Sunday, January 23, 2011

సామెతలు 33


1. చమురున్న పెంకు ఎప్పుడూ పేలదు.
2. చరిత్ర పునరావృత్తు నొందును.
3. చరిత్ర వివేకులకు దారిచూపి, అవివేకులను వెంట ఈడ్చుకొనిపోవును.
4. చలాకి లేకపోయినా సలాకిలా ఉండాలి.
5. చలికి జడిసి కుంప టెత్తుకొన్నట్లు.
6. చలిజ్వరము: అన్నంలో చెయ్యి తియ్య బుద్ధికాదు.
7. చలి దూరందే బీర పూయదు.
8. చలిబడనేల, సీతుగాయనేల?
9. చలివేంద్ర కుండలకు తూట్లు పొడిచినట్లు.
10. చల్లకుండకు, చంటిబిడ్డకు చాటుండాలి.
11. చల్లకు వచ్చి ముంత దాచనేల?
12. చల్లకేంగానీ, గొల్లది బాగుందన్నాడట.
13. చల్లకు బాలును గలసిన చల్లకు దోడంటినట్లు.
14. చళ్ళు చూచుకొని సంబరపడితే సరా? ముందరి పాటు చూసుకో అన్నాడట (ముడ్డిపడే పాటు చూసుకో).
15. చళ్ళు జారిన ముండకు, వట్టలు జారిన విటకాడు.
16. చవి ఎరిగిన కుక్క చావకొట్టినా పోదు.
17. చవితి చంకనాకి నట్టే ఉంది ఏకాదశి అన్నాడట.
18. చవిటి ఉప్పు కందచక్కెరవలేనున్నా, అనుభవసుఖం లేదు.
19. చవిలేని కూడు కుడిచినట్లు.
20. చవిసారం లేని కూర చట్టి నిండా, ఆంగంపాగంలేని మొగుడు మంచం నిండా.
21. చవిసారం లేనివాడు సంచారంపోతే, ముసలినక్కలన్నీ గుసగుస లాడినవట.
22. చవుక (చౌక) కొననివ్వదు, ప్రియం అమ్మనివ్వదు.
23. చస్తానని చద్దెన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందట.
24. చస్తూ ఉంటే సంద్యమంత్రం చెప్పమన్నట్లు.
25. చస్తే చచ్చాడుగానీ, చలిజ్వ్రం చప్పగా వదిలింది.
26. చస్తేగానీ బఱ్ఱెపాడి బయటపడదు.


చా


27. చాకలి అత్త, మంగలిమామ. కొడుకు సాలోడైతేనేమి? సాతానోడైతేనేమి?
28. చాకలి కట్టని గుడ్డ, సైను ఎక్కని గుఱ్ఱము లేదు (సైను=గుఱ్ఱము కాపరి).
29. చాకలి కొత్త, మంగలి పాత.
30. చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప, అయ్యదగ్గర ఏమీలేదు.
31. చాకలిదాని చక్కదనానికి సన్యాసులు గుద్దుకొని చచ్చారుట.
32. చాకలిదానితో సహవాసం చేస్తే, గాడిద వచ్చి గర్వపడిందట.
33. చాకలిది సందెఱుగదు, మాలది మంచమెఱుగదు.
34. చాకలిని క్షవరం చెయ్యమంటే, చెక్కుతీసి చేతిలో పెట్టినాడట.
35. చాకలిమంగలి పొత్తు, ఇంటికి రాదు విత్తు.
36. చాకలివాడి భార్యకు మంగలివాడు విడాకులిచ్చినట్లు.
37. చాకిరిచేసే చాకలికి లేదుగానీ, గొరిగే కొండయ్యకిస్తారు.
38. చాకిరేవు ఒకచోట, ఏలపాట ఇంకొకచోట.
39. చాటెడు తిని చెడితి, వాకిలిదాటి పడితి.
40. చేదను చూచి బొక్కెనబాయిలో ఏసిందట.
41. చాదస్తం అంటే, చెరిసగం అన్నట్లు.
42. చాదస్తం మొగుడా, నీ చారెడు వేరే వండుకో అన్నట్లు.
43. చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు.
44. చాదస్తపు మొగుడు చెపితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
45. చాదస్తపు మొగుడు చెపితే వినడు, కొడితే ఏడుస్తాడు.
46. చాప చిరిగినా చదరంత కాదు.
47. చామలి చల్లి చేనువిడవాల.
48. చామచేలకు వరిగకు పోయినట్లు.
49. చాలకపోతే బలాదూరు అన్నట్లు.
50. చాలని బట్టకొంటే చినిగేవరకు దుఃఖము, చాలని మొగుని చేసుకుంటే చచ్చేవరకు దుఃఖము.
51. చాలమ్మా ! నీ ఇరుస రాగుల గద్దె.
52. చాలీచాలని దానికి చాకలి సంతు అన్నట్లు.
53. చాలుపై చాలు ది=ఉన్నితే చచ్చుచేనైనా పండుతుంది.
54. చాలులో చాలులేకపోతే నాపాలెక్కడికిపోతుంది?
55. చావడిముందరి కొంప కదపాపుల్లకు సరి.
56. చావతీరనంత పని అయినా చారెడూ గంజికి దోవలేదు.
57. చావా చావడూ, చాపా ఇవ్వడు.
58. చావాలని సన్యాసం తీసుకొంటే గంత బొంత గాడిదమోత అయినదట.
59. చావుకంటే గండంలేదు, గోచికంటే దరిద్రం లేదు.
60. చావుకబురు చల్లగా చెప్పమన్నారు.
61. చావుకాలానికి సమర్త కట్నాలు.
62. చావుకు చావు ఉన్నదా?
63. చావుకు పెడితేగానీ లంఖణాలకు తేలదు.
64. చావుకు ముదురు-లేత ఉన్నదా?
65. చావుకు వెరచి చాటుకుపోతే, మిత్తి వచ్చి ముందర కూర్చున్నదట.
66. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.


చి


67. చింతకాయల కాఙ్ఞగానీ, గ్రుక్కిళ్ళ కాఙ్ఞా?
68. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకరటింకరవి ఏమికాయలు అన్నదట.
69. చింతకాయలు ఎరుగని దొరసాని, చింతకాయలనుచూసి, కొడవళ్ళా అన్నదిట.
70. చింతకాయలు తిన్ననోర కొఱ్ఱలు తిననగునా?
71. చింతకాయలు బేరం చేస్తు, వంకరటింకర కాయలేమి అన్నట్లు.
72. చింత చచ్చినా పులుపు చావలేదు.
73. చింతజిక్కిన మనసు, అగ్గిపొంత వెన్న.
74. చింతదూత తూతిందే అన్నదట ఒకతె, తూతేకాలం వస్తే తూతదా అన్నాడట ఇంకొకాయన. దొందూ దొందే అన్నాడట మూడో ఆయన.
75. చింతపండితే, జీడి పండదు.
76. చింతపండు అంటే, సొంతకుండ తెస్తాడు.
77. చింత లేదు, చింతలేకపోతే పులుసు లేదు.
78. చింతలేని అంబలి చారెడే చాలు.
79. చింతలేనమ్మ సంతలో నిద్ర పోయిందట.
80. చింతాకంత బంగారం- మెడచుట్టు తీగె కావాలన్నట్లు.
81. చింత చిగిరింత ఏపు (చిగిరింత=ఒక విధమైన బీటిగడ్డి).
82. చింతపులుసు కన్నా చిక్కగ, పచ్చిపులుసుకన్న పలుచగ.
83. చింతలు పూస్తే సిరులు, మామిళ్ళు పూస్తే మరణాలు.
84. చిక్కని పాలు మీగడలుండగ చీయను గంగాసాగర మేల? (గంగాసాగరం=కల్లు).
85. చిక్కానికి చేరులు తీసినట్లు.
86. చిక్కి చికిలించేకన్నా, వెళ్ళీ వెక్కిరించేది మేలు. (చికిలించు=చింతించు).
87. చిక్కితే దొంగ, చిక్కకుంటే దొర.
88. చిక్కిన తగువా? చిక్కని తగువా?
89. చిక్కినవాడు సిగ్గెరుగడు, బలసినవాడు వావి ఎరుగడు.
90. చిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా కఱుస్తుంది.
91. చిక్కుడు గింజకు తన పాదే తెలియదు.
92. చిక్కుడు తీగకు బీరకాయ కాస్తుందా?
93. చిక్కుదీసి కొప్పు పెట్టినట్లయింది.
94. చిక్కుల గుఱ్ఱానికి కక్కుల కళ్ళెము.
95. చిగిరింత మొక్క చింతచెట్టుతో ఢీకొన్నదట.
96. చిగిరించే కోరిక చేతిలో దాగదు.
97. చిచ్చు అంటుకొంటే చేతులతో ఆపగలమా?
98. చిచ్చు ఉఱుకంగబోతూ చీర సవరించుకొన్న దానివలె.
99. చిచ్చుకు తోడు కరువలి.
100. చిచ్చుగలవారి కోడలు చిత్రాంగి, బావిగలవారి కోడలు పనిమంతురాలు.

No comments: