1. బంగారు గాలానికి బంగారు చేపలు పడవు.
2. బంగారు చెప్పులైనా (ముచ్చెలైనా) కాళ్ళకే తొడగాలి.
3. బంగారు పొల్లునది గానీ, మనిషి పొల్లు లేదు.
4. బంగారు బాగుగా పది వన్నెగాకుంటే అంగలార్చుచు బొచ్చు (కోమటి) వాడుకోనేల?
5. బంగారు మనిషి ఊరేగటానికి వెడితే, ఇదే సందని భజంత్రీలు పారిపోయారట.
6. బంగారు వంటి కోమటి సంగీతముచేత బేరసారము లుడిగెన్.
7. బంగు తిన్న కోతి వలె.
8. బండకొయ్యకు గుద్ది చెప్పినట్లు.
9. బండ తీసి, గుండు పెట్టినట్లు.
10. బండన్న పెండ్లికి బడితే బాజా.
11. బండ్రవాండ్రు ముందు దండంబు లిడుదురు.
12. బండవానికి పిండి యోచన ఏమిటి?
13. బండారంలేని కోమటి బాటలు బుద్దిచ్చుకున్నాడట.
14. బండివాటు బడ్డోడు వెఱ్ఱోడు.
15. బండెక్కి సివాలాడుతూ బావగారు చూస్తారని భయపడ్డట్లు.
16. బండెడు ధనమిచ్చినా బావమరది లేని చుట్టరికం పనికిరాదు.
17. బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు.
18. బంతిలో చిక్కింది భైరనలోకి.
19. బందరు నాయాళ్ళ బడాయేగానీ, అడపంలో (సంచీలో) ఆకువక్క లేదు (పోక పలుకే లేదు).
20. బందరు బడాయి, గుంటూరు లడాయి.
21. బందరు మూల మెరిస్తే బక్కగొడ్డును అమ్మిస్తుంది (వాన లెక్కువగును).
22. బందిపోటు తరిమినా, గొఱ్ఱెలమంద లోనికి పోరాదు.
23. బందిపోటుదొంగ ప్రాణమునో ధనమునో హరిస్తే, పెండ్లి ఈ రెంటినీ హరిస్తుంది.
24. బందెలో పాయసం కంటే బయట సజ్జరొట్టె మేలు.
25. బందెడు పచ్చి, కోడలు కొత్తా లేదు (బందెడు, బందారు= ఒక అడవి గుబురుచెట్టు, వాపులకు కట్టుదురు).
26. బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?
27. బంధువుడవు సరెగానీ పైరులో చేయి పెట్టవద్దు.
28. బంధువుతోనైనా పాలి వ్యవసాయం కూడదు.
29. బంధువులంతా ఒక దిక్కు, బావమరిది ఇంకొక దిక్కు.
30. బంధువులకు దూరం - బావికి చేరువ.
31. బక్కనాగు పయనం బోతే నక్కలన్ని గుస గుసలాడె.
32. బక్కవానికి బలిసినవాడు బావ, బలిసిన వాడికి బక్కవాడు బావ.
33. బగబగమను వాని పంచన నుండవచ్చును గానీ, నాలిముచ్చు నట్టింట నుండరాదు.
34. బగుళ్ళపనికి బరంతు లేదు.
35. బచ్చన కోలలు, రిచ్చన గిల్లలు.
36. బజారున పోయేవాడిని అమ్మా అంటే, ఎవరికి పుట్టావురా కొడుకా అన్నట్లు.
37. బజారు బత్తెం, బావి నీళ్ళు.
38. బజారులో కోట్లాడాలి, బంతిలో భుజించాలి.
39. బట్ట కాలితే సెట్టి విడుస్తాడా?
40. బట్టా చాటు పుండు బావగారి వైద్యం.
41. బట్టతలకు పేలు పట్టినవన్నట్లు.
42. బట్టతలకు మోకాళ్ళకు ముడి వేసినట్లు.
43. బట్టతలమ్మ పాపిట తీయమన్నట్లు.
44. బట్టప్పు, పొట్టప్పు నిలువవు.
45. బట్టలో పేలాలు వేయించినట్లు.
46. బట్టవిప్పి నీళ్ళుపోసుకుంటూ, బావగారు వచ్చారని నిటారున నిల్చుందట.
47. బట్టా(పా)బాతా డౌలే కానీ, నా బట్టదగ్గర బొట్టుకూడా లేదన్నట్లు (డౌలు=డంభము).
48. బడాయి ఏమి బాపనమ్మా అంటే, అమలుదారు నా అల్లుడాయెగదా అన్నదట.
49. బడాయి ఏమిరా అన్నయ్యా? అంటే, పైసా లేదుర తమ్మయ్యా అన్నాడట.
50. బడాయికి బచ్చలికూర, తినకపోతే తోటకూర.
51. బడాయికి బయట పడుకుంటే, బక్క నరాలు యిక్కలాక్కు వచ్చాయంట.
52. బడాయికి బావగారు చస్తే, ఈడ్వలేక ఇంటివారందరు (ఇంటిల్లిపాది) చచ్చారు.
53. బడాయికోరు బచ్చే, కూటికిలేక చచ్చే.
54. బడాయి గాలికి పోతే, గుడ్డు నేలకు ఆనిందట.
55. బడాయి బండిమీద పోవడమేగాని, బత్తా (బత్తెమునకు) నికి నూకలు లేవు.
56. బడాయి బండెడు, బట్టలు సందెడు.
57. బడాయి బండెడు, బత్తెం గిద్దెడు.
58. బడాయి బత్తెన్న కూడులేక చచ్చెన్న.
59. బడాయి బచ్చలి కూరకు ధడా చింతపండు.
60. బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు.
61. బడికి బత్తెం, మడికి గెత్తెం (గెత్తెం=ఎరువు).
62. బడితె గలవానిదే బఱ్ఱె.
63. బడిలేని చదువు - వెంబడిలేని సేద్యం.
64. బడివారపు నక్క కుక్కల పొలానికి పోయిందట.
65. బడి(బరి) విడిచిన ముండ బజారుకు పెద్ద.
66. బడేసాయిబు గడ్డం బారెడైతే నేమి? మూరెడైతే నేమి?
67. బడేసాయిబును జోస్యులు, తొలిఏకాశి ఎప్పుడు అని అడిగినట్లు.
68. బతకలేక బడిపంతులు.
69. బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట.
70. బతకలేని వాడు బావిలో పడితే, తియ్యబోయినవాడు కయ్యలో పడ్డాడట.
71. బతికి(బ్రతికి)ఉంటే గరిటెడు పాలు లేవుగానీ, చస్తే సమాధిపై ఆవును కట్టేస్తా అన్నట్లు.
72. బతికిచెడిన వారితో బందుత్వం చేయవచ్చును గానీ, చెడిబ్రతికిన వారితో చేయరాదు.
73. బతికితే బలిజోడు, లేకపోతే బోగమోడు.
74. బతికిన (బ్రతికిన) బతుక్కి భగవద్గీత పారాయణమా?
75. బతికిన బతుక్కు ఒక పంది సాకుడా?
76. బతికితే అతిసారం, చస్తే కలరా అన్నట్లు.
77. బతికితే భూదానం, చస్తే గోదానం.
78. బతికితే వైద్యుడు బ్రతుకుతాడు, చస్తే బ్రహ్మణుడు బ్రతుకుతాడు.
79. బతికి పట్నం చూడాలి, చచ్చి స్వర్గం చూడాలి.
80. బతికే బిడ్డయితే పాసుకంపు కొడుతుందా?
81. బతుకంత (బ్రతుకంత) భాగ్యం లేదు.
82. బతుక నేరని బిడ్డ బారెడుండు.
83. బతుక లేక బాగోతం (భాగవతం).
84. బతుకలేనమ్మ నీళ్ళులేని బావిలో నిచ్చన వేసుకొని దూకిందట.
85. బతుకు తక్కువైనా బడాయి ఎక్కువ.
86. బతుకు లెన్నాళ్ళు? భాగ్యా లెన్నాళ్ళు?
87. బత్తె మున్నన్ని నాళ్ళు బ్రతుకులు.
88. బత్తెమెక్కడో సత్య మక్కడ.
89. బదులు మనిషి ఉంటే, పగలు తలనొప్పి.
90. బనగానపల్లి ఉరుసు, నా వెంట రావే సరసు.
91. బయట తన్ని, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు.
92. బయట పులి, ఇంట్లో పిల్లి (భార్య ఎదుట)
93. బయటకి ఇంపు, లోపలికి కంపు.
94. బయటకి పోయిన చోట గుద్ద (ముడ్డి) మరచివచ్చినట్లు.
95. బయటి కొకటి, లోపలి కొకటి (మాట).
96. బయటివాడు చూడుగేదంటే, ఇంటివాడు గొడ్డుగేదె అంటాడు.
97. బయల చిత్రము వ్రాసినట్లు.
98. బయిలున్నంత చదివె బయ్యన్న (బయిలు=పుస్తకాలు).
99. బయిలో ఉన్నంత బయ్యన్న గీకె.
100. బరిగ పంట - కడుపు మంట.
1 comment:
"బనగానపల్లి ఉరుసు, నా వెంట రావే సరసు."
ఇది సామెత కాదేమో అనిపిస్తున్నది. కానీ సామెతలాగే ఉన్నది !
Post a Comment