Friday, January 28, 2011

సామెతలు 34

1. చిచ్చుని ఒడిగట్టి తెచ్చినట్లు.
2. చిచ్చుని కౌగిలించుకుంటే చిమిడించు.
3. చిటికినవ్రేలు శ్రీపతి.
4. చిటికలో పందిరి వేసినట్లు.
5. చిట్టెడు నూనె తెచ్చి, చిన్నింట్లో దీపం, పెద్దింటిలో దీపం; వత్తికి, వదిన నెత్తికి; మంగలివాని కత్తికి, మాబావ జుత్తుకు.
6. చితి చచ్చినవానిని, చింత బ్రతికినవానిని కాలుస్తుంది.
7. చిత్తం చెప్పులమీద, ధ్యానం దేవునిమీద.
8. చిత్తం మంచిదైతే, చేదూ (తీపు) మంచిదవుతుంది.
9. చిత్తం శివుడిమీద, భక్తి చెప్పులమీద.
10. చిత్తం శివుడిమీద, భక్తి పెరుమాళ్ళమీద.
11. చిత్త ఎండకు పిట్టల తలలు పగులును.
12. చిత్తకార్తె కుక్కల్లాగా.
13. చిత్తకు చిఱుపొట్ట (వరి).
14. చిత్త కురిస్తే చింతలు కాయును.
15. చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే, అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
16. చిత్త చిత్తగించి, స్వాతి చల్లగా చూచి, విశాఖ విసరకుంటే, వీసానికి పుట్టెడు పండుతాను అన్నదట జొన్న.
17. చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడుతుంది.
18. చిత్త జల్లు- చిత్త ఉబ్బ (ఉబ్బ=ఉక్క).
19. చిత్త జల్లు-స్వాతి వాన.
20. చిత్తరమైన మొగుడు ఉత్తరం వేస్తే, చింతలతోపులోకి వెళ్ళి చదివించుకొంటే ఇంకా చిత్తరంగా ఉందట.
21. చిత్తరు చెడియుండ రొత్త ఒడలన్ చవిచేరునా?
22. చిత్తరువునకు జీవం వచ్చినట్లు.
23. చిత్తలో చల్లితే, చిట్టెడు కాపు.
24. చిత్తలో చల్లితే చిత్తుగా పండును-ఉలవ.
25. చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు.
26. చిత్తశుద్ధికలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువకాదు.
27. చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
28. చిత్త స్వాతి సంధించినట్లు (ఎక్కువ వానలు).
29. చిత్త స్వాతులు కురవకపోతే చీమకు కూడా నాంబ్రం.
29. చిత్త స్వాతులు చిత్తగించి, విశాఖ ఒక విసరు విసరితే, మొదలు తంతే ఏడుగింజలు రాలతాయి.
30. చిత్రం చూడండి చీమ గుడ్డు పెట్టింది; బూటకం చూడండి బురక గుడ్లు పెట్టింది (బురక=గువ్వజాతి పిట్ట).
31. చిత్రప్రభందము లల్లగలిగినవాడే కవి, అనిలో నరుక గలిగినవాడే అవనీశుడు.
32. చిత్రినెలలో దుక్కి, పుటం పెట్టిన (వేసిన) పుత్తడి (చిత్రి=చైత్రము).
33. చిదంబర రహస్యం (ఆకాశలింగం, ఏమీ లేదని).
34. చిదికి చిదికి చిన్నవాని పెండ్లి చేసేవఱకు, పెద్దవాని పెండ్లాము పెద్దలలోకి పోయిందట.
35. చిన్న పేరి తాడు తెగితే పెద్దపేరి తాడు అప్పుడే తెగుతుంది (పేరి=తమిళంలో శివుడు).
36. చినికి చినికి గాలివాన అయినట్లు.
37. చినిగిన బట్ట బరువుకు వెరుస్తుందా?
38. చినిగిన వానిదే చిరుగుతుంది గానీ, చాకలివాని కొడుకు చందమామ.
39. చినుకులకు చెరువు నిండునా?
40. చిన్నక్కను పెద్దక్కను, పెద్దక్కను చిన్నక్కను చేసినట్లు.
41. చిన్న ఇల్లు కట్టుకొని పెద్ద కాపురం చేయవలె.
42. చిన్నచేపను పెద్దచేప మింగితే, పెద్దచేపను బేస్తావాడు మింగుతాడు.
43. చిన్ననాడులేవు, చంద్రశేఖరుడినాడు పోగులా?
44. చిన్న నోటికి పెద్ద మాట.
45. చిన్నన్న గుఱ్ఱం చిట్లికి పోయె, పెద్దన్న గుఱ్ఱం పెండ్లికి పోయే.
46. చిన్నపామైనా పెద్ద కఱ్ఱతో కొట్టవలె.
47. చిన్న పునర్వసు కార్తెలో చిట్టెడు విత్తితే గరిసెడు పండును.
48. చిన్నపుల్లైనా పల్లుగుచ్చ పనికివస్తుంది.
49. చిన్నప్పటినుంచి చింతకాయలు అమ్మి, ఆ వంకరటింకరకాయల పేరేమి రాజా? అన్నదిట.
50. చిన్నమూ కావెలె, చిదరా కావలె, మేలిమీ కావలె, మెడా తిరుగవలె.
51. చిన్నమ్మకు (పిన్నమ్మకు) మీసాలుంటే చిన్నాయన.
52. చిన్నమ్మ సిందేస్తే, చీరదారి చీరది, సింగారందారి సింగారానిది.
53. చిన్నమ్మ సింహద్వారాన్న వస్తే, పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది.
54. చిన్న రాతితో ముడ్డీ తుడుచుకొని చేయ్యంతా పీయి చేసుకొన్నట్లు.
55. చిన్నవాళ్ళు తింటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే పలహారం.
56. చిన్న నా పొట్టాకు శ్రీరామరక్ష.
57. చిప్పతెచ్చుకోరా తిమ్మా అంటే, అట్లా చెప్పు మాయమ్మా అన్నాడట.
58. చిమ(మ్మ)టను చీరేమి చేసింది? చీడపురుగును చేనేమి చేసింది?
59. చిమ(మ్మ)ట సింగమా? గాజు రత్నమా?
60. చిమడకే చినడకే ఓ చింతకాయ, నీవెంత చిమిడినా నీ పులుపు పోదు.
61. చియ్యబువ్వ చీకులాట, గొల్లాడువస్తే గోగులాట.
62. చియ్యోడొచ్చి, బువ్వోడిని తీసుకుపోయినట్లు.
63. చిఱుతపులి కడుపున పెద్దపులి పుట్టినట్లు.
64. చిలుంపట్టెవాడికి చిత్తం కుదరదు.
65. చిలుంవదిలితేగానీ ఫలం దక్కదు.
66. చిలుం వదిలితే చిద్రం (చిద్రం) వదులుతుంది.
67. చిలుకకు చెక్కెర, చీమకు పంచదార.
68. చిలుకకూన బ్రహ్మాస్త్రమునకు తగునా?
69. చిలుక తనముద్దేకానీ ఎదుటిముద్దును కోరదు (ఎరుగదు).
70. చిలుకని పెంచి బావురుగానికి అప్పచెప్పినట్లు.
71. చిలుక పంజరంలో గూబను పెట్టిన ఉలుకు గానీ పలుకునా?
72. చిలుకబోయిన పంజరమేమి చేయును?
73. చిలుక ముక్కున దొండపండు ఉన్నట్లు.
74. చిల్లర దేవతలకు మొక్కి, చిత్తం చెడగొట్టుకొన్నట్లు.
75. చిల్లర శ్రీమహాలక్ష్మి.
76. చిల్లి పేరే తూటు.
77. చిల్లి బాగాలేదని బెజ్జం వేసాడట.
78. చివికు పోవ, చేప దొరికినట్లు.


చీ


79. చీకటింటికి పోతే సిగ్గాయితది అంటే, అట్లయితే సంసార మెట్లయితది? అన్నాడట.
80. చీకటింట్లో సివాలాడినట్లు.
81. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు.
82. చీకటి తన నల్లదుప్పటితో అందరినీ సమానంగా కప్పును.
83. చీకటిలోనే తాంబూలం.
84. చీకటి లేకుంటే దీప మేమిటికి?
85. చీకితే లేనిది నాకితే వస్తుందా?
86. చీడ అంటుతుందేకానీ, సిరి అంటదు.
87. చీడ సిగ్గెరుగదు.
88. చీదితే ఊడేముక్కు ఎన్నాళ్ళు నిలుస్తుంది? (ఉంటుంది?)
89. చీద్రానికి చీరపేలు, దరిద్రానికి తలపేలు.
90. చీపురుకట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు.
91. చీపురుకట్టకు సిరివస్తే, కోడిఈక గొడుగుపట్టెనట.
92. చీమ ఒళ్ళు చీమకు బరువు, ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు.
93. చీమలు చెట్టెక్కితే, భూములు పండును (వానలుపడును).
94. చీమరు పాకిన రాళ్ళు అరుగునా?
95. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవగును.
96. చీర కట్టినమ్మ శృంగారం చూడు, గుడ్డకట్టినమ్మ కులుకు చూడు.
97. చీరకు కండె మొదలు, చిన్నవాడికి ఉపనయనం మొదలు.
98. చీరకట్టినమ్మ సింగారం ఏమి చూస్తావు? ఏలికలు కట్టినమ్మ ఎగిరింతలు చూడు.
99. చీర చిత్తారు, రవిక జల్తారు.
100. చీర చిరుగును, పయ్య పెరుగును.

1 comment:

Ki2 said...

cilli kaadu kadandi cillu kadaa.. adi correct cheyyandi chaala chotla undi adi