Wednesday, February 9, 2011

సామెతలు 37

1. చెల్లెలి మగని చూచుకొని చెయ్యి విఱుగ బడ్డదట.
2. చెల్లెలి వరుస చెడి చేసుకోవాలి, తల్లి వరుస తప్పి చేసుకోవాలి.
3. చెవికోసిన మేక, కరివేపాకు కోసే ఎరుకలవాడు ఊరకుండరు.
4. చెవికోసిన మేకవలే అరుస్తాడు.
5. చెవిటి చెన్నప్పా! అంటే సెనగల మల్లప్పా అన్నాడట.
6. చెవిటి చెన్నారమా? అంటే చెనిగలు పదకొండు అందిట.
7. చెవిటిదానా సేసలు పట్టమంటే- బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అన్నదట.
8. చెవిటి పెద్దమ్మా! చేంతాడు తేవే అంటే, చెవులపోగులు నా జన్మలో ఎఱుగనన్నదట.
9. చెవిటివానికి శంఖమూదినట్లు, మూగవానికి ముక్కు గీరుకున్నట్లు.
10. చెవిటివాని ఎదుట శంఖం ఊదితే, అది కొరకటానికి నీ తండ్రి తాతల తరము కాదన్నాడట.
11. చెవిలో చెప్పిన మాట గానీ, అరచి చెప్పినమాట గానీ వినదగియుండవు.
12. చెవిటివానికి వినిపించాలంటే శంఖచక్రాలవాడు దిగిరావాలి.
13. చెవిదగ్గర కందురీగ (కంతిరీగ) వలె.
14. చెవుడు, చెవుడూ అంటే, తవుడు తవుడూ అన్నట్లు.
15. చెవులు కోసుకు పోతుంటే, కుట్టుకాడలకు ఏడ్చినట్లు.
16. చెవులపిల్లి ఎదురైతే చేటు వస్తుంది.
17. చెవులో గుమి(బి)లికి ఏపుల్ల ఐతేనేమి గెలుక్కోను.
18. చెవ్వాకు పోయినమ్మకు దుఃఖమూలేదు, దొరికినమ్మకు సంతోషమూ లేదు.


చే


19. చేటను కొట్టి పిల్లిని బెదరించినట్లు.
20. చేటభారతము - కంప రామాయణము.
21. చేటలో వెలగకాయల వలె.
22. చేటు ఎరుగని చేడె మొగుడికి పెళ్ళి చేసిందట.
23. చేటుకాలమయిన చెరువ నల్పుడే చాలు.
24. చేటుకాలానికి చెడ్డ బుద్ధులు.
25. చేటు మూడినప్పుడు మాటలు దోపవు.
26. చేటూ పాటూ ఎఱుగనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట.
27. చేటూ పాటూ ఎఱుగనమ్మ మగని పెళ్ళి కెళ్ళిందట.
28. చేటెడు తిని చెడితి, వాకిలి దాటి పడితి.
29. చేతకానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.
30. చేతకానమ్మకు శౌర్యమెక్కువ.
31. చేతనైన మగోడు (మగవాడు) చాలాపొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకొకచోట వండుకొన్నాడట.
32. చేత వెన్నయుండ నేతికేడ్చెడి వారె.
33. చేతికలుపు - వైద్యునిచేతి తళుకు.
34. చేతికి అందినది వాతి కందదు.
35. చేతికి దొరికిన రత్నం నాచుక పోయినట్లు.
36. చేతికిబట్టిన జిడ్డు లెక్కకు రాదు.
37. చేతిచమురు భాగవతం చెప్పుకొన్నట్లు.
38. చేతిమల్లెపూవు గుండ్రాతికి ఓర్వజాలునా?
39. చేతిలో ఉంటే అర్ధం, చేరువలో ఉంటే పెళ్ళాం.
40. చేతిలో కఱ్ఱ చేదోడు, వాదోడు.
41. చేతిలోది లేత, చేలోది ముదురు.
42. చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యినాకి చెరువు నీళ్ళు తాగినట్లు.
43. చేతిలో లేనిది చేలోకి ఎలావస్తుంది?
44. చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యికోసం ఊరంతా వెతికినట్లు.
45. చేతివేళ్ళు అయిదు ఒకరీతిగా ఉంటాయా?
46. చేతిసొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
47. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు.
48. చేతులు చెయ్యవు, నోరుతినదు.
49. చేతులు పొడుగని మూతులు పొడుస్తారా?
50. చేదతాడు (చేంతాడు) కురుచైతే బావి పూడ్చుకుంటారా?
51. చేదు తింటారా? చెట్టు కొడతారా?
52. చేనికి ఎరువు, మడికి మంద.
53. చేనికి గట్టు, ఊరికి కట్టు ఉండాలి.
54. చేసినపాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయి హరహరా అన్నాడుట.
55. చేసినపాపం చెపితే తీరుతుంది.
56. చేసినపాపం చెఱగున కాశీకిపోతే కడతేరుతుందా?
57. చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి.
58. చేసినమ్మ చేవ, చేయనమ్మ చెదలు.
59. చేసినవాడు (చేసినోడు) చేసిపోగా, నిలుచున్నోడికి నీళ్ళు కారిపోయినట్లు.
60. చేసినవారికి చేసినంత మహదేవ!
61. చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు.
62. చేసుకున్న కర్మమోయి శంభులింగమా! అంటే, అనుభవించక తీరదోయి అబ్బులింగమా! అన్నాడట.
63. చేసుకున్న తరవాత వండిపెట్టక తప్పుతుందా?
64. చేసుకున్నదానుకి మూసుకోను లేదు, ఉంచుకున్నదానికి ఉభయరాగాల చీర.
65. చేసుకున్న కడుపు దించుకోక తప్పదు.
66. చేసేది బీద కాపురం, వచ్చేవి రాజభోగాలు.
67. చేసేది శివపూజ, కుడిచేది మాలకూడు.
68. చేసేది శివపూజ, దూరేది దొమ్మరి గుడిసె.
69. చేసేపని వదలి నేసేవాని వెంట పోయినట్లు.
70. చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు.
71. చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
72. చేసేవి లోపాలు, చెపితే కోపాలు.
73. చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్ధాలు.


చై


74. చైత్ర వైశాఖలలో పెండ్లి కావిళ్ళు (సారెకావిళ్ళు), శ్రావణ భాద్రపదాలలో దినం కావిళ్ళు.


చొ


75. చొప్పవామిలో నిప్పు దాచుకొన్నాట్లు.
76. చొల్లంగి తీర్ధానికి చోడిగింజలంతేసి (మామిడిపిందెలు).


చో


77. చోటే లేదంటే మూల ఎక్కడ వెదుకుదును అన్నాడట.
78. చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట.
79. చోద్యాల సోమిదేవమ్మకు వాద్యారి మొగుడు.
80. చోళ్ళు చల్లితే జొన్నలు పండునా?
81. చోళ్ళు విసరే తిరగలి, జొన్నలు విసరునా?
82. చోళ్ళు విసరే తిరగలి ఆళ్ళు విసరునా?


చౌ


83. చౌక దూబరతిండికి కారణం.
84. చౌటినేల వల్ల జలమెల్ల చెడిపోయె.
85. చౌడోలు గాడిదపై గట్టినట్లు.
86. చౌదంతి నెక్కగానే చక్రవర్తి అగునా?


ఛీ


87. ఛీ! కుక్కా అంటే, ఏమక్కా ! అన్నదట.
88. ఛీ! ఛీ! అనేదీ ఈ నోరే, శివశివా అనేదీ ఈ నోరే.




89. జంగమైన వెనుక జాతినెంచగరాదు.
90. జంగానికి పిల్లలు పుడితే, ఊరివారి గోడు పోసుకున్నాడట.
91. జంగానికి బిడ్దలు ఊరికి ఉపాధి.
92. జంగాలపాలు దేవాంగుల విత్తము, కాపు విత్తం పంజుగాని పాలు (పంజుగాడు=దివిటిలు పట్టేవాడు).
93. జంగాలో! దాసర్లో ! ముందూరుని బట్టి.
94. జగడమెట్లా వస్తాది లింగమయ్యా అంటే, బిచ్చంపెట్టవే బొచ్చుముండా అన్నాడట.
95. జగ బిరుదు, ముండమొఱ్ఱ.
96. జగమెరిగిన బ్రాహ్మడికి జందె మెందుకు?
97. జడరాశిలో దాగని జడబానలమా?
98. జడ్డిగములోనే మిడతపోటు.
99. జన మర్లు, జాతర మర్లు.
100. జనవాక్యం కర్తవ్యం.

No comments: