1. చెడిన చేనుకు ఇంటివడ్లు పొంగలా?
2. చెడిన చేలుకి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి?
3. చెడిన శ్రాద్ధం చెడనే చెడ్డది, పిత్తరా పీట పగుల.
4. చెడినా పడినా చేసుకున్న మొగుడు తప్పడు.
5. చెడినా సెట్టి సెట్టే, చిరిగినా పట్టు పట్టే.
6. చెడిపోయిన బ్రహ్మణుడికి చచ్చిపోయిన ఆవు దానం.
7. చెడిపోయెపో గుడిపాడని కోడలంటే, పచ్చరాగులపాడు పాడు పాడాయెపో అన్నదట అత్త.
8. చెడి బతికినమ్మ చేతులు చూడు, బతికి చెడ్డమ్మ చెవులు చూడు.
9. చెడి బ్రతికినవాడికి శౌర్యమెక్కువ, బ్రతికి చెడినవాదికి బదవలు ఎక్కువ.
10. చెడి బ్రతికిన వాని చెంపలు చూడు, బ్రతికి చెడినవాని బట్టలు చూడు.
11. చెడి స్నేహితునింటికి పోవచ్చునుకానీ, చుట్టాలింటికి (చెల్లెలింటికి) పోరాదు.
12. చెడుకాలానికి చెడు బుద్ధులు.
13. చెడుకాలమైన ఎవ్వరి దెస నే వికారము వచ్చునో?
14. చెడు చెడు అనగానే చెడేవారు లేరు.
15. చెడు చెడు మనేవారేగానీ, చేతిలో పెట్టేవారే లేరు.
16. చెడ్డచేనుకు ఇన్ని మంచెలా?
17. చెడ్డచేనుకు ఇంట్లో పొంగళ్ళా?
18. చెడ్డసొమ్ము చెరి సొగం.
19. చెడ్డాపడ్డా చేబ్రోలే గతి.
20. చెడ్డాపడ్డా శ్రీకాకుళమే గతి.
21. చెదలుకాళ్ళవాడు క్షణ మొకచోట నిలువడు.
22. చెన్నంపల్లి పంచాయతి చెరిసొగం.
23. చెప్పంత పొలం చెప్పినట్లు కొనాలి.
24. చెప్పకపోయినా దుప్పికొమ్ముల ఎద్దునే కొను.
25. చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం.
26. చెప్పనేర్చిన మాట సెబాస్ మాట.
27. చెప్పింది చేయబోకురా! చేసేది చెప్పబోకురా.
28. చెప్పి చెప్పి చెప్పుతో కొట్టించుకో, మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో.
29. చెపితే పాపంగానీ, తిరగేసి పొడిస్తే చస్తుంది అన్నట్లు.
30. చెపితే సిగ్గు దాస్తే దుఃఖం.
31. చెప్పినంత చేసేవారు శివుడికన్నా లేరు.
32. చెప్పిన కొద్ది చెవుడు పడిపోతారు.
33. చెప్పిన బుద్ధి, కట్టిన సద్ది ఎంతకాలం నిలుచును?
34. చెప్పిన మాట విని వచ్చేవాడిని చెవు బట్టుకొని లాక్కొచ్చి, ఎదురు తిరిగిన వాడికి సాక్ష్యం బెట్టి వచ్చినా.
35. చెప్పుకాలు నెత్తిన బెట్టి శఠగోపుర మంటాడు.
36. చెప్పు కింద తేలువలె.
37. చెప్పు కొరికినామని సిద్ది కొరుకుతామా?
38. చెప్పటం కంటే చెయ్యటం మేలు.
39. చెప్పుడూ మాటలకన్నా తప్పుడు మాటలు నయం.
40. చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్లు.
41. చెప్పు తినెడి కుక్క చెఱుకు తీపెరుగునా?
42. చెప్పు పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు.
43. చెప్పులవానికి చేనంతా తోలుతో కప్పినట్లుంటుంది.
44. చెప్పులు ఉన్నవాడితోనూ, అప్పులున్నవాడితోనూ పోరాదు.
45. చెప్పులు చిన్నవని కాలు తెగకోసుకుంటారా?
46. చెప్పులు ఉన్నా, చెప్పులు తెగినా చుట్ట(ట్టి)రికం తప్పదు.
47. చెప్పులోని రాయి- చెవిలోని జోరీగ-ఇంటిలోని పోరు.
48. చెప్పుడుమాటలు చేటు.
49. చెప్పేది చెవిదగ్గఱ, వినేది రోటిదగ్గఱ.
50. చెప్పేవానికి చేదస్తమయితే, వినేవానికి వివేకం వద్దా?
51. చెప్పేవానికి వినేవాడు లోకువ.
52. చెప్పేవి నీతులు, చేసేవి గోతులు.
53. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
54. చెయ్యగానని వారికి నీతులు మెండు, చెల్లని రూపాయికి గీతలు మెండు.
55. చెయ్యా పెట్టాలేనాతడికి దిశ పన్నెండామడ.
56. చెయ్యి అలసిన వేళ తెప్ప దొరికినరీతి (ఈది అలసినప్పుడు).
57. చెయ్యి కాలినప్పుడల్లా కుండ వదిలిపెడతామా?
58. చెయ్యిచూపి అవలక్షణ మనిపించుకొన్నట్లు.
59. చెయ్యి దాచుకుంటాము గాని, కులం దాచుకుంటామా?
60. చెయ్యి పుచ్చుకుని లాగితే రాలేదుగానీ, ఇంటికి చీటీ వ్రాసాడుట.
61. చెరు(ఱు)కా ! బెల్లం (పెట్టు) అంటే పెడుతుందా?
62. చెరుకు అని వేళ్ళతో పెరకకూడదు.
63. చెరుకు ఉండేచోటుకి చీమలు తామే వస్తవి.
64. చెరుకుకు చెఱువు సూలంగి.
65. చెరుకు కొనఏమి, మొదలేమి?
66. చెరుకు తియ్యనని వేళ్ళతో గూడా తిన్నట్లు.
67. చెరుకుతోటలో ఏనుగు పడినట్లు.
68. చెరుకు నమలడానికి కూలీ అడిగినట్లు.
69. చెరుకు పిప్పికి ఈగలు మూగినట్లు.
70. చెరుకు వంకరబోతే, తీపి చెడుతుందా?
71. చెఱకుతోటలోన చెత్తకుప్పుండిన కొంచమైన దాని గుణము చెడదు.
72. చెఱకుదిన్న నోరు చేదారగించునా?
73. చెఱకురసము కన్న చెలిమాట తీపురా.
74. చెఱకువిల్తుడు విరహిణులపాలిటి పచ్చితురక.
75. చెఱపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
76. చెఱపటానికి చేట పెయ్య చాలును.
77. చెఱపటానికి చేతులు వస్తాయిగానీ, నిలవడానికి మతులు రావు.
78. చెఱువు ఎండితే చేపలు బయటపడతాయి.
79. చెఱువు ఎండిపోయి, చేను బీడైతే కరణం పెండ్లానికి కాసులదండట.
80. చెఱువు వోడు, ఊరు పాడు.
81. చెఱువుకు చేరువగానూ, చుట్టాలకు దూరముగాను ఉండవలె.
82. చెఱువుకు నీటి ఆశ, నీటికి చెఱువు ఆశ.
83. చెఱువు తెగగొట్టి చేపలు వండిపెట్టాగానే మాన్యుడగునా?
84. చెఱువు నిండితే కప్పలు చేరవా?
85. చెఱువును చూడబోయిన తూటితీగ (తూడు) తిరిగివచ్చునా?
86. చెఱువును మూకుడుతో మూయనగునా?
87. చెఱువును విడిచి కాలువను పొగిడినట్లు.
88. చెఱువును విడిచి వరవను పొగిడినట్లు.
89. చెఱువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా పోయినట్లు.
90. చెఱువు మీద కొంగ అలిగినట్లు.
91. చెఱువు ముందు చలివేంద్రమా?
92. చెఱువులు తెంచి, చేపలు వండినట్లు.
93. చెఱువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూచి బేరం చేసినట్లు.
94.చెలమకు పిట్టలు చేరినట్లు.
95. చెలిమాత చెఱకు ఊట.
96. చెలిమిని చేదు తినిపించవచ్చు గానీ, బలిమిని పాలు త్రాగించలేము.
97. చెల్లని కాసుకు గరుకులు (గీతలు) మెండు.
98. చెల్లని కాసు-వ(వొ)ల్లని మొగుడు.
99. చెల్లని దాన్ని చేనుకాడ పెడితే, అయినకంకులన్నీ అమ్మగారింటికి పంపింది.
100. చెల్లీ చెల్లడములకు (పుట్టచాటున) సెట్టిగారున్నారు (దారిదోపుడుగాండ్రతో).
No comments:
Post a Comment