Sunday, November 20, 2011

సామెతలు 80


1. మొదటికే మోసమైతే, లాభానికి గుద్దులాట.
2. మొదటికే మోసమైతే, వడ్డి ముట్టలేదన్నాడట.
3. మొదటి చూపుకే కలిగిన వలపుకు కాలయాపన లేదు.
4. మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కల్యాణమట.
5. మొదటి పెండ్లి అవసరము, రెండోపెండ్లి అవివేకము, మూడోపెండ్లి అపస్మారకము.
6. మొదటిముద్దుకే మూతిపండ్లు రాలినట్లు.
7. మొదలుంటే పిలకలు పెడుతుంది.
8. మొదలు మునిగితే వడ్డి మునుగదా?
9. మొదలు చేవలేక తుద నెట్లు కలుగురా?
10. మొదలు మోదుగ పూస్తే, కొన సంపెంగ పూస్తుందా?
11. మొదలు లేదు శ్రీరామా! అంటే, మొలతాడు లేని పాతగోచి అన్నాడట.
12. మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ఒక్కదేవరకైనా మొక్కాక్కా అన్నదట.
13. మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ముంతేది పెద్దక్కా అన్నదట.
14. మొదళ్ళు మీకు, మోసులు మాకు.
15. మొదలు విడిచి కొనలకు నీళ్ళు బోసినట్లు.
16. మొదలే కుంటికాలు, దానికితోడు పక్షవాతం.
17. మొదలే కోతి, పైగా కల్లు తాగినట్లు.
18. మొదలే మన్ను, కఱవు వస్తే గడ్డలు.
19. మొద్దు (మోటు) ముందకు దొరికేదంతా మోటు శిశినాలు.
20. మొద్దు మొగానికి తోడు, గరుడసేవా?
21. మొప్పెకు మూరెడు నోరు.
22. మొప్పెకు మొగిలిపువ్విస్తే, మడిచి (ముడ్డి) గుద్దలో పెట్టుకున్నదట.
23. మొయిలువిడిచిన యెండ, మొగుడువిడిచిన ముండ, పట్టివిడిచిన మండ, ఎత్తివిడిచిన కుండ.
24. మొఱకకు సివమెత్తిన మ్రొక్కక తప్పదు.
25. మొఱిగే కుక్క కఱవదు (అరిచే కుక్క).
26. మొఱ్ఱలో మొఱ్ఱ మొండిచెయ్యి చూపించేయి.
27. మొఱ్ఱో! మొఱ్ఱో! వద్దనగా, లింగం కట్టేరుగానీ మొక్కచేతులు తేగలరా?
28. మొలది విప్పి తలకు చుట్టినట్లు.
29. మొలబంటి దుఃఖంలో, మోకాలిబంటి సంతోషం.
30. మొలిచేచెట్టు మొలకలోనే తెలుస్తుంది.
31. మొసలిబావా! కడిమిచెట్టు వేరాయెగానీ, కాలైనా ఇంతేకదా.


మో


32. మోకాటిలో మెడనరం పట్టిందంటే, మీద పట్టి వేయమన్నట్లు.
33. మోకాలు ముణిగింది అని ముక్కు మూసుకుంటారా?
34. మోకాలెత్తు విగ్రహముంటే, మొలలోతు కూడు.
35. మోకాలెత్తు ముందుకు, మోచేతులు వెనక్కు.
36. మోచినమోపును ఇందరు మోయవలెనా?
37. మోచేతిదెబ్బ చూడక, ఱాచిప్పకు అతుకు పెట్టబోయినట్లు.
38. మోచేతి దెబ్బ - మొగుడింటి కాపురం.
39. మోచేయిపోయి మొకరానికి తగిలినట్లు (మొకరము=స్థంభము).
40. మోటుకు కోపం ముక్కు మీద.
41. మోతకు పొమ్మంటే, ఆటకు పెట్టినాడు.
42. మోటువాడికి మొదటిచోట కంపు, వన్నెగాడికి మూడుచోట్ల కంపు.
43. మోటువాడి కేమితెలుసు మొగలిపువ్వు వాసన.
44. మోట్లుకొట్టగా మగనితో గూడలేస్తే, గుడ్డబట్టలు దులుపేవఱకే కూటివేళాయె.
45. మోతచేటేగానె మోక్షంబు లేదయా.
46. మోతనీటిలో యీత యీదినట్లు.
47. మోదుగపువ్వు అందము - పసిమిరోగము మిసిమి.
48. మోపూరువాళ్ళ మొగుళ్ళు చస్తే, తలమంచివాళ్ళు తాళ్ళు తెంచుకొన్నట్లు.
49. మోసేవానికి తెలుసు (కావడి) బరువు.
50. మోక్షానికిపోతే మొసలి యీడ్చుక (ఎత్తుకొని) పోయిందట.
51. మోహభ్రమని జిక్కి మొనగాడు నీల్గడా?


మౌ


52. మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి.
53. మౌనం మర్ధంగీకారం
54. మౌల్వీలు మదురు మేస్తుంటే, పీర్లకు పిండివంటలా?


మ్రా


55. మ్రానిపండ్లు మ్రానుక్రిందనే రాలును.


మ్రు


56. మ్రుగ్గు వేయనివారిని యముడు, జాంబవంతుని వెంత్రుకలు పెరక బెడతాడట.


మ్రొ


57. మ్రొక్కబోయిన గుడి ముక్కలై మీదపడ్డట్లు.
58. మ్రొక్కబోయిన దేవు డెదురైనట్లు.
59. మ్రొక్కిన మ్రొక్కు చక్కనై, మగనికండ్లు రెండూపోతే, ఆరుగాళ్ళ జీవాన్ని దేవునకు అర్పితం జేతు నన్నదిట (ఆరుగాళ్ళ జీవం=ఈగ).




60. యజమాని చూడని చేను ఎంత పెరిగినా నష్టమే.
61. యజమాని చూదని చేను ఏడుగాడు. (ఏడుగాడు=చెడిపోవుట).
62. యఙ్ఞంచేసి రంకు తెలుపుకొన్నట్లు.
63. యఙ్ఞానికి ఏమి యత్నమంటే, కత్తులు, కటార్లు అన్నట్లు.
64. యఙ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.
65. యతి అంటే, ప్రతి అన్నట్లు.
66. యతికొఱకు పోతే, మతి పోయింది.
67. యతిమతం మగనికి ఎత్తుబారపు పెండ్లాం (యతిమతం=వెఱ్ఱివాలకం, యతివలె నుండుట).
68. యత్రజంగం తత్ర బిక్షమన్నట్లు.
69. యథార్థవాది లోకవిరోథి.
70. యథార్థానికి ఏడుచుట్ల తెరలు అక్కఱలేదు.
71. యమునికి, శివునికి వెరువనివాడు.
72. యముడు ఒక్కణ్ణిచంపితే, ఏతాము ముగ్గురిని చంపుతుంది.


యా


73. యాదవకులంలో ముసలం పుట్టినట్లు.
74. యాచమనాయని త్యాగము గోచులకేగాక కట్టుకోకల కగునా?
75. యానాదివాదు గుద్ద కడిగినట్లు.
76. యానాది లగ్నానికి ఏనాడైతే ఏమి?


యు


77. యుగయుగాలనాటి యుదిష్టిరుడు వలె.


యె


78. యెట్టు (వెట్టు) గొట్టిన రూక, గట్టు విడిచిన లంజ.


యో


79. యోగమందు గలదె భోగమందున్నట్లు.
80. యోగికి, రోగికి, భోగికి నిద్ర లేదు.




81. రంగడా విభీషణునికి పంగనామ మిడినరితి
82. రంగడికి లింగడికి స్నేహం, రొట్టెకాడ గిజగిజలు.
83. రంగము సొమ్ము, ఱంకుసొమ్ము నిలువదు (రంగము=రంగూను).
84. రంగుల దుప్పట్లు వీగొంగడికి సరిపోలవన్న గువ్వలచెన్న.
85. రండ కొడుకైనా కావలె, రాజు కొడుకైనా కావలె.
86. రండ తుపాకీ కాలిస్తే, గుండు గాలికి పోయిందట.
87. రండ రాతకు పెండ సిరా (పెండ=పేడ).
88. రండరాజునకు గొండడు దళవాయి.
89. రందిగాడికి రేయింబవలు తెలియదు.
90. రంభ చెక్కిలి నొక్కి రాట్నం తెచ్చినట్లు.
91. రంభయైన తన కుచకుంభముల్ తనచేత తాబట్టుకొనిన సుఖము లేదు.
92. రక్కసి ఆలుకు అనదమగడు.
93. రక్షచాలని మృగేంద్రుని నక్కయు గోలుపుచ్చు.
94. రచ్చకెక్కిన సభలో రాయబార మేల?
95. రజకుని గానము, రండా ప్రభుత్వము.
96. రట్టూ, రవ్వా రావిపాటి వారిది, పుస్తే పూసా పూసపాటి వారిది.
97. రతిలేని నాతి (పరుగు) గతిలేని గుఱ్ఱము రాణించవు.
98. రతిలో సిగ్గు, రణములో భీతి కొరగావు.
99. రత్నం బొరునిచే నన్వేషింపబడును గానీ, యెరు నన్వేషించునే?
100. రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు.

No comments: