1. పొరుగింటి నెయ్యి, పెండ్లాము చెయ్యి (వడ్డించేటప్పుడు).
2. పొరుగింటి పొయ్యి మండుతున్నదని తన పొయ్యిలో నీళ్ళు పోసుకుకొన్నట్లు.
3. పొరుగింటి బాన(బానెడు) పాడి కంటే తనైంటి గిద్ద (గిద్దెడు) పాడి మేలు.
4. పొరుగింటి బిడ్డను దింఛి, నీటిలోతును చూచినట్లు.
5. పొరుగుది అట్లు పోసితే, ఇంటిది పోరెలు పోస్తుంది.
6. పొరుగూరును నమ్ముకోగాక (బాక) పొద్దుమునగ పండుకోబాక.
7. పొరుగూరికి పోతే పోతుందా పాపం?
8. పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.
9. పొరుగూరు పోగానే పోవునా దుర్దశ?
10. పొర్లించి, పొర్లించి కొట్టినా, మీసాలకు మన్ను కాలేదు అన్నాడట.
11. పొలములోని ఆబోతును పులి గొన్నట్లు.
12. పొల్లు కట్ట దంచి పోగుచేసుకొన్నట్లు (పొల్లు= తరగలు, గల్ల).
13. పొల్లు దంచిన బియ్యము, తెల్లని కాకి లేవు.
పో
14. పోకముడి విప్పుతూ, కోక వెల అడిగినట్లు.
15. పోకల కుండ చట్రాతి మీద పగుల కొట్టినట్లు.
16. పోకలు నమలుచు ఆకులు చేబూని సున్న మడుగువాడు శుద్ధవెధవ.
17. పోకిరికి పోలీసు, చదువురానివానికి సర్వే.
18. పోగాపోగా పైబట్ట బరువవుతుంది.
19. పోచమ్మకు, కందూరు పీర్లకు బోనాలు (బోనాలు=అన్నము, పొంగలి)
20. పోట్లడే కోళ్ళు పొడిచినా పోవు.
21. పొడమిగలనాడే పొరుగింటి పొందు (పొడిమి=సంపద).
22. పోతా, పోతా అన్నోళ్ళకు పోకడ లేదు, చస్తా, చస్తా అన్నోళ్ళకు చావు లేదు.
23. పోతురాజు ఇష్టమా? పొట్టేలు ఇష్టమా? (కోయుటకు)
24. పోతూ పారవేస్తూ పోయి, వస్తూ ఏరకతినే (ఏరుకొనే) రకం.
25. పోతున్నా నంటే, నీయంత పోతుకు మేతేడ తెచ్చేది అన్నాడట.
26. పోతేపల్లి వారికి పప్పే సంభావన.
27. పోయిన కంటికి మందు వేయబోతే, ఉన్న కన్ను ఊడ్చుక (ఊడి) పోయిందట.
28. పోయిన చోటెల్లా పొగాకే అడిగితే?
29. పోయినది ఒర, ఉండేది కత్తి.
30. పోయిన నీళ్ళకు కట్ట బెట్టినట్లు (గతజల సేతుబంధనము).
31. పోయిన మొగుడు పోయినా, పొన్నకాయలా గుండు కుదిరింది.
32. పోయే కాలానికి అపరబుద్ధి.
33. పోరాని చుట్టము వచ్చాడు, బొడ్డువంచి తామలపాకులు కొయ్యమన్నట్లు.
34. పోరాని చోట్లకు పోతే రారాని నిందలు రాక మానవు.
35. పోరు(డు) గాలితో దీపంబెట్టి నా పాతివ్రత్య మహిమ (దేవుని మహిమ) అన్నట్లు.
36. పోరు చాలక పొయ్యిదగ్గఱ పండుకుంటే, బొంతకాలిపోయె నారాయణా!
37. పోరు నష్టం, పొందు లాభం.
38. పోరులేని గంజి పు(రి)డిసెడైనా చాలు.
39. పొలనాటిలో పోకకు పుట్టెడు అమ్మితే, ఆ పోకా దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.
40. పోలికి వచ్చిన భోగానికి, పొట్టేలుకు వచ్చిన రోగానికి తిరుగులేదు.
41. పోలీ, పోలీ, నీ భోగమెన్నాళ్ళే? అంటే, మా అత్త మాలపల్లి నించి (మాలాడ) వచ్చేదాకా అన్నదిట.
42. పోలుగాడి చెయ్యి బొక్కలో పడ్డట్టు.
43. పోలేరమ్మకు పోయేది లేదు, పోతురాజుకు వచ్చేదీ లేదు.
44. పోలేరమ్మ దిగివచ్చితే పొలంకాపు కేమిభయం?
45. పోలేరమ్మది చినగదు, పోతురాజుది విరుగదు.
46. పోలేరమ్మ పెండ్లిలో పోతురాజు పెత్తనం.
పౌ
47. పౌరుషం (పురుషకారం) లేక దైవం అనుకూలించదు.
48. పౌరుషానికి (సనికలు) పొత్రం మెడకు కట్టుకున్నట్టు.
49. పౌర్ణమికి పూజించి, అమావాశ్యకు ఆరగిస్తవి (తేనెటీగలు తేనెతుట్టెను).
ప్ర
50. ప్రజల మాటే ప్రభువు కోట.
51. ప్రఙ్ఞలేని శౌర్యం - పదునులేని ఖడ్గం.
52. ప్రతిష్ఠకు పెద్దనాయడు చస్తే, ఈడవలేక ఇంటిల్లిపాదీ చచ్చారట.
53. ప్రథమ కబళంలోనే మక్షికాపాతం.
54. ప్రథమ చుంబనం - దంత భగ్నం. (మొదటి ముద్దుకే మూతిపండ్లు రాలినవి).
55. ప్రదక్షిణలు చేస్తే, బిడ్డలు పుడుతారంటే, చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట.
56. ప్రపంచమంతా ధర్మపరాయణమైతే శౌర్యానికి తావుండదు.
57. ప్రభగిరిపట్నం తాడిచెట్టు వలె (పొడుగు).
58. ప్రయాణాల వారి హడావుడికంటే, పెట్టెలు మోసేవారి హడావుడి ఎక్కువ.
59. ప్రయాణాలు అబద్ధం, ప్రసాదాలు నిబద్ధం.
60. ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం.
61. ప్రసాదానికి ముందు, పనికి వెనుక.
62. ప్రసూతి వైరాగ్యం ఒంటిపచ్చి ఆరేవరకే.
63. ప్రసుతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఆభావ వైరాగ్యం.
ప్రా
64. ప్రాక్టీసు లేని ప్లీడరు దేశాభిమాని అయినట్లు.
65. ప్రాణముంటే ఉప్పుగల్లమ్ముకొని బ్రతుకవచ్చు.
66. ప్రాణముంటే బలుసాకు తిని బ్రతుకవచ్చు.
67. ప్రాణముండే వరకు భయం లేదు.
68. ప్రాణం పోయినా మానం దక్కించుకోవలె.
69. ప్రాణం పోయేటప్పుడు కూడా త్రాచు పడగ దించదు.
70. ప్రాణం మీదకి వచ్చినప్పుడు పంచాంగం చూచి మందు పోస్తారా? (త్రాగిస్తారా?)
71. ప్రాణమున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి.
72. ప్రాణములేనివానికి బంగారు తలపాగాజుట్టిన ప్రయోజనమేమి? అణివజ్ర భూషణ మురమున బెట్టనేమి?
73. ప్రాతదొంగ పట్టుబడక పోడు.
74. ప్రాతబడ్డ బావినీరు, మేకలపాడి రోత (బొచ్చుపడునని, మేకను వెనుక గుండ పితుకుటచే పెంటికలు పడునని రోత).
75. ప్రాయము వస్తే పందిపిల్లకూడా బాగుంటుంది.
76. ప్రాయాన బెట్టిన పంట - ప్రాయాన గన్న కొడుకు.
77. ప్రాసకేడ్చానే కూసుముండా (పాసుముండా) అన్నట్లు.
ప్రి
78. ప్రియం మహాలక్ష్మి, చౌక శనేశ్వరం.
79. ప్రియములేని కూడు పిండపు కూడురా.
ప్రీ
80. ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.
81. ప్రీతిలేని కూడు పిండాకూడు.
82. ప్రీతిలేని లంజ ఘాతకియై తోచు
ప్రే
83. ప్రేమ అమ్మేది కాదు కొనేది కాదు, ప్రేమ వెల ప్రేమే.
84. ప్రేమ గుడ్డిది.
85. ప్రేమలేని మాట పెదవిపైనే ఉండును.
ప్రో
86. ప్రోలులోనే లేకపోతే, పొడుగునా ఉంటుందా?
ఫ
87. ఫకీరువాణ్ణి తెచ్చి పరుపులో కూర్చుండ బెడితే, లేచి లేచి మసీదులోనికి పోయాడట.
88. ఫణివాత బడని ప్రభంజనమా?
89. ఫరవాలేని చుట్టం వచ్చింది, పాతచేత గొడుగు పట్టమన్నట్లు.
90. ఫలానికి తగిన బీజం.
ఫా
91. ఫాల్గుణమాసపు వాన పదిపనులకు చెఱుపు.
బ
92. బంకచెక్కలు, జింక తోలు,పాయిల కూర.
93. బంగారం కొద్దీ సింగారం.
94. బంగారం పోయిన తర్వాత బట్ట చుట్టమా?
95. బంగారం పట్టితే మన్ను; మన్ను బట్టితే బంగారం అయినట్లు (దురదృష్ట అదృష్టముల స్థితి).
96. బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పుండ వలెను.
97. బంగారముంటే సింగారాని కేమి (కొదువ) తక్కువ?
98. బంగారమునకు తావి అబ్బినట్లు.
99. బంగారు కరుగను వెలిగారం తప్పనట్లు.
100. బంగారుకే రంభ చిక్కుతుందా?
No comments:
Post a Comment