Sunday, August 21, 2011

సామెతలు 65


1. పేరు పెండ్లివాండ్లది, తిండి ఇంటివాండ్లది.
2. పేరు పెత్తనం చెఱచును.
3. పేరు గొప్ప ఊరు దిబ్బ.
4. పేరు పెద్దఱింకం, చెప్పులమోత.
5. పేరు పెనిమిటిది, అనుభవం మామ గారిది (ఊరివారిది).
6. పేరు పెన్న మోసినది, ఒళ్ళు నేల మోసినది.
7. పేరు పెరుమాళ్ళది, నోరు తనది (పేరంటాలిది).
8. పేరు పేరయ్యది, పిల్ల ఉమ్మడిది.
9. పేరు నేతిబీరకాయ, చీరిచూస్తే నేతిచుక్క లేదు.
10. పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ మందు.
11. పేలాలు చల్లి దెయ్యల లేపినట్లు.
12. పేలికైనా పిండి కట్టమన్నారు.


పై


13. పైఆకు రాలితే, కిందిఆకు పైకి వచ్చినట్లు.
14. పైకం భాగవతం వారికి, తిట్లు చాకలి మంగలివాళ్ళకు.
15. పైచట్టంలో పరమాన్నం, పాపరా నన్ను లేపరా అన్నట్లు.
16. పైచాలు లేని పైరు, ఏగలి అంబలి లేని మనిషి.
17. పైడికొండలో బచ్చు (బొచ్చు) బేరాలా?
18. పైతళ్ళుక్కయితే పడరానిపాట్లు పడవచ్చును గానీ, మొగం ముడతలుపడితే చేసే దేమున్నది?
19. పైత్యం లేదు, శైత్యం లేదు, పచ్చడంబట్ట ఇటు పారవేయండి.
20. పైత్యరోగికి పంచదార చేదు.
21. పైన పండ్లు, లోపల పుచ్చుకొమ్మ చెట్టు (దుష్టుడు).
22. పైన పటారం, లోన లొటారం.
23. పైన పడ్డ మాట, మడిని పడ్డ నీరు.
24. పైన పోయే పక్షియీకలు ఎన్ని అన్నట్లు.
25. పైన మంట, కింద మంట, కడుపులో మంత, కాలు నిలిపితే ఖామందు తంట.
26. పైపై నెరిమించు కేసరికి పక్కెర వేయవచ్చునా? (పక్కెర=జీను).
27. పైరుకు రాగులు, భాగ్యానికి మేకలు.
28. పైరుగాలి తగిలితే పంట ఉరవు (పైరుకు కోపు) (కోపు=అదనుకు తగిన ఏపు).
29. పైరు పలుచనైతే పాతళ్ళు నిండతవి, మెండైతే వాములు దండి (నిండు).
30. పైరు నిడినవాడు బహుసౌఖ్యవంతుడే.
31. పైరు మార్చిన పంట పెంపు.
32. పైరుకు ముదురు, పసరానికి లేత కావాల.
33. పరుకి విత్తితే గాదం మొలచినట్లు.
34. పైసా! పైసా! ఏం జేస్తావంటే, ప్రాణంవంటి మిత్రుణ్ణి పగ చేస్తానందిట.
35. పైసా లేనివాడు పరస్ర్తీ వర్జితుడు.
36. పైసాలో పరమాత్ముడున్నాడు.


పొ


37. పొంకణాల పోతిరెడ్డికి ముప్ఫైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.
38. పొంగినదంతా పొయ్యి పాలే.
39. పొంగిన పాలు పొయ్యి పాలు.
40. పొంగే కాలానికి బలుసు, మ్రగ్గే కాలానికి మామిడి.
41. పొంగే పాలు,వెలిగేదీపం ఆర్చరాదు.
42. పోకటి రాళ్ళకు పోట్లాడినట్లు.
43. పొగచుట్టకు సవిమోతికి ఎంగిలి లేదంటారు.
44. పొగడ్తకు పెరుగరాదు, తెగడ్తకు తరుగరాదు.
45. పొగతోటకు పొడినేల (పాటినేల).
46. పొగలోనుండి సెగలోకి వచ్చినట్లు (సెగలో పడినట్లు).
47. పొగాకు అడుక్కోవాలి, అందలం బయటపెట్టరా అన్నట్లు.
48. పొట్టయినా (పొట్టు అయినా) తిని పుట్టింట కాపురం చేయాల.
49. పొట్ట కరుకు(గు)లు తిన్నవారికి ఊచబియ్యాలు ఎట్లా వస్తాయి?(కరుకు=వెన్ను మొదటవేసి, పాలతో నున్న గింజలు; ఈచబియ్యం=ముదిరిన పచ్చిబియ్యం).
50. పొట్టకిచ్చినా బట్టకిచ్చినా భూదేవే.
51. పొట్టకు పుట్టెడు తిని, అట్లకు ఆదివారం రమ్మన్నట్లు.
52. పొట్టతిప్పలకు జేరి పోతులాడించాలి.
53. పొట్టనిండా చీరికలు - వట్టికాళ్ళ కురుపులు (వట్టికాలు=పాదము, మీగాలు).
54. పొట్టపైరుకు పుట్టెడు నీరు.
55. పొట్టి గట్టి, పొడుగు లొడుగు.
56. పొట్టి తోకగల కోడె పొడిచినా నడవదు (కదలదు).
57. పొట్టిదాని గట్టిదనం పట్టెమంచం ఎక్కినప్పుడు చూడు.
58. పొట్టి పోతరాజు కొలువువలె.
59. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు.
60. పొట్టివానికి మితిలేని పొలతి వాంఛ.
61. పొట్టివాని నెత్తి పొడుగువాడు కొట్టె, పొడుగువాని నెత్తి దేవుడు కొట్టె.
62. పొట్లకాయకు రాయికడితే చక్కనగును గానీ, కుక్కతోకకు గడితే ఫలమేమి?
63. పొట్లపాదికి పొరుగు గిట్టదు.
64. పొడుగు గాలికి చేటు, పొట్టి నీటికి చేటు.
65. పొడు మెక్కించే ముక్కు, పొగపీల్చే నోరు శుభ్రంగా ఉండవు.
66. పొడువలేని బంటు చేతిది ఈటైతే నేమి? తెడ్డైతే నేమి?
67. పొడవులకు (పరువుకు) రోకలి మింగితే, పొన్నొచ్చి (పన్ను) ముడ్డిన యిరుక్కునదిట.
68. పొత్తుకు మళయాళం, సంభందానికి సాంబారు (తమిళుడు ఆంధ్రుని గోంగూర అన్నట్లు).
69. పొత్తుమాట పొసగని మాట.
70. పొత్తుల పనిలో పిత్తుక చచ్చినట్లు.
71. పొత్తుల మగడు పుచ్చి చచ్చెను.
72. పొదుగు కోసి పాలు తాగినట్లు.
73. పొదుగు చింపిన పసరం పోతు నీనుతుందా?
74. పొదుగులేని ఆవు పాలిస్తుంటే, నాలికలేని పిల్లి నాకేసిందట.
75. పొదుగులో ఉన్నా ఒక్కటే, దుత్తలో ఉన్నా ఒక్కటె (పాలు) అన్నట్లు.
76. పొదుగెంత జారినా కుక్క గోవు కాదు.
77. పొద్దుకలుగ (ప్రొద్దుండగా) లేచినందుకు, బాట తప్పినందుకు సరిపోయింది.
78. పొద్దుగాని పొద్దులో పెద్దిగాని పెళ్ళి.
79. పొద్దు పోదు, నిద్ర రాదు, పద్మాక్షీ! ఒక్క పాటైనా పాడవే అన్నట్లు.
80. పొద్దుట లేవని కాపుకి పొలం ఇచ్చేది గడ్డే.
81. పొద్దుటిది పొట్టకు, మాపటిది బట్టకు.
82. పొద్దు తిరుగుడు, డొంక తిరుగుడు.
83. పొద్దుతిరుగు పువ్వు బుద్ధికి, పొద్దుకు నిలకడ లేదు.
84. పొద్దుపొడుపున వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు.
85. పొద్దేమో గడచిపోతుందిగానీ, మాట మాత్రం నిలచిపోతుంది.
86. పొమ్మనలేక పొగ బెట్టినట్లు.
87. పొయింది పోగా, పిడకల కుచ్చెల బట్టుకొని ఏడ్చినట్లు.
88. పొయ్యలు చెడ్డదినంలో వేయాలి, పెండ్లిండ్లు మంచిదినంలో చేయాలి.
89. పొయి అరిస్తే బంధువుల రాక - కుక్క అరిస్తే కఱవు రాక.
90. పొయ్యి ఊదమంటే కుండ బద్దలు కొట్టాడట.
91. పొయ్యి ఊదలేనమ్మ ఏడుమనువులు పోయిందట.
92. పొయ్యి ఊదినమ్మకు బొక్కెడు .... బూడిద.
93. పొయ్యిప్రక్క కెన్నముద్ద వలె.
94. పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు (వంటను ప్రారంభించను వసతి లేకుండుట).
95. పొయ్యి సెగ పొంతకుండకు తగలకపోదు.
96. పొరుగమ్మ సరిపెట్టుకుంటే, ఇరుగమ్మ ఉరిపెట్టుకుందట.
97. పొరుగింట చూడరా నా పెద్దచెయ్యి.
98. పొరుగింటి అట్లకు తిమ్మనం కాచుకుందట.
99. పొరుగింటి అట్లకు నెయ్యి కాచినట్లు.
100. పొరుగింటి కలహం విన వేడుక.

No comments: