Saturday, October 8, 2011

సామెతలు 73


1. మనిషి కోతి అయ్యే దెప్పుడంటే తానద్దం చూచుకొనేటప్పుడు
2. మనిషి మంచిచెడ్డలు తెలుసుకోవాలంటే అతనిని అధికారపీఠంలో పెట్టాలి.
3. మనిషికి ఉన్నది పుష్టి, పసరానికి తిన్నది పుష్టి.
4. మనిషికి ఒకమాట, పండు కొక రుచి (పశువు కొక దెబ్బ).
5. మనిషికి గాక కష్టాలు మాకులకు వస్తవా?
6. మనిషికి మాటే అలంకారము.
7. మనిషి కొక తెగులు మహిలో వేమ అన్నారు.
8. మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ.
9. మనిషి గబ్బు మారుమారు, నా గబ్బు తీరుతీరు.
10. మనిషి చస్తే మాట మిగులుతుంది, ఎద్దు చస్తే ఎముక మిగులుతుంది.
11. మనిషి తిండిమోయన దున్నపోతు తిండి-దెయ్యపు తిండి మధ్యన.
12. మనిషి పేదయితే, మాటకు పేదా? 
13. మనిషి పోచికోలు కాడు (పోచికోలు=వృద్ధుడు).
14. మనిషి బొమ్మవ్రాసి క్రింద మనిషి అని ఎందుకు వ్రాసావంటే, లేకుంటే కోతి అనుకుంటా రన్నాడట.
15. మనిషి మంచిదే కానీ గుణం గుడిసేటిది.
16. మనిషి మర్మము, మాని చేవ బయటకి తెలియవు.
17. మనిషి మీద పీడ మహిమీద పోయింది.
18. మనుగ(గు)డుపు పెండ్లికొడుకు వలె.
19. మనుగుడుపు నాటి మాటలు మనివిన నాడుండవు.
20. మనుజుడొకటి తలంప దైవమొకటి తలంచు.
21. మనువు చెడి ముండ బుద్ధిమంతురాలయింది
22. మనువు నిత్యం కాదు, ఏకులరాట్నం అమ్మబోకు అన్నట్లు.
23. మనువును నమ్ముకొని బొంత బోర్ల (పొయ్యిలో) వెసుకొన్నట్లు.
24. మను వొక్కచోట మనసు ఇంకొకచోట.
25. మనుషు లందరి తలపైనా మంగలి చేయ్యి.
26. మనుషులు పోయినా మాటలు నిలుస్తాయి.
27. మనోవ్యాధికి మందు లేదు.
28. మన్ననలేని మహీపతి కొలువు, లాలన లేని లంజ పొందు ఒకటే.
29. మన్ను తిని మంచినీళ్ళు త్రాగినట్లు.
30. మన్ను తిన్న పాము వలె.
31. మన్నును నమ్మి దున్నినవాడే మన్నీడు.
32. మన్ను పట్టితే బంగారం, బంగారం పట్టితే మన్ను.
33. మన్ను, మిన్ను మెత్తనయితే మనుష్యులకు బ్రతుకు.
34. మన్ను వెళ్ళకుండా దున్నితే, వెన్ను వెళ్ళకుండా పండును.
35. మన్మథవేదనకు, మందబుద్ధికి మందులేదు.
36. మన్మధుడే పురుషుడైనా మాయలాడి తన మంకుబుద్ధి మానదు.
37. మన్యం మఱిగిన మనిషి, మాదిగాడ (మాదిగపల్లి) మఱగిన కుక్క వెనక్కి రావు.
38. మప్పడం (మరపడం) తేలికే గానీ తిప్పడం కష్టం.
39. మబ్బును వెతుక్కుంటూ పైరుపోదు, ఆవును వెతుక్కుంటూ దూడపోదు.
40. మబ్బులు చెదిరిపోయినా వాననీరు నిలిచే ఉంటుంది.
41. మబ్బులో పొద్దు మాయమైపోతే, కోడళ్ళ ప్రాణాలు కొలికిళ్ళకొచ్చె.
42. మప్పులో పొద్దు మగడాలిని చెఱచును.
43. మమత విడువకున్న మానునా మానంబు.
44. మరుగుజ్జు మహామేరువు ఎక్కినా మరుగుజ్జే.
45. మరుదండపు మిడిసిపాటు మననీయదు.
46. మరుదండమునకు విలసనములు మెండు.
47. మఱచిపోయి చచ్చినాను, ప్రాణమా! రమ్మంటే వస్తుందా?
48. మఱచిపోయి మజ్జిగలో చల్లపోశాను అన్నట్లు.
49. మఱచిపోయి మజ్జిగలో చేమిరి వేసినట్లు (చేమిరి=తోడు పెట్టుట).
50. మఱచిపోయి మారుబొట్టులో మజ్జిగ పోసినానన్నట్లు (మారుబొట్టు=మజ్జిగ).
51. మరుగుభాషపై మన్నుపొయ్యి, గంజిలో ఇంత ఉప్పెయ్యి.
52. మరులున్న వాడే మగడు.
53. మరువముతోనే పరిమళము.
54. మర్యాదకుపోతే మానం దక్కదు.
55. మర్యాదరామన్న మాట తప్పినా, నా వేటు తప్పదు.
56. మఱ్ఱిచెట్టుక్రింద మొక్కలు మొలవవు, అయ్యక్రింద ఎవ్వరు ముందుకురారు.
57. మల నల్లబడితే వాన, చన్ను నల్ల బడితే బిడ్డ.
58. మలప గేదే మానెడు ఇచ్చును.
59. మలపసన్యాసికి మాచకమ్మకు జత.
60. మలబారులో చెవులు కుడుతారని మాయవరం నుంచి చెవులు మూసికొని పోయినట్లు.
61. మలలు మింగే మహదేవునికి తలుపొక అప్పడం.
62. మలుగులు క్రుంగితే (గుంజితే) మావటికి ఈనును (చూడుపసరం) (మలుగు= ముడ్డికీలు భాగం).
63. మల్ల తెచ్చుకో అయ్యా! అంటే మఱింత బువ్వెట్టు అన్నట్లు.
64. మల్లిని చెయ్యబోతే పిల్లి అయినట్లు.
65. మల్లీ! మల్లీ! మంచానికి కాళ్ళెన్ని? అంటే, మూడున్నొకటి అన్నదట.
66. మల్లె పట్టిన చేమవలె (మల్లె= ఒక చీడ వంటి కలుపు).
67. మసిపాతలో మాణిక్య మట్లు.
68. మసిపూసి మారేడును నేరేడు చేసినట్లు.
69. మసిబొగ్గు కస్తూరి మహిమ దీపించినా పరిమళానంద సౌభాగ్య మీదు.
70. మసి మొగము వాడు, చమురు కాళ్ళ వాడు పోగయినట్లు.
71. మసీదికాలె మదార్ సాబ్ అంటే, సందెడు బొంతలు చంకనున్నాయి అన్నాడట.
72. మహాంతమైన లొల్లి మానెడు వడ్లు అలుకదు.
73. మహాభారంలో ఆదిపర్వతం అన్నట్లు.
74. మహామహావాళ్ళు మడుగులో పడుతుంటే కోణంగి దాసరి కోనేటిలో పడెనంట.
75. మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే పుల్లాకు నా గతేమి అన్నదట.
76. మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే, గోడ చాటు వారికి శరణు శరణు.
77. మహామహావాళ్ళు మన్ను మూకుళ్ళు అయిత్యే, నీవొక జల్లిమూకుడివి.
78. మహారాజావారని మనవిచేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట.
79. మహారాజుకైనా మన్ను నమ్మిన వాడే అన్నం పెట్టాలి.
80. మహారాజు పెంతదింటే మందుకు, పేదవాడు తింటే కూడులేక అన్నట్లు.
81. మహారాజులమే కాని, పొయ్యి రాజదు.
82. మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి.
83. మహావృక్షం క్రింద మొక్కలు పెఱుగవు.


మా


84. మాంసం తింటామని ఎముకలు మెడకు కట్టుకుంటామా?
85. మాంసం తింటాడని పేగులు మెడలో వేసుకుంటాడా?
86. మాంసం తినేవాడు పోతే, బొమికెలు తినేవాడు వస్తాడు.
87. మాంసం మాంసాన్ని పెంచుతుంది.
88. మాంసమంటే సైసుయ్ పైసలంటే కైకుయ్
89. మా ఆయనే ఉంటే, మంగలివాణ్ణి అయినా పిలుచుకు వచ్చేవారు కదా.
90. మా ఇంటాయనకు మగతనముంటే, పొరుగింటాయన పొందెందుకు?
91. మా యింటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?
92. మా కాయుష్యమస్తు! మా కారోగ్యమస్తు! అని దీవించుకొనినట్లు.
93. మాకు కుడుము, మీకు వక్క (మూకుడు).
94. మాగి చెడ్డ గొడ్డు మాదిగింటికైనా తగదు.
95. మాగి పొద్దు మాటాడ దీరదు.
96. మాగిలి దున్నితే మరింత పంట.
97. మాగిలి దున్నితే మాలవానికైనా పైరగును.
98. మాఘ(ఖ) ,మాసపు చలి మంటలో పడ్డా తీరదు.
99. మాఘమాసపు వాన - మగడులేని చాన.
100. మాఘమాసంలో మ్రాకులు సైతం వణకును.

No comments: