2. గుమ్మడికాయ దొరికిన నాడే తర్పణం వదిలినట్లు.
3. గుమ్మడికాయ పోయిన తావు గుర్తులేదుగానీ, ఆవగింజపోతే అద్దుక తిన్నందట.
4. గుమ్మడికాయ పోయేదారి తెలియక ఆవగింజకు అల్లలాడినట్లు.
5. గుమ్మడీకాయల దొంగ అంటే, బుజాలు తడుముకొన్నట్లు.
6. గుమ్మడీకాయలో ఆవగింజంత.
7. గుమ్మలో గింజలు గుమ్మలో ఉండాలి, పిల్లలు పిడుకల్లాగా ఉండాలి.
8. గుమ్మళ్ళు కుళ్ళినవి, ఆవాలు అల్లినవి.
9. గురికాడు నక్కను కొడుతాడా?
10. గురి కుదిరితే, గుణం కుదురుతుంది.
11. గురుగింజకి ఎన్నివన్నెలున్నా గొప్పలేదు.
12. గురిగింజ తన గుద్దకింద నలుపెరుగదు.
13. గురితప్పిన ములికి, బరితెగిన కలికి.
14. గురువుకన్నా గుడ్డు మంచిది.
15. గురువుకే కంకి దొరకకపోతే శిష్యుడికి ఊరబియ్యమా?
16. గురువుకి తగిన (మించిన) శిష్యుడు.
17. గురువుకు తిరుమంత్రం చెప్పినట్లు.
18. గురువుకు రేగినా గుఱ్ఱానికి రేగినా పట్టెది కష్టం.
19. గురువు కెగ్గుచేసినవానికి కృతఘ్నత్వమెంత?
20. గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరిగెత్తుతూ తాగుతాడు.
21. గురువు మాట ంఇరరాదు, గడ్డపార మింగరాదు.
22. గురువులు వస్తున్నారంటే, గోచులు విప్పి తోరణాలు కట్టమన్నారట.
23. గురువులేని విద్య గుడ్డివిద్య.
24. గుఱ్ఱం ఎక్కిన తిరు కాదు, సద్దితిన్న నోరు కాదు.
25. గుఱ్ఱం ఎక్కి మూట నెత్తిన పెట్టుకున్నట్లు.
26. గుఱ్ఱం ఎక్కేవాడే పడేది.
27. గుఱ్ఱం, గాడిదను ఒకటిగా చూచినట్లు (చేసినట్లు).
28. గుఱ్ఱం చవలం, జీను ముచ్చవలం. (చెవలం=ఒకనాణెం, పావలాలో 1/4 భాగం).
29. గుఱ్ఱం కడుపులో గాడిదపిల్ల పుట్టునా?
30. గుఱ్ఱము గుగ్గిళ్ళు తింటుంటే, గాడిదకు కడుపునొప్పి వచ్చిందట.
31. గుఱ్ఱము చచ్చిందికాక, గుంత తవ్వను ఒక రూక.
32. గుఱ్ఱము పేరు గోడా అయితే, గోడపేరు గుర్రం గాదా, ఇంకనాకు ఉరుదూ అంతా తెలుసు అన్నాడట.
33. గుఱ్ఱము పోతూ గూటాము పీకుకొని పోయినట్లు.
34. గుఱ్ఱము అశ్వమూ కలిసి గుశ్వమైనట్లు.
35. గుఱ్ఱానికి కొమ్ములు మొలిస్తే ఒక్కరినీ ఉండనీయదు.
36. గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తిన నేర్పవలెనా?
37. గుఱ్ఱానికి గుద్దలో కాలితే అరిగగడ్డికూడా మేస్తుంది.
38. గుఱ్ఱానికి సకిలింత, సంగీతానికి ఇకిలింతా ఉండాల.
39. గుఱ్ఱానికి, సన్యాసికి, విధవకు, బ్రహ్మచారికి ఎప్పుడూ మైధున చింతే.
40. గుఱ్ఱానికి తోక ఉండటం తనమటుకు తాను విసురుకోనేగానీ కడమ గుఱ్ఱాలకు విసురునా?
41. గుఱ్ఱాన్ని గుగ్గిళ్ళకు అమ్మినట్లు.
42. గుఱ్ఱాన్ని చూచి కుంట నారభించినట్లు.
43. గుఱ్ఱాన్ని చూస్తే కాళ్ళు నొప్పి.
44. గుఱ్ఱాన్ని తొట్టిదగ్గరకు ఈడ్చుకుపోగలమే గానీ త్రాగించలేము.
45. గుళ్ళోదేవునికి అంగట్లో బెల్లం నైవేద్యం.
46. గుళ్ళో దేవునికి నైవేద్యం లేకుంటే, పూజారి పులిహోర కేడ్చాడట.
47. గుళ్ళో పిత్తకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యం.
48. గువ్వకూర్చిన్న టెంకాయి, గూబకూర్చున్న కొంప కొరగావు.
49. గువ్వ గూడేక్కెను, అవ్వ మంచమెక్కెను.
50. గువ్వ గూడెక్కె, రాజు మేడెక్కె.
స్1. గుసగుసలు వచ్చి గుడీసెకు దాడితెచ్చె.
52. గుసగుస యోచనలు గుడిసెలు తీయటానికి కారణం.
గూ
53. గూటి గూటంతో గుండెలు గుద్దుకొన్నట్లు.
54. గూట్లో దీపం, నోట్లో ముద్ద.
55. గూట్లో మిరపకాయ, గుంటలో బువ్వ.
56. గూట్లో మిరపకాయ చూస్తూ అన్నం తినమన్నట్లు.
57. గూదదిగిన పేరంటాలు అత్తగారింట ఉన్నా ఒకటే, అమ్మగారింట ఉన్నా ఒకటే.
58. గూనికి తోడు దొబ్బుడు వాయువు.
59. గూని గుగ్గిరిచ్చె, దండు దగ్గరొచ్చె.
60. గూని దున్నకంటే, గుడ్డిదున్న మేలు.
61. గూనివాని ఒడుపు పడుకొన్నప్పుడు చూడాలి.
62. గూనువీపు కుదురు అవుతుందా?
63. గూబ ఎక్కిన కొంప చెడును.
64. గూబ ఎక్కిన గృహము కూలు.
గృ
65. గృహప్రవేశానికి వెడుతు గుడ్లగూబను చంకనబెట్టుకొని పోయినట్లు.
గె
66. గెలువని రాజుకు గొప్పాలు మెండు.
గే
67. గేదె ఉండగా, దూడ ఉండగా, గుంజకు వచ్చెరా గుఱకవాయువు అన్నట్లు.
68. గేదెదూడ ఉండగా గుంజ అరచిందట.
గొ
69. గొంగట్లో అన్నం తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.
70. గొంగట్లో గుద్దులాట (ముసుగులో గుద్దులాట).
71. గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లు.
72. గొంతుకోసేవాడు కత్తి ఏమారునా?
73. గొంతు చిన్నది, గోలెము పెద్దది (గోలెము=కడుపు).
74. గొంతులో పుస్తెబొట్టు, గుంతనక్కంత మొగుడు.
75. గొంతెమ్మ కోర్కెలు, ఎండమావుల నీళ్ళు.
76. గొంతెమ్మ కోర్కెలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్కా పక్కా?
77. గొడారిబేరం గొడ్డుకు లాభం (గొడారి=మాదిగ).
78. గొడారి వద్ద తోలు కొన్నట్లు.
79. గొడుగు పట్టితే పిడుగుకు అడ్డమా?
80. గొడ్డెము తెగిన గ్రాసము పట్టదు.
81. గొడ్డలి ఎక్కడపెట్టినావురా? అంటే, కొట్టే చెట్టుదగ్గర; కొట్టె చెట్టు ఎక్కడుందిరా? అంటే, గొడ్డలిదగ్గర అన్నాడుట.
82. గొడ్డలిలో దూరినకఱ్ఱ కులానంతా కూలుస్తుంది.
83. గొడ్డావు పాలు గొద్రాలి కిచ్చినట్లు.
84. గొడ్డుకు ఎక్కువ డబ్బు, గుడ్డకు తక్కువ డబ్బు పెట్టాలి.
85. గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట.
86. గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి.
87. కొడ్డు కొఱికిన కొయ్యకాలు గొఱ్ఱెకు చాలు.
88. గొడ్డుటావు (గొడ్డుపోతు) పాలు పితికినట్లు.
89. గొడ్డుటావు గోకిన చేపునా?
90. గొడ్డును కొని తలుగుకు (వలుపుకు) ఏడుస్తాడు.
91. గొడ్డుపోతేమి ఎఱుగురా బిడ్డ చలి.
92. గొడ్డు బలిస్తే పాటుకి, మనిషి బలిస్తే కాటికి.
93. గొడ్డుపోతు ఆవు గోకితే పాలిస్తుందా?
94. గొడ్డు రైతు బిడ్డ.
95. గొడ్డులేని వాడు, బిడ్డలేనివాడు ఒకటే.
96. గొడ్డు వచ్చినవేళ, బిడ్డ (కోడలు) వచ్చినవేళ.
97. గొడ్డువాడు గొడ్డుకేడిస్తే, గొడావివాడు తోలుకేడ్చాడుట.
98. గొడ్డోడు గొడ్డుకేడిస్తే, మాలచచ్చినోడు చియ్య కేడ్చినాడుట.
99. గొడ్రాలికేమితెలుసు కాన్పునొప్పులు.
100. గొడ్రాలి ముండకు గొంతు పెద్ద.
1 comment:
Hey TDS,
Naa alanti vallaku (Telugu rayatamo chadakatamo ranivalu), oka shayamu cheyavochu. Why don't you give a translation (Will it be worth and make it sensible too??)!!
Post a Comment