1. రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట.
2. రోసి వేసినది రాశికి వచ్చింది.
3. రోసానికి పోయిన రొండ్లెగుసవు.
4. రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.
5. రోహిణి ఎండకు రోళ్ళు పగులును.
6. రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.
7. రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.
8. రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.
9. రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.
10. రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.
రౌ
11. రౌతు కొద్ది గుఱ్ఱము.
12. రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.
13. రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది.
ఱ
14. ఱంకాడ నేర్చినమ్మ బొంకాడ నేర్వదా?
15. ఱంకు చదువు చదివి ఱంకున జెడుదురు.
16. ఱంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు.
17. ఱంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు.
18. ఱంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది.
19. ఱంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు.
20. ఱంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ.
21. ఱంకుమగడు వీపుమన్ను దులిపిపోవునా?
22. ఱంకులసాని రాగంతీస్తే, రల్లిబండ రాతిలింగం కడకు నడుస్తుంది.
23. ఱంకు సాగితే పెళ్ళెందుకు?
24. ఱంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ.
ఱా
25. ఱాతిలో నార తీసినట్లు.
26. ఱాతికంటే గట్టి రాయలసీమ కోడి.
27. ఱాతి టెంకాయ వలె.
28. ఱారిబొమ్మకు చక్కిలిగింతలా? (గిలిగింతలా?)
29. ఱాయి గుద్దనేల? చెయ్యి నొవ్వనేల?
30. ఱాయివోలె ఉంటే రాసికొందుము, పువ్వువోలె ఉంటే పూసికొందుము.
31. ఱాల (కొట్టిన) రువ్విన వానిని పూల దువ్వుతారా?
32. ఱాళ్ళు తిని ఇళ్ళు ఆరగించుకుంటారు.
ఱె
33. ఱెక్క ఆడితేగానీ డొక్క ఆడదు.
34. ఱెక్కల కష్టం, బొక్కల పులుసు.
35. ఱెక్కలు పెరికిన పెట్ట (కోడి)వలె. (ఈకలుపెరికిన కోడి వలె).
36. ఱెక్కలు విఱిగిన పక్షి వలె.
37. ఱెప్పలతో దీపాలు ఆర్పినట్లు.
ల
38. లంక కాల్చినవాడు రాముడి లెంక.
39. లంక(ఘ)నాలలో మనుగుడుపులు తలచుకొన్నట్లు.
40. లంక మేతకు, ఏటి ఈతకు సరి (ఏరుదాటి మేసి, తిరిగి యీది దాటే లోపల తిన్నగడ్డి జీర్ణమై పోయినట్లు).
41. లంక మేత, గోదావరి ఈత.
42. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే.
43. లంఖ(ఘ)ణానికి పెడితే పథ్యానికి దిగితుంది.
44. లంఖణాలకు పెడితేగానీ పైత్యం వదలదు.
45. లంచం పెట్టినది మాట, పుంజం పెట్టినది బట్ట (పుంజం= కొన్ని నూలుపోగుల మొత్తం).
46. లంచం లేనిదే మంచం ఎక్కదు.
47. లంచమనే చెట్టుకొమ్మలు నలుప్రక్కలా ప్రాకియుండును.
48. లంజకు ఒకడే మొగుడా?
49. లంజకు నిగ్గు, సంసారికి సిగ్గు ఉండాలి.
50. లంజకు బిడ్డ తగలాటము.
51. లంజకు పిల్ల తెగులు, దూదేకులవాడికి దూది తెగులు.
52. లంజకు పెట్టిన పెట్టు, గోడకు పూసిన సున్నం తిరిగి రావు.
53. లంజకు మొగమాటం లేదు, పంజకు ధైర్యం లేదు.
54. లంజకు సిగ్గున్నా, ఇల్లాలుకు సిగ్గులేకపోయినా చెడుతారు.
55. లంజ కొండెక్కి చూస్తే, మిండగాడు మిణుకురుబూచి మాదిరి కనబడ్డాడట.
56. లంజాకొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్లు.
57. లంజ చెడి ఇల్లాలయినట్లు.
58. లంజదాని కొడుకు లంజల కిచ్చును.
59. లంజదాని మాటలు పట్టుకొని ముందలి వాగులో పండితే, వాగొచ్చి వాడు కొట్టుకుపోయాడట.
60. లంజను లంజా అంటే, రచ్చకెక్కుతుంది, ఇల్లాలిని లంజ అంటే ఇంట్లో దూరుతుంది.
61. లంజ పితాళ్ళకు పెట్టి, ఆకాశం చూసిందట.
62. లంజ పుంజాయె, మిందడు లుష్టాయె.
63. లంజ బిడ్డకు తండ్రెవరు?
64. లంజ మంచానికి తలతట్టేమి? (తలదాపేమి) కాళ్ళ తట్టేమి?
65. లంజ ముదిరినా, ముంజ ముదిరినా, బీర ముదిరినా పనికిరావు.
66. లంజ మెత్తనైతే, పోతూ పినతండ్రిని లేవగొట్టి పోయినాడట.
67. లంజల కలువాయి, రంకుల కుల్లూరు మధ్య, తయిదిపాటి రెడ్లొచ్చి తగువులు తీర్చినారట.
68. లంజ లగ్గం (లగ్నం) చెరిస్తే, మాలెత (మాలది) మగ్గం చెరచిందట.
69. లంజ లజ్జుండి (లజ్జ ఉండి) చెడితే, ఆలు లజ్జ లేక చెడుతుంది.
70. లంజ లేకపోతే గుడి రంజిల్లదు, ప్రజల మనసు రంజిల్లదు. (లంజ=దేవదాసి, గుడిచేటి).
71. లంజా ! అంటే లక్ష్మీదేవి అన్నట్లగునా? (లంజ లం = నీటియందు, జ = పుట్టినది - లక్ష్మి అని).
72. లంజ కుచాలింగనాలకంటే లికుచాపాదతాడనం మేలు.
73. లక్క జొచ్చిన నగ - కుక్క జొచ్చిన ఇల్లు.
74. లక్కలేని నగ, బొక్కలేని మాంసం.
75. లక్కవంటి తల్లి, ఱాయివంటి బిడ్డ.
76. లగ్గ పగ్గం పెట్టు చిక్కింది.
77. లగ్గ మంటే పగ్గ మన్నట్లు.
78. లగ్నంలో తుమ్మినట్లు.
79. లచ్చ ఉంటే కోటి లక్షణాలు.
80. లచ్చి గాజులకు సంతకు చీటీ వ్రాసినట్లు.
81. లాడాయి వచ్చినప్పుడా కత్తులు చేసికోవడం?
82. లద్దిలో మాణిక్యం (దొరికినట్లు).
83. లక్షణం చెడితే అవలక్షణం.
84. లక్షణం పలుకరా పెండ్లికొడుకా ! అంటే అయిరేని కుండ పదహారు వక్కలు అన్నట్లు (అయిరేని=అరివేణి).
85. లక్షణాలుగల బావగారికి రాగి మీసాలు, అవలక్షణాలు గల బావగారికి అవీలేవు.
86. లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడుగాడు.
87. లక్షబుద్ధులు చెప్పినా, లంజబుద్ధి మానదు (మారదు).
88. లక్ష్యభక్ష్యాలు భక్షించే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా?
లా
89. లాకు ఏత్వము, దాకు కొమ్ము - అననివాడు (లేదు అనుట).
90. లాడం దొరకగానే గుఱ్ఱం దొరికినట్లా?
91. లాభం గూబలలోకి వచ్చింది.
92. లాభంలేని శెట్టి వరదకు పోడు.
93. లావుమీద వంపు తెలియదు.
94. లావు లేని చేను - లేగ లేని ఆవు.
లి
95. లింగధారికన్న దొంగలు లేరయా.
96. లింగధారులతో సంబంధం గంగలో దూకినట్లే.
97. లింగం కట్టగానే పిడుగు అన్నట్లు.
98. లింగిపెళ్ళీ మంగి చావుకు వచ్చినట్లు.
లె
99. లెక్కలు చూచిననాడు తిక్కలు తిరుగుతాయి.
100. లెక్కలు చూచిననాడు బొక్క పగులును.
No comments:
Post a Comment