Monday, January 17, 2011

సామెతలు 32

1. చంకన పిల్ల కడుపులో పిల్ల.
2. చంకలోతుకు దిగిన వానికి చలి ఏమి?
3. చంకలో పిల్లనుంచుకొని, ఊరంతా గాలించినట్లు.
4. చంకలో పిల్లనుంచుకొని, సంతలో వెదకినట్లు.
5. చంకలో పిల్లను పట్టుకొని, లంకలన్ని వెదకినట్లు.
6. చంటిలో ఎముకలు ఏరినట్లు.
7. చండామార్కుల విద్య చేతులు కావు కాళ్ళు.
8. చందమామకు తోకవచి, 'ఈ' కు ఇఱకాటమైనట్లు.
9. చంద్ర పరివేషము, వర్షయోగము.
10. చంద్రుడు క్రుంకిన వెన్నెల నిలుచునా?
11. చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్లు.
12. చంద్రునికి ఒక నూలుపోగు.
13. చంద్రునిలో కందు వెన్నెలలో గలదా?
14. చక్కగా కూకోరా చాకలి నాయడా ! అంటే, విన్నవటోయ్ ఈడిగనాయడా ! మంగలి నాయడి సరసం అన్నాడట.
15. చక్కదనానికి లొట్టపిట్ట, సంగీతానికి గాడిద.
16. చక్కనమ్మ చిక్కినా చక్కనే (అందమే).
17. చక్కని రాజమార్గముండగ సందుల దూరనేల?
18. చక్కనివాళ్ళు చిక్కినా బాగుంటారు, సన్నచీర మాసినా బాగుంటుంది.
19. చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.
20. చక్కిలాలు తింటావా? చల్ది తింటావా? అంటే, చక్కిలాలూ తింటాను, చల్ది తింటాను, అయ్యతోగూడా అవతల అన్నమూ తింటాను అన్నదిట.
21. చక్కెర తిని చేదు అన్నట్లు.
22. చక్కెర తిను నోరు చవిగొనునే చేదు.
23. చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు.
24. చక్కెర పూసిన విషమువలె.
25. చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు.
26. చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలి చేస్తే వ్యభిచారం.
27. చచ్చిన ఆవుమీద చెప్పు లుంచినట్లు.
28. చచ్చిన గొడ్డుకు బొరవలు, పుండుకు ఈగలు కనిపెట్టుకు ఉంటవి.
29. చచ్చిన చారమేకపాలు, పోయిన బోసిముంతెడు.
30. చచ్చిన తరవాత తెలుస్తుంది (బయటపడుతుంది) సెట్టి భండారం.
31. చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళకింద.
32. చచ్చినట్టు కలవచ్చినా మేలుకోక తప్పదు.
33. చచ్చిననాటి దుఃఖం మరునాడు ఉంటుందా?
34. చచ్చినపామును కొట్టడానికి అందరూ బంట్లే.
35. చచ్చినపామును చావగొట్టినట్లు.
36. చచ్చిన బిడ్డకు చారెడు కండ్లు.
37. చచ్చిన మొగుడు చనుబాలు మీద, బతికిన మొగుడు మంచం మీద.
38. చచ్చినవాడి కండ్లు పత్తికాయలంత.
39. చచ్చినవాని కండ్లు చారెడేసి.
40. చచ్చినవాడి తల తూర్పున ఉంటేనేమీ? పడమటనుంటే నేమి?
41. చచ్చినవాని పెండ్లికి వచ్చిందే లాభం.
42. చచ్చినవాని పెండ్లికి వచ్చినంతే కట్నం.
43. చచ్చినవారు వత్తురే ఏడ్చినంత.
44. చచ్చినా పైకం తప్పదు అచ్చమ్మా! ఇక తిట్టకు.
45. చచ్చినోడి గద్ద తక్కెడో, బిక్కెడో.
46. చచ్చినోడు చాటెడంత.
47. చచ్చిపోయిన బఱ్ఱె పగిలిపోయిన ముంతెడు పాలిచ్చేది.
48. చచ్చేకాలానికి సత్యభామ వేషం వేసినట్లు.
49. చచ్చేటప్పుడు సంధ్య మంత్రమా?
50. చచ్చేటప్పుడు సారె కావిళ్ళు.
51. చచ్చేదాకా బ్రతికితే పెళ్ళిచేస్తానన్నట్లు.
52. చచ్చెదాకా వైద్యుడు వదలడు, చచ్చినా పంచాగం బ్రాహ్మడు వదలడు.
53. చచ్చే పెళ్ళాన్ని ' అమ్మా ' అంటే బ్రతుకుతుందా?
54. చచ్చే రోగికి మందు పట్టదు.
55. చచ్చేవానికి సముద్రం మోకాలిబంటి.
56. చట్టిలోకి కూరాకు, ముడ్డిలోకి మేకు తెచ్చుకుంటేగానీ రావు.
57. చట్టిలో ఉంటే అబకకు వస్తుంది (అబక=కొబ్బరి చిప్పతో చేసిన గరిట).
58. చట్టుబొమ్మకు గిలిగింత పెట్టినట్లు.
59. చట్రాతిన వార తీసినట్లు.
60. చట్రాతిలో నీరు, చండాలవాటికలో బ్రాహ్మణగృహం ఉంటుందా?
61. చతురతకు జాణగాడే కానీ, చేతిలో చిల్లిగవ్వ లేదు.
62. చనవిచ్చిన ఆలి చంకకెక్కు.
63. చదివింది, చదువనిది ఒకటిగా ఉండడమే పండితలక్షణం.
64. చదివిన కూతలుంటే, ఉణ్ణీగానీ, సంచులుమాత్రం ముట్టవద్దు.
65. చదివి నతని కంటే చాకలి సతిమేలు.
66. చదివినవాడికన్నా చాకలివాడు మేలు.
67. చదివేది రామాయణం, పడకొట్టేది దేవాలయం.
68. చదవక ముందు కాకరకాయ, చదివిన వెనుక కీకరకాయ.
69. చదివిన ముందు పెసలంటు, చదివిస్తే పిసలన్నట్లు.
70. చదవక ముందు వరవర అంటే, చదివిన వెనుక వడవడ అన్నడట.
71. చదువనేర్చిన ఆడవారితోనూ, వంటనేర్చిన మొగవారితోనూ ఓపలేము.
72. చదువ నేర్తువా? వ్రాయనేర్తువా? అంటే, చదువ నేరను, చించ నేర్తును అన్నాడట.
73. చదువరి మతికన్నా చాకలి మతి మేలి.
74. చదువేస్తే ఉన్న మతి పోయినట్లు.
75. చదువాలేదు మరువా లేదు.
76. చదువుకున్న వాడికీ సేద్యగాడే అన్నం పెట్టవలె.
77. చదువుకు ముదురు, సాముకు లేత.
78. చదువుకోనన్నాళ్ళు పసులు పసులు అని, చదువుకొన్నాక పచులు పచులు అన్నాడట.
79. చదువు, చన్ను విడిచి చన్ను పట్టుకునేలోపల రావాల.
80. చదువు చారెడు, బలపాలు దోసెడు.
81. చదువు మా ఇంట లేదు, సంధ్య మావంశాన లేదు.
82. చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు
83. చదువుల చెట్టుకు వేళ్ళు చేదుగానీ పండ్లు తీపు.
84. చదువు చదివెడి అయ్యలు పదవులు పొందంగలేరు.
85. చదువు సంధ్య లేకుండా మాదిగ వెధవవుతున్నావన్నది విని, మాదిగ- అరె అత్తాలేకుండా బ్యామ్మణ గాడిద అవుతున్నా వన్నాడట.
86. చదు సన్నమయ్యె, అయ్య లావాయె.
87. చదువు లేదు సంధ్య లేదు, సంతానం మాత్రం మెండు.
88. చద్ది కంటే ఊరగాయ ఘనం.
89. చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలెరుగదు.
90. చద్ది తెచ్చుకున్న బ్రహ్మణుడా! భోజనం చెయ్యి.
91. చద్ది నాకు పెట్టమ్మా, ఆకలికాకుండా నీకు మందిస్తా అన్నాడుట.
92. చద్ది పురిసెడు, ఊరగాయ దోసెడు.
93. చద్ది మూటలో సారం చాకలి ఎరుగును.
94. చద్దెన్నం మీద వెన్న చంద్రుడౌతుందా?
95. చన విస్తే చంక కెక్కినట్లు.
96. చనువు చేసిన ఆలి చంక కెక్కు.
97. చన్ను కుడిచి, రొమ్ము గ్రుద్దినట్లు.
98. చన్ను, తోటకూరా చెయ్యి తగలనిదే పెరుగవు.
99. చమురు దండుగ భాగవతం (భాగోతం).
100. చమురు నష్టియే గానీ పిల్ల బ్రతుకదు.

No comments: