Tuesday, November 15, 2011

సామెతలు 79


1. మేకకు తెలిసిందంతా మేత సంగతే
2. మేకకు మెడచన్నులు, తాళ్ళకు (తాడిచెట్లకు) తలచన్నులు.
3. మేకపిల్లను చంకలో బెట్టుకొని ఊరంతా వెదకినట్లు.
4. మేక పెంటిక ఎక్కడున్నా ఇక్కటే.
5. మేక(పో)బోతు గాంభీర్యం - మాచకొమ్మ సౌందర్యం.
6. మేక మెడచన్ను కుడిస్తే ఆకలితిరునా?
7. మేక మెడచన్నులకు పాలు, మేడికి పూలు లేవు.
8. మేక మెడచన్నులు పిసుకను పిండను పనికిరావు.
9. మేక మెడచన్నులు (నిష్ప్రయోజనములు అనుట - అజాగళస్తనాలు).
10. మేక మేయని ఆకు ఏదంటే - బండి ఆకు, రాట్నపు ఆకు.
11. మేకలు తప్పించుకొంటే తుమ్మలు, మాలలు తప్పించుకొంటే ఈదులు (ఈదులు= ఈతచెట్ల తోపులు).
12. మేకలే మడకలు దున్నితే, ఎద్దులు ఎవరికి కావాల?
13. మేకవన్నె పులి.
14. మేకశిరం మెత్తగా ఉన్నదని మఱికాస్త లాగాడట.
15. మేఘాలు నలుపైతే వాననీళ్ళు నలుపగునా?
16. మేడలు గుడిసెలు కావడం కన్నా, గుడిసెలు మేడలు కావడం మేలు.
17. మేడిపండు జూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.
18. మేడసిరి కీడు చేయదు (మేడసిరి = అత్తిబాగా కాలి పేలుట).
19. మేతకన్నా మసలితేనే బలం.
20. మేతకరణమే గానీ కూతకరణం గాదు.
21. మేతకేగాని చేతకు (కూతకు) కొరగాడు.
22. మేదరసాల దుర్గంమీద మేకకాలంత మొయిలువేస్తే, తుల్లూరు దొందపాడు కాయ దూడకట్టు అయినా కాదు.
23. మేనత్తపోలిక, మేనమామ చీ(చా)లిక.
24. మేనత్త మూతికి మీసాలు ఉంటే చిన్నాయన అవుతాడు.
25. మేనమామకైతే ఇవ్వడు, పోలుబొందలలో పెడతాడు.
26. మేపే రూపు.
27. మేమే అంటే మెడలెక్కి కూర్చున్నాడట.
28. మేయబోతే ఎద్దుల్లోకి, దున్నబోతే దూడల్లోకి.
29. మేయబోయి మెడకు తగిలించుకొన్నట్లు.
30. మేలుమేలంటే, మెడ విరగబడ్డట్లు.
31. మేలోర్చలేని అబ్బకుతోడు మూగతల్లి దొరికినట్లు.
32. మేసేగాడిదను కూసేగాడిద (వచ్చి) చెఱచిందట.
33. మేసేజన్మలు మేతలు మానినవి, పలుకులు మానండఱ్ఱా పంజరాల చిలుకల్లారా అన్నట్లు.
34. మేస్త్రీలు మేడకట్టితే, కుక్కకాలు తగిలి కూలిపోయిందట.
35. మేహజాడ్యం, తోట సేద్యం.


మై


36. మైనపుగోడలను గురించి కంచుగోడలు కాలిపోయినవట.
37. మైనపు ముక్కువాడు (ఏవైపంటే ఆవైపుకు తిరుగుతాడు).


మొ


38. మొండి ఈతకు (యీనితే) మోపుడు జూక లన్నట్లు.
39. మొండికి తగ్గ మిండడు.
40. మొండికి సిగ్గులేదు, మొరడకు (మొరటుకు) గాలిలేదు.
41. మొండికీ, బండకు నూరేండ్లాయుస్సు.
42. మొండి కెక్కినదాన్ని మొగుడేమి చేయు? రచ్చ కెక్కినదాన్ని రాజేమి చేయు?
43. మొండికెత్తితే మొగుడేమి చేస్తాడు? బండ కెత్తితే బావేమి చేస్తాడు?
44. మొండి గురువు, బండ శిష్యుడు.
45. మొండిచెట్టు గాలికి మిండడు, మొలకులేనివాడు దొంగలకు మిండడు.
46. మొండిచేతితో మొత్తుకున్నట్లు.
47. మొండిచేతితో మూరవేసినట్లు.
48. మొండిచేతి వానికి నువ్వులు తిననేర్పినట్లు.
49. మొండిచేతుల పెండ్లానికి మోదకాళ్ళ మొగుడు.
50. మొండితోక గొడ్డు రాగోరును, గుడ్డిగొడ్డు పోగోరును.
51. మొండిదానా! నీ మొగుడేమి చేసినాడంటే, అటుకొట్టి ఇటుకొట్టి వాడే పోయాడు అన్నదిట.
52. మొండిమొగుడి పెండ్లికెళ్ళి, అర్థరాత్రివేళ అడ్డగోడ చాటునుండి అర్థరూపాయి కట్నం చదివించిందట.
53. మొండిముక్కున ముక్కెర ఉంటే, మూతి తిప్పడమే ముచ్చట అనుకొన్నదట.
54. మొండివాడు రాజుకంటే బలవంతుడు.
55. మొండివాని హితుడు బండవాడు.
56. మొక్క అయి వంగనిది మ్రానై వంగునా?
57. మొక్కజొన్న కండె (కంకి) ముక్కలై మీదపడ్డట్లు.
58. మొక్కబోయిన దేవర ఎదురు వచ్చినట్లు.
59. మొక్కుబడే లేదంటే, ఒక్క దాసరికైనా పెట్టమన్నట్లు.
60. మొక్కేవారికి వెఱవనా? మొట్టేవారికి వెఱవనా?
61. మొగంవాచిన మొగుడికి పాచిన కూడు పెట్టితే, పాయసమని బుఱ్ఱు బుఱ్ఱున జుఱ్ఱుకున్నాడట.
62. మొగ (మగ) పిల్ల బంగారు పుల్ల.
63. మొగపిల్లలున్న యిల్లు, మోదుగలున్న అడవి అందము.
64. మొగబుద్ధి మోటుబుద్ధి, ఆడుబుద్ధి అపరబుద్ధి.
65. మొగమాటమునకు, మోక్షమునకు దూరము.
66. మొగమాటానికి పోతే, ముండకు కడుపైనట్లు.
67. మొగము మాడ్పుది మొగుడికి చేటు, ఈడ్పుకాళ్ళది ఇంటికి చేటు.
68. మొగవాని మూతిపై ఉంటే, నాకు ముంజేతిపై ఉన్నవి వెంట్రుకలు అన్నదట ఒక మగరాయడు.
69. మొగవారి కాలుసేయి తాకితే, ఆడువారు పెకల్లుతారట.
70. మొగిళ్ళు చూచి మోట చాలించినట్లు.
71. మొగడంటే మొద్దులుబెట్టి, మిండ డంటే ముద్దులు పెట్టును.
72. మొగుడికి మోదుగాకు, అల్లుడికి అరటాకు.
73. మొగుడికే (మగడికే) మొగతనంఉంటే, అగసాలాయనతో అవసరమేమి? (అకోరించటంఎందుకు?)
74. మొగుడికే మగతనం ఉంటే, తంబళ్ళవారి తగులాట మేమి?
75. మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు.
76. మొగుడినిచూస్తే పైసా లేదు, ముండను చూస్తే ముచ్చటౌతుంది.
77. మొగుడిమీది కోపం పొద్దు మునిగేవరకే.
78. మొగుడు అంటే ఘోష, డబ్బు అంటే ఆశ.
79. మొగుడు ఈయని గౌరము, తల్లిచేయని గారాబము.
80. మొగుడు ఒగ్గినా మామ ఒగ్గడు.
81. మొగుడు కొట్టినందుకు కాదుగానీ, తోడికోడలు నవ్వినందుకు.
82. మొగుడు కొట్టిన కొట్లు ఊరెల్ల రట్లు, మిండడు కొట్టిన కొట్లు ముత్యాలకట్లు.
83. మొగుడు కొట్టితే కొట్టినాడు గానీ, ముక్కుచీమిడి బాగా వదిలింది.
84. మొగుడు కొట్టినాడని మొల్లవాని దగ్గఱకుపోతే, మొల్లవాడు తెల్లవార్లు కొట్టినాడట.
85. మొగుడు కొద్దీ వన్నెలు, సిరికొద్దీ చిన్నెలు.
86. మొగుడు చచ్చిన వెనుక ముండకు బుద్ధి వచ్చిందట.
87. మొగుడు చచ్చి మొత్తుకుంటుంటే, మిండమగడు వచ్చి రాళ్ళు రువ్వాడట (వేశాడట).
88. మొగుడుని చూచిన దండగ, మిండని చూచిన పండగ.
89. మొగుడు పెండ్లాం పోట్లాడి, యాయావారం బ్రాహ్మణ్ణి చావకొట్టినట్లు.
90. మొగుడు లేకపోతే అప్పమొగుడు, కూర లేకపోతే పప్పుకూర.
91. మొగుడు లేనిదానికి గూడా మంత్రసాని తప్పదు.
92. మొగుడే ముండా అంటె ముష్టికి వచ్చినవాడు గూడా ముండా అంటాడు.
93. మొగుడొల్లక ముప్ఫై యేడ్లు, ఆలొల్లక అరవై ఏండ్లు, బాలప్రాయం పదేండ్లు.
94. మొగునితో పెళ్ళికి, పిల్లలతో తీర్థానికి వెళ్ళరాదు.
95. మొగుని పెత్తనం, మొండి మేనత్త.
96. మొగునిమీద కోపంచేత మాదిగవాని వెంట పోయినట్లు.
97. మొగుళ్ళ పొద్దు మోసపుచ్చె, కోడలిప్రాణం కొలుకులోకి వచ్చె.
98. మొట్టేవాడికి వరమిస్తాడు గానీ, మొక్కేవారికి వరమీయడు.
99. మొత్తుకోళ్ళోయి ముత్తయ్య సెట్టి.
100. మొదట మానెడు, దూడ చస్తే దుత్తెడు.

No comments: