలోబడి ఈదను మరచిపోయినాడు.
12. మా యింటాయన వ్రసింది మా యింటాయెనే చదువాలంటేం మా యింటాయన రాసింది మా యింటాయూనే చదువలెడన్నదట ఇంకొకతె.
13. మాయింటిమగవారు మమ్ము దొబ్బుటేగాని పొరుగింటి పోరుల పొంత పోరు.
14. మా ఇంట్లో తిని మీ ఇంట్లో చేయి కడుక్కో మన్నట్లు.
15. మాయ సంసారం- మంటి దొంతులు.
16. మారకం మొన్నటి మాదిరే, తిండి ఎప్పటి మాదిరే.
17. మారికి వారశూలా?
18. మారిన తనయింటికి రమ్మనినవానిని ఏమనాల?
19. మారుచీర లేక మేలుచీర కట్టుకొన్నట్లు.
20. మారుమనువు చేసుకొని, మొదటిమొగని సుద్దులు చెప్పినట్లు.
21. మారు పెట్టించుకోక (పోసుకోకుండాపోతే) మరల రాదు (మారు=మజ్జిగ, మరల పెట్టించుకొనుట).
22. మారు లేని తిండి మాల తిండి, దొరలేని తిండి దయ్యపు తిండి.
23. మారులోకానికి వెళ్ళినా, మారు తల్లి వద్దు.
24. మార్గశిరంలో మాట్లాడటానికి పొద్దుండదు.
25. మార్గశిరాన మామిడి పూత.
26. మార్జాలస్వప్నాలు మాంసం మీదనే.
27. మాలకు మాంసం గొడారికి తోలు (గొడారి=మాదిగ).
28. మాలకూటికి పోయినా నీళ్ళపప్పే.
29. మాలకూటికి లోబడ్డా పప్పుబద్ద దొరకలేదు.
30. మాలజంబం మల్ల (మూకుడు) మీద, వానజంబం ఊసరం మీద.
31. మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మదురెక్కి నీళ్ళచాయ కూర్చున్నదట (నీళ్ళచాయ=చెంబట్లు, దొడ్డికిపోవుట, నీటివైపుపోవుట అనుట).
32. మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మరికాస్త ముందరింట్లోకి వచ్చిందట.
33. మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మఱింత బిగుసుకొన్నదట.
34. మాలపల్లెలో మంగళాష్టకాలు.
35. మాలపున్నమ ముందర మాదిగవాడైనా చల్లడు.
36. మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
37. మాలబింకె(కా)లు మందబయలున, వానబింకాలు బొల్లిచవుళ్ళలోను.
38. మాలముద్దు వెన్నగాల్చి పెట్టబోయిందట.
39. మాలలకు మంచాలు, బావలకు పీటలా?
40. మాలవాడ కుక్క మఱి అన్న మెఱుగునా?
41. మాలవాడ(ను) కుక్క మరగిన చందంబు.
42. మాలవాడి పెళ్ళి మహసూల్ తో సరి (మహసూల్ = కుప్పనూర్పిళ్ళు).
43. మాలవాడు చేసినట్లు ఉండాల, సంసారి చెడ్డట్లే ఉండాల.
44. మాలాయగారికి తోలాయ గారు గురువు.
45. మాలీషు చేసినట్లూ ఉణ్దవలె, కాపు చెడ్డట్లూ ఉందవలె.
46. మాలోడికి నాకెందు కింతపెద్ద వాలగ అన్నాడట (వాలగ =ఒక రకమైన చేప).
47. మావాడు దెబ్బల కోరుస్తాడు అంటే, విడిపించే దిక్కులేక అన్నట్లు.
48. మావాళ్ళు వద్దన్నందుకు, మంగళగిరి తిరునాళ్లకు వెళ్ళినందుకు నాపని ఇంటే కావాలి- అన్నదట.
49. మావళ్ళు వద్దన్నదానికి, నేను వచ్చినదానికి, ఇతణ్ణపుదానికి, యిట్లానే కావాల కొట్టుకో మన్నదట.
50. మావి మాకిస్తే, మడిమాన్యా లిచ్చినట్లు.
51. మాస(ష) మెత్తు బంగారు మనిషిని గాడిద చేస్తుంది.
52. మాసికలేసిన గుడ్డ, దాసిదాని బిడ్డ.
53. మాసికలేసిన బొంత - లిద్ది వేసిన బండికుండ.
54. మాసికానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ.
55. మాసినతలకు మల్లెపూల అలంకారమా?
56. మాసేమో పెద్దమాసి, బుద్ధేమో గాడిద బుద్ధి (మాసి=మనిషి).


మి


57. మింగను మెతుకులేకుంటే, లంజకు లత్తుకట.
58. మింగను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అట.
59. మింగిన పిడసకు రుచి ఏమన్నట్లు.
60. మించినదానికి మంచి లేదు.
61. మింటికన్నా పొడుగు, నగరికన్నా ధాష్టీకం లేవు.
62. మింటికి మంటికి ముడివేసినట్లు.
63. మిండగాని జూచి గుందములో పడతాను అన్నదట.
64. మిండగాడు డబ్బివ్వకపోతే, మొగుడితో పోయినట్లనుకుంటాను పొమ్మన్నదట.
65. మిండడి ఈవి ఎంతో, లంజ మక్కువా అంతే.
66. మిండని నమ్ముకొని జాతరకు పోయినట్లు.
67. మిండల కొడుకుల సంపద దండుగలకే గాక (ఱండలకే గాక) దానధర్మము లగునా?
68. మిండలను మరిగినమ్మా, మీగడతిన్నమ్మా ఊరకుండరు.
69. మిగిలితే మిండడౌతాడు అన్నట్లు.
70. మిగిలిన సున్నాన్ని, మిగిలిన రాజును ఊరకే వదలరాదు.
71. మిట్టానువారి సైతాను మిడ్డెక్కి అదిలించినా పోదు.
72. మిట్టిపడును నరుడు చేటెరుగక.
73. మిడి(ణి)కి చచ్చేదాని ముందు కులికి చావాలి.
74. మిడిమేలపు మిండని ఉంచుకునేకంటే గట్టుకు మంచం మోయవచ్చు.
75. మిడుగురులు చీకట్ల నడచునా?
76. మిడుతంభట్లు జోస్యం వలె.
77. మిడుతంభట్లు తైతుల మిత్తి.
78. మితం తప్పితే, అమృతమైనా విషమే.
79. మితం తప్పితే, హితం తప్పుతుంది.
80. మిథునంలో పుట్టిన మొక్క, మీసకట్టులో పుట్టిన కొడుకు అక్కరకు వస్తారు.
81. మిద్దె ఉన్నవాడు బ్రతికి, గుడిసె ఉన్నవాడు చావడు.
82. మిద్దె మీద పఱుగు, మీసాలమీద మెఱుగు.
83. మినుములు తింటూ, అనుములు చేతిలో పెట్టినట్లు.
84. మిన్ను కలిగినా, కన్ను కలిగినా కారక మానవు (కలుగు=ఎఱ్ఱనగు).
85. మిన్నుపై బడినా మెలపుతో నఱచేతులొగ్గ జాలినవాడు.
86. మిన్ను విఱిగి మీదపడితే అరచేతితో అడ్డగలమా?
87. మిన్ను విఱిగి మీదపడ్డట్లు.
88. మిరపకాయ చిన్నదని మేల మాడరాదు.


మీ


89. మీఇంటి గేదె, మాఇంటి దూడ, తీసుకురా తిమ్మక్కా వీసెడు నెయ్యి.
90. మీ ఇంట్లో తినివచ్చి మాఇంట్లో చేయి కడుక్కోమన్నట్లు.
91. మీ ఊరు మా ఊరికెంత దూరమో, మా ఊరూ మీ ఊరికి అంతేదూరం.
92. మీకు మాట, మాకు మూట.
93. మీగడ మింగేవానికి వెన్న ఎట్లా వస్తుంది?
94. మీగాలి మీద పడిన మెతుకు మిట్టి మిట్టి పడ్డట్లు.
95. మీగాళ్ళు వాచినమ్మా! ంఈ ఇంట్లో ఓండ్లి ఎప్పుడూ? అంటే, మోకాళ్ళు వాచినమ్మా! మొన్ననే అయిపోయింది అన్నదట.
96. మీ గొడ్డు కింత నున్న అంటే, మా బిడ్డ కింత వెన్న అన్నట్టు.
97. మీద మిల మిల, లోన లొటలొట.
98. మీద మెరుగులు, లోన పురుగులు.
99. మీనమేషాలు లెక్క బెట్టినట్లు.
100. మీను మ్రింగిన గ్రుక్కెడుతో మున్నీటికి కొరత ఏర్పడుతుందా?

No comments: