Wednesday, January 12, 2011

సామెతలు 31

1. గొడ్లు కాచేవాణ్ణి కొట్టనివాడు, గొర్రెలు కాచేవాడిని తిట్టనివాడు ఉండడు.
2. గొడ్డుకు పెత్తనమిస్తే గోదవరంతా తేలియాడిందట.
3. గొప్పగా తెలిసినవారే గోతిలోపడతారు.
4. గొప్ప సత్యాలు గొప్పవారివలనే నిరాడంబరంగా ఉండును.
5. గొప్పలేని బుద్ధి కొంచమైపోవురా
6. గొరగంగా మిగిలిందే జుట్టు.
7. గొరిగించి గోపినామం పెట్టినట్లు.
8. గొఱ్ఱు గుచ్చిన నేలకు కొఱత ఉండదు.
9. గొఱ్ఱె ఎంత ఎదిగినా తోక బెత్తెడే.
10.  గొఱ్ఱె ఏడిస్తే తోడేలుకు కనికరమా?
11. గొఱ్ఱె కటికవాణ్ణి నమ్మినట్లు గొల్లవాణ్ణి నమ్మదు.
12. గొఱ్ఱెకు ఎదురు, గుఱ్ఱానికి వెనుక పోరాదు.
13. గొఱ్ఱె ఏడుస్తే తోడేలుకు విచారమా?
14. గొఱ్ఱె కొవ్వి సెలకట్టె కొరికిందట.
15. గొఱ్ఱె కొవ్వేదంతా కొల్లవానికే లాభం.
16. గొఱ్ఱెదాటు, ఏలంవెఱ్ఱి.
17. గొఱ్ఱెను అడిగి గొంతు కోస్తారా?
18. గొఱ్ఱెను తినేవాడు పోతే, బఱ్ఱెను తినేవాడు వచ్చినట్లు.
19. గొఱ్ఱె పడుకున్న చోట బొచ్చెంత రాలిందని చూచినట్లు.
20. గొఱ్ఱె పెంట ఏడాది, ఆవులపెండ ఆరేండ్లు.
21. గొఱ్ఱె బలిసి చింత కొరికినట్లు.
22. గొఱ్ఱె మంద కంటే, లోతు దుక్కి మేలు.
23. గొఱ్ఱెల మందలో తోడేలు పడినట్లు.
24. గొఱ్ఱెలు కాచినందుకు, లొడుగు తాగినందుకు సరి.
25. గొల్లకంపు గాలి కొట్టింది అత్తగారు అంటే, అంటు అయినది కుండలో నీరు పారబోయి కోడాలా అన్నదిట.
26. గొల్ల చల్ల పుల్లన, గున్న చింత నల్లన.
27. గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు.
28. గొల్ల మెండు ఇల్లు పట్టదు.
29. గొల్లల యిరదాళ్ళు (వీరత్రాళ్ళు) లేని గంగమ్మ కొలువు వలె.
30. గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెఱుక, గొఱ్ఱెల గోత్రాలు గొల్లలకెఱుక.
31. గొల్లవాడా ! గొల్లవాడా! ధాన్యం ఎక్కడుందీ? అంటే, నా గొఱ్ఱె ముడ్డిలో ఉంది అన్నాడట.
32. గొల్లవాడి ఇంట పెండ్లి తెల్లవారుతుంది.
33. గొల్లవాడి కొమ్ము హెచ్చనూ హెచ్చదు, తగ్గనూ తగ్గదు.
34. గొల్లవాడు గొఱ్ఱెపిల్లను చంకనుబెట్టుకొని, అడవంతా వెతికినట్లు.
35. గొల్ల సుద్దులు, గోవింద రొట్టెలు.
36. గొల్ల సుద్దులు, పిల్ల ముద్దులు.
37. గొల్లింట గుఱ్ఱాలు, కుక్కపిల్లలు, ఆవులు ఆడుబిడ్దలు.
38. గొళ్ళెంలేని తలుపు, కళ్ళెంలేని గుఱ్ఱము.


గో


39. గోంగూరలో చింతకాయ వేసినట్లు.
40. గోకి దురద తెచ్చుకొన్నట్లు.
41. గోకుడుకు గోకుడే మందు.
42. గోకులాష్టమికి పీర్ల తిరునాళ్ళకు (పండుగకు) సంభందమేమి?
43. గోగు పెళు(డు)సు, గొల్ల బిరుసు.
44. గోచీకి ఎక్కువ కోకకు తక్కువ.
45. గోచీకి పెద్దా, కోకకు చిన్న.
46. గోచీకి పెద్ద, గవాంచాకు చిన్న.
47. గోచీకి మించిన దరిద్రం లేదు, ఈతకు మించిన లోతులేదు.
48. గోచిపాతల రాయడు దొంగలకు మిండడు.
49. గోచీలో గొంగడి చించుతాడు.
50. గోచీ విప్పి పాగా చుట్టినట్లు.
51. గోటితో పోయే మనికి (త్రుంచేపనికి) గొడ్డలి ఎందుకు?
52. గోడ ఉంటే చిత్రం వ్రాయవచ్చు.
53. గోడకుపూసిన సున్నము విడెములోనికి వచ్చునా?
54. గోడకు పెట్టిన సున్నము, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు.
55. గోడపై సున్నం గోకితే రాదు.
56. గోడదూకిన వాడెవడంటే, ఆలుచచ్చిన వాడన్నట్లు.
57. గోడనుబెట్టి త(డి)డక తన్నాలిగానీ, తడకగట్టి గోడను తన్నరాదు.
58. గోడపట్టుకో, కూలి అడిగివస్తాను.
59. గోడమీది పిల్లివాటము, కోమటి సాక్ష్యము.
60. గోడలకు చెవులుంటాయి, నీడలకు నోళ్ళుంటాయి.
61. గోతిని త్రవ్వినవాడే అందులో పడేది.
62. గోదావరి పారినా, కుక్కకు గతుకు నీళ్ళే గతి.
63. గోదావరి పారిందీ, గొద్దెలేరూ పారింది.
64. గోధుమలు వేస్తే బాదములు పండునా?
65. గోనెల కంటే గోతులు మెండు.
66. గోనెలే కొత్తవి, కోడె లెప్పటివే.
67. గోప్రదక్షిణము, భూప్రదక్షిణ ఫల మిచ్చినట్లు.
68. గోముఖ వ్యాఘ్రం.
69. గోరంత ఆలశ్యం, కొండంత నష్టం.
70. గోరంత నీరైనా గోతులు చేస్తుంది.
71. గోరంతను కొండంత చేయడం.
72. గోరీకాడ నక్కవలె.
73. గోరుచుట్టుపై రోకలిపోటు.
74. గోరువాచిన వేలంత, వేలువాచిన కాలంత, కాలువాచిన రోలంత, రోలువాచిన ఎంత?
75. గోల గోవిందుడిది, అనుభవం వేంకటేశ్వరునిది.
76. గోలుకొండ ఉద్యోగం గొఱ్ఱెతోక ఒకటి.
77. గోవధ కావించి గోరోజనం రోగార్తులకిచ్చిన పుణ్యాత్ముడగునా?
78. గోవును గోలెం (తొట్టి) దగ్గరకు తీసుకు వెళ్ళగలం కానీ, కుడితి తాగించగలమా?
79. గోవులకు కోసి చెప్పులు దానం చేసినట్లు.
80. గోవులేని ఊళ్ళో గోడుగేదే శ్రీమహాలక్ష్మి.
81. గోవే తల్లి, ఎద్దే తండ్రి.


గ్ర


82. గ్రహచారం చాలకపోతే వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట.
83. గ్రచారం చాలక రాచారంపోతే, జన్మనక్షత్రంజూచి నెత్తి గొరిగినదట.


గ్రా


84. గ్రామంలో ఒక కోమటి ఉంటే వెయ్యి రూపాయలు నష్టం, ఒక ఆబోతు ఉంటే వెయ్యి రూపాయలు లాభం.
85. గ్రామమిచ్చిన దాత ఇల్లు కట్టించి ఇవ్వలేడా?
86. గ్రామశాంతికి బోడితల.
87. గ్రాసం లేని కొలువు-మీసంలేని బ్రతుకు.
88. గ్రాసం లేని కొలువు- రసంలేని కావ్యం.
89. గ్రాసం లేని బంతుకు రోసం ఎక్కువ.




90. ఘంటాకర్ణునికి అష్టాక్షరి ఉపదేశం చెయ్యబోయినట్లు.
91. ఘటము లెన్నియైన గగనంబదేకమౌ.
92. ఘడీయకు హాజీ, ఘడియకు ఫాజీ
93. ఘడియ తీరుబాటు లేదు, దమ్మిడి ఆదాయం లేదు.
94. ఘడియ పురుసత్తు లేదు, గవ్వ సంపాదన లేదు.
95. ఘనమగు పులి గోరూపము కాగానే బిడ్డకు పాలు కల్గునా?


ఘో


96. ఘోటక బ్రహ్మచారి.




97. చంకకు ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు.
98. చంకజోలి చిల్లి పోలేదు, చందలూరు కాలిపోలేదు.
99. చంక దుడ్డుకు దండం అన్నట్లు.
100. చంకదుడ్డు శరణార్ధి.

No comments: