Sunday, December 25, 2011

సామెతలు 85


1. వగలాడీ! నీకు మగలెందరే? అంటే, తొలి మగనితో తొంభైమంది అందిట.
2. వగలాడీ! నీకు మగలెందరే? అంటే,తోలాడిగాడితో తొంభైమంది అన్నదట.
3. వగలు ఎందుకంటే, పొగాకు కోసం అన్నట్లు.
4. వగలేని మొగుడా పగ లెందుకు వచ్చినా వంటే, అందుకు కాదులే అగ్గికి వచ్చినా అన్నాడట.
5. వగలేని వాడు లంజరిక మాడితే, ఇంటికి దుగ్గాని పంపకం.
6. వగ్గు కోతికి సివమెత్తినట్లు.
7. వచ్చింది క్రొత్త, వదిగి ఉండు అత్త.
8. వచ్చిన కర్మం వద్దంటే పోతుందా?
9. వచ్చిన కోడలు నచ్చితే, ఆడబిడ్డ అదిరిపడిందట.
10. వచ్చిన వాడు పరాచుట్టము, మరునాడు మాడచుట్టము, మూడవనాడు ముఱికిచుట్టము.
11. వచ్చిన పేరు చచ్చినా పోదు.
12. వచ్చినమ్మకు ఒయ్యారము, రానమ్మకు రాగాలు.
13. వచ్చినవారికి వరమిస్తాను, రానివారికి రాయి వేస్తాను.
14. వచ్చిపోతూ ఉంటే బాంధవ్యము, ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారము.
15. వచ్చీపోయేవాళ్ళు సత్రం గోడకు సున్నం కొడతారా?
16. వచ్చీరాని చన్ను - పేరీ పేరని పెరుగు.
17. వచ్చీరాని మాటలు, ఊరీఊరని ఊరగాయ రుచి.
18. వచ్చీరాని మాట వరహాల మూట.
19. వచ్చు కీడు వాక్కే చెప్పును.
20. వచ్చేటప్పుడు ఉలవ, పోయేటప్పుడు నువ్వు.
21. వచ్చేటప్పుడు తీసుకరారు, పొయ్యేటప్పుడు తీసుకపోరు.
22. వచ్చేవారికి తట్టదింపి, పోయేవారికి తట్ట ఎత్తుట మంచిపని.
23. వచ్చేవారికి స్వాగతం, వెళ్ళేవారికి ఆసీమాంతం.
24. వజ్రానికి సాన - బుద్ధికి చదువు.
25. వట్టల నొప్పి చీమ కేమి తెలుసు?
26. వట్టలు గీరుకొన్నంత సుఖం, వైకుంఠంలో కూడా ఉండదు.
27. వట్టలు వాసిన వీరారెడ్డీ! వడ్ల ధర ఎంతంటే, అవి ఉంటే ఇవి ఎందుకు వాస్తవి? అన్నాడట.
28. వట్టింటికి పోచిళ్ళూ చల్లినట్లు.
29. వట్టి అమ్మి కెందుకురా నిట్టూర్పులు?
30. వట్టి గొడ్డుకు (గేదెకు) అరుపులెక్కువ, వానలేని మబ్బుకు ఉఱుము లెక్కువ.
31. వట్టి గొడ్డుకు అఱ్ఱు లావు.
32. వట్టిచేతులతో మూరవేసి ఏమి లాభం?
33. వట్టి నిందలు చెప్పితే గట్టి నిందలు వచ్చును.
34. వట్టి నేలలో కప్ప అఱచినా, నల్లచీమ గుడ్డుమోసినా వాన తప్పదు.
35. వట్టి మాటలవల్ల పొట్టలు నిండునా?
36. వట్టీ మట్టి అయితే మాత్రం ఉట్టినే (ఊరక) వస్తుందా?
37. వట్టి విశ్వాసంతోనే ఏ పని కాకపోయినా, అది లేకపోతే మాత్రం ఏ పనీ కాదు.
38. వడగండ్లు పడితే వఱపు.
39. వడికిందంతా పత్తి అయినట్లు.
40. వడ్డించి సద్ది తీసుకో.
41. వడ్డించేవాడు (వారు) మనవారైతే కడపటి బంతిన కూర్చున్నా ఒకటే (మేలు).
42. వడ్డి ఆశ మొదలు చెఱచును.
43. వడ్డి, ఉప్పర సభామధ్యే, వైదికః పండితోత్తమః (సాలి జాండ్ర సభామధ్యే సాతానిః పండితోత్తమః).
44. వడ్డికి చేటు, అసలుకు పట్టము.
45. వడ్డి ముందఱ వడిగుఱ్ఱాలుగూడా పాఱవు.
46. వడ్డెవానికి బిడ్డ అయి పుట్టేదానికంటే ధరణీపతికి దాసి అయి పుట్టేది మేలు.
47. వడ్డోడికి పెండ్లాము పెద్దది కావాల (తట్ట ఎత్తి పనిచేయును), కాపోడికి గొడ్డు పెద్దది కావాల.
48. వడ్లగాదిలో పందికొక్కు వలె.
49. వడ్లగింజలోది బియ్యపుగింజ (అనుకొన్నంత రహశ్యం కాదనుట).
50. వడ్లతో కూడా దాగర (తట్ట) ఎండినట్లు (దాగర=పెద్ద చేట).
51. వడ్లరాసి వరదకు పోతుంటే, పాలోణ్ణి కనిపెట్టి ఉండమన్నాడట.
52. వడ్లరాసి వరదకు పోయినా, వానకు కఱవు రాదు.
53. వడ్లవాండ్ల పిల్లేమి చేస్తున్నది అంటే, వలకపోసి ఎత్తుకుంటున్నది అన్నాడట.
54. వడ్లు ఏదుం, పిచ్చుకలు పందుం.
55. వడ్లు, గొడ్లు ఉన్నవానిదే వ్యవసాయం.
56. వత్తు పొయిలో పెట్టి తీనెపొయిలో తీసినట్లు (వత్తుపొయి=పొంతకుండ పొయ్యి; తీనెపొయి=తిన్నెపొయ్యి, ప్రక్కన గట్టుతో వేసినది).
57. వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి.
58. వదినాలు పాడకుంటే, వరిబువ్వ (కూడు) ఎవరు పెడతారు?
59. వదినెకు ఒకసరి, గుంజకు బిదిసరి.
60. వదినె చందాన వచ్చి పావడ వదిలించిపోయినట్లు.
61. వద్దన్న పని వాలాయించి చేస్తారు.
62. వనం విడిచిన పక్షి, జనం విడిచిన మనిషి.
63. వనవాసం చెయ్యలేరు, వంగి వంగి తిరుగాలేరు.
64. పని(లి)కెం పట్టు విత్తితే వజ్రాల పంత కంత చూస్తాము.
65. వనితగానీ, కవితగానీ వలచి రావాలి.
66. వనిత లేనప్పుడు విరక్తి మంచిదనినట్లు.
67. వన్నెకాని గంజి ఈగలపాలు.
68. వన్నెకు సున్నం పెడితే వమ్మక పుండయిందట (వమ్మక=పరిహాసం).
69. వన్నెచీర కట్టుకున్న సంబరమేకానీ, వెఱ్ఱికుక్క కఱిచిన సంగ తెఱుగదు.
70. వన్నెబట్టలమ్మ వలపుడు కన్న, గుడ్డబట్తలమ్మ కులుకుడే లావు.
71. వన్నె మాదిరే వన్నెపుడుతుంది, ఒళ్ళు వాచేది ఎఱుగదు.
72. వన్నెలమ్మను ఎండబెట్టిన, ఇంటిరాజులను పండబెట్టిందట.
73. వయసు కలిగిన నాడే వనిత వలపు.
74. వయసు కురకుర, బాతు కురకుర.
75. వయసు తప్పినా వయ్యారం తప్పలేదు.
76. వయస్సు ముసలెద్దు, మనసు కోడెదూడ.
77. వరదలు వస్తాయని వర్షా లాగవు.
78. వరమైన పేరు గలిగిన గంగరావికి వందనమొనర్చగానే వరమొసగునా?
79. వరపుకు వారధు లింకునా?
80. వరవుడి ఇల్లాలౌనా, వాపు బలుపగునా? (వరవుడి=దాసి).
81. వరహాకన్నా వడ్డీ ముద్దు, కొడుకుకన్నా మనుమడు ముద్దు.
82. వరహాను ముప్పావు చేసుక వచ్చినా, మా యింటాయన ఎద్దుల బేరగాడైనా డంతేచాలు! అన్నదట.
83. వరికి ఒక వాన, ఊదరకు ఒక వాన కురుస్తుందా? (ఊదర=వరిపైరులో మెలచే కలుపు మొక్క, దీని గట్టిగింజలు ధాన్యంలో కలిసి ఎంతచెరిగినా పోవు.)
84. వరికి వాక, దొరకు మూక.
85. వరి చెడి ఊదర బలిసినట్లు.
86. వరి పందని ఊరు - దొర యుందని ఊరు ఒకటి.
87. వరిపట్టు కడితే వర్షం (వాన) గొప్ప.
88. వరిపొట్టకు పుట్టెడు నీళ్ళు (కావలె).
89. వరిమొలక, మగమొలకా ఒకటి.
90. వరి వడ్డు కేసి, తుంగ నాటు పెట్టినట్లు.
91. వరుగుతో దాగరగూడా ఎండవలసినట్లు. (వరుగు= పండిన వంకాయ మెదలగు వానిని బద్దలుగా కోసి ఎండబెట్టినది; వంగ వరుగు).
92. వరుసను దునితే వజ్రాలిస్తా నంటుంది భూమి.
93. వరుసలెల్ల వల్లకాటిలో పెట్టి, వదినె పిన్నమ్మ ! గంపెత్తు.
94. వర్లి వర్లి వాడు పోయె, వండుకతిని వీడు పోయె.(వరలు=వదరు).
95. వఱపుకు మెఱుపులు, వట్టిగొడ్డుకు అఱపులు మెండు.
96. వఱ్ఱేట ఓడ ఉండగా, వర దూదినట్లు (వఱ్ఱు=వెల్లువ, వఱద).
97. వలకంటే ముందు రాళ్ళు విసరినట్లు.
98. వలచివస్తే, మేనమామ కూతురు వావికా దన్నట్లు.
99. వలపుకు పలుపు దెబ్బలు, వ(ఒ)య్యారికి చెప్పు దెబ్బలు.
100. వలలోజిక్కిన మెకము చూడుదని వేటకాడు వదలునా?

1 comment:

Anonymous said...

చాలా బాగున్నాయి మీ సేకరణలు డి.ఎస్. గారు. అభినందనలు.

Visali.