Saturday, November 5, 2011

సామెతలు 77


1. ముట్టుకుంటే ముత్యం, పట్టుకుంటే బంగారం.
2. ముట్టుకున్న మూడు దండుగలు.
3. ముట్లుడిగిన తర్వాత సమర్త సారె పెట్టినట్లు.
4. ముట్లుడిగిన దానికి (సతికి) మగబిడ్డ పుట్టినాడన్నట్లు.
5. ముడిబియ్యం తింటే, ముప్పు గడుస్తుందా?
6. ముడి మూరెడు సాగదు.
7. ముడివాటు సవాలుకు బ్రహ్మవాటు జవాబు.
8. ముడి వేసాక ముండైనా ముతకయినా తప్పదు.
9. ముడుపులు వెంకటేశ్వరుడికి, కేకలు గోవిందుడికి.
10. ముడ్డికాల్చి మూతికి వెన్న రాచినట్లు.
11. ముడ్డికిందకు నీళ్ళు వస్తే లేవక మానదు.
12. ముడ్డికి పేడ ఉన్నదెల్ల, బండి ఎద్దేనా?
13. ముడ్డిగిల్లి జోల పాడినట్లు.
14. ముడ్డి మీద తన్నితే మూతి (నోటి) పండ్లు రాలినట్లు.
15. ముడ్డిలో కారం చల్లి, విసనకఱ్ఱతో విసరినట్లు.
16. ముడ్డిలో జబ్బో, ముద్దలో జబ్బో తేలితేనే మందు.
17. ముడ్డిలో పుండుకు మేనమామ వైద్యం.
18. ముతకో సతకో మూడుబట్టలు, కుంటో గుడ్డో ముగ్గురు పిల్లలు.
19. ముత్తెమంటి ముతరాచకులం చేపలు దిని చెడిపోయినట్లు.
20. ముత్తిని విడిచి సత్తిని తగిలించుకొన్నట్లు.
21. ముత్యమంత పదునుంటే, మూలాకార్తెలో చల్లినా ఉలవచేను కాయును.
22. ముత్యాలు పగడాలు, ముట్టుకున్న జగడాలు.
23. ముత్యపుచిప్ప లన్నిటికి ఒక రేవు, నత్తగుల్ల లన్నిటికి ఇంకొక రేవు.
24. ము(మొ)దలియారి జంభం ఆముదానుకి చేటు.
25. ము(మొ)దలియారుకు ఏమున్నదంటే, ఒక గుఱ్ఱపుబండి, యిద్దరు ముండలు, ఇంత బుడ్డ అన్నాడట.
26. ముదికొమ్మ, ముదిమాను చేవ.
27. ముదికొమ్మ వంగదు, ముదికొమ్మ కనదు.
28. ముదికొమ్మ వంగదు, ముదిగొడ్డు ఈనదు.
29. ముదిత చను మెత్తదైనా అధికారం మెత్తనైనా రోతురు.
30. ముదిముప్పున (ముసలి ముప్పందాన) అంగటి ముల్లు.
31. ముది మదితప్పిన మూడు గుణాలు.
32. ముదిముండ పాతివ్రత్యమునకు జొచ్చినట్లు (వృద్ధనారి పతివ్రత)
33. ముదిమికి ముచ్చట్లు లావు.
34. ముదియగా ముదియగా మోహము లావు.
35. ముదిరి చచ్చినా, ఎండి ఇడిసినా వగపులేదు.
36. ముదురున వెసిన పైరు, ముదిమిన పుట్టిన కొడుకు.
37. ముద్ద తలతిరిగి నోటికి వచ్చినట్లు.
38. ముద్ద ముద్దకీ బిస్మిల్లానా?
39. ముద్దరాలు మగడు ముదుసలి(ని) మెచ్చునా?
40. ముద్దవేసిన తట్టు, మూతినాకుడు మాటలు.
41. ముద్దు చేసిన కుక్క మూతి నాకును, చనువు చేసిన భార్య చంక కెక్కును.
42. ముద్దున పేరు చెడె, మురిపాన నడక చెడె.
43. ముద్దులయ్య పోయి, మొద్దులయ్య అయినాడు.
44. ముద్దులాడితే ముక్కు నొక్కినట్లు.
45. ముద్దు మురిపం మావంతు, ముడ్డి దొడ్డి మీవంతు.
46. ముద్ర ముద్రగానే ఉండగా, ముగ్గురు బిడ్డల తల్లి అయినట్లు.
47. ముద్రలందు లేదు మూలమందేగాని.
48. మునగ చెట్టుకు మున్నూరు రోగాలు.
49. మునిగింది ముర్దారు, తేలింది హలాలు (ముర్దారు=అపవిత్రము; హాలాలు=పవిత్రము).
50. మునిగితే గుండు, తేలితే బెండు.
51. మునిగేవానికి తెలుసు నీటి లోతు.
52. మునిమాపటిమాటలు ముందుకు రావు.
53. మునుపుచెడ్డ ముత్తెమ్మా, గరిగబుడ్డి సమంగా బెట్టు.
54. మున్నీరుచే యీత నీదినట్లు.
55. మున్నూట అరవైనాలుగు శిగములున్నా ఒకటే, ముఫైఆరు గుల్లికొప్పు లున్నా ఒకటే.
56. మున్నూటరువది రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి.
57. మున్నూటికులానికి ముప్పు లేదు, మొండికాలికి చెప్పు లేదు.
58. మున్నూరు కాపత్తకు ముష్టికోడలు.
59. మున్నూరు రూపాయలిచ్చి అయినా, ముసలిదానిని కొనాల.
60. మున్నూరు వరహాలు పోయె, మూతి మీసాలు పోయె, నంబి సోమయాజులు అన్నమాట తప్పదాయె.
61. మున్నూరు శిఖలైనా కూదవచ్చును గానీ, మూడు కొప్పులు కూడరాదు.
62. ముప్పదిమూడుకోట్ల దేవతలు ముక్కు పట్టించగలరుగానీ, నారాయణా అనిపించగలరా?
63. ముప్పదిమూడు దున్నపోతులు కడిగేవాడికి, మూడు సాలగ్రామాలు ఒక లెక్కా?
64. ముప్పదియారు (ముప్ఫైయారు) జట్లు కూడుతాయిగానీ, మూడు కొప్పులు కూడవు.
65. ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు.
66. ముప్ఫై తట్టల పేడ మోసే పోలికి, మూడు పుంజాలదండ బరువా?
67. మురగన్న సందేహం, నిస్సందేహం.
68. మురికి భాండమునకు ముసరు ఈగల రీతి.
69. మురికిముండ ముచ్చట పేలపిండి చేటు.
70. మురికి మురికి ముత్తైదువకంటే, వెల్లడియైన విధవ మేలు.
71. మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు దీపం చేటు.
72. మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు ప్రాణం చేటు.
73. మురిపెమునకు మూడు నల్లపూసలు, కొలికికి ఒక తిరగలిరాయి.
74. ముంగ కాయకు ముండ్లెన్ని? అంటే, కాకరకాయకు గంట్లెన్ని? అన్నట్లు.
75. ముల(లు)గ కాయకు తగిన ముండ్లు, కాకరకాయకు తగిన కరకులు.
76. ములగ చెట్టుమీద కాకి గూటి వలె.
77. ముల్లాలు తిండికిలేక మొత్తుకుంటుంటే, పీర్లకు పంచదారా?
78. ముల్లును తీయను ముల్లే కావాల - దొంగను పట్టను దొంగే కావాల.
79. ముల్లుగట్టి (కట్టె; కోల) ఎడుగండ్ల ఎద్దులను నిలిపివేసినట్లు.
80. ముల్లుతీసి (పుచ్చి) కొఱ్ఱడచిన చందము.
81. ముల్లుతీసి గూటం కొట్టుకొన్నట్లు.
82. ముల్లును ముల్లుతోగాక రోకట దీయుదురా?
83. ముల్లు ముంతనేగాని పోదు.
84. ముల్లు వచ్చి అరటాకు మీదపడ్డా, అరటాకు వచ్చి ముల్లుమీద పడ్డా ఆకుకే మోసం (అపాయం).
85. ముషిణిచెట్టు అయినా, పచ్చని చెట్టు కొట్టరాదు (ముషిణి=ముష్టి; విషవృక్షం).
86. ముష్టికి నష్టి ఏమి?
87. ముష్టికి పోయి, తుష్టి లేదని ఏడ్చినట్లు.
88. ముష్టికి మూడు సంచులా?
89. ముష్టి మూడువిధాల (అందాల) సేద్యం.
90. ముష్టిలో ముష్టి, ధర్మముష్టి.
91. ముసలమ్మా! బుఱ్ఱ వణికిస్తావేమి? అంటే, ఊరకుండి నేనేమి చేస్తా నన్నదిట.
92. ముసలాడికి వగలాడి ఆలైనా, ఆత్రపు విటకానికి అతిభాషి లంజైనా వెతలే.
93. ముసలాపె (ముసలి ఆపె)తో వసంతా లాడినట్లు.
94. ముసలి ఆవు (పసరం) పేడ ముడ్డిలో ఉన్నా ఒకటే, దొడ్లో (చేటలో) ఉన్నా ఒకటే.
95. ముసలి కాలానికి ముప్పతిప్పలు.
96. ముసలికి ముఱ్ఱాట, బేపికి తొగురాట (ముఱ్ఱాట=మూల్గుట).
97. ముసలి కుక్కలు ఊరకె మొరగవు.
98. ముసలి ముండకేల ముసిముసి నగవులు?
99. ముసలిదానికి పెట్టినది, ముండకు పెట్టినది ఒకటే.
100. ముసలిదానికి ముండ ముద్దు.

1 comment:

Raja Sekhar said...

సార్ మీ బ్లాగ్ లో సామెతలు బాగున్నాయి.
వీటికి తెలుగులో అర్థాలు ఉంటే తెలుపగలరు.
ధన్యవాదాలు