Thursday, December 22, 2011

సామెతలు 84


లే


1. లేకలేక ఒక కూతురుపుడితే అదీ బసివి అయినదట.
2. లేకలేక ఒక లోకాయపుడితే, లోకాయ కన్ను లొట్టపోయింది.
3. లేకుండా చూసి, పోకుండా పట్టు.
4. లేచినాడండోయ్ మగధీరుడు అంటే, అందుకుకాదులే అల్పాచమానాని కన్నాడట.
5. లేచిపోతూ, అత్తా! నీకొడుకు ఆకలితో ఉన్నాడు అన్నదట.
6. లేది కడుపున పులి పుట్టునా?
7. లేడికి లేచిందే ప్రయాణం.
8. లేడికి లేచిందే పొద్దు.
9. లేడి దొరికేది కాళ్ళు లేకగాదు, కాలంగాక.
10. లేడిని చూచిన వాళ్ళంతా వేటగాళ్ళే.
11. లేదంటే పోతుందా పేదల మునుక?
12. లేనమ్మకు ఊపిరిపోతుంటే, ఉన్నమ్మ నీట్లు వెళ్ళబోసిందట.
13. లేని దాతకంటే, ఉన్నలోభి నయము.
14. లేనిదానికి పోగా, ఉన్నది ఊడి (ఊడ్చుక) పోయిందట.
15. లేనిపోని పీకులాట, చావడిదాకా గుంజులాట.
16. లేని బావకంటే, గుడ్డి బావే మేలు.
17. లేనివాడు లేక ఏడిస్తే, ఉన్నవాడు తినలేక ఏడ్చాడట.
18. లేనివానికి తెంపు, ఉన్నవానికి మొండి. (పిసినారితనం).
19. లేబరముకదె బిడ్డలు లేని బ్రతుకు.
20. లేవదీయరా తంతాను అన్నాడట.
21. లేవలేని అత్తకు వంగలేని కోడలు.
22. లేవలేని గొడ్డు బోరగలకు (రాబంధులు) అలుసు.
23. లేస్తే మనిషినిగాను మూతబెట్టి పొమ్మన్నాడట.


లొ


24. లొట్టిపిట్ట శూల రోకళ్ళతోగానీ పోదు.
25. లొల్లిలో మల్లిగాని పెండ్లి.


లో


26. లోకము మూయను మూకుడున్నదే.
27. లోకాన్ని (లోకపునోరు) మూయను మూకుడున్నదా?
28. లోకులు కాకులు.
29. లోకులు పలు(ల)గాకులు (పలుగాకి=పోకిరి).
30. లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళు బోదురు.
31. లోకువదానికి నూకల జావ.
32. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.
33. లోన వికారం, బయట శృంగారం.
34. లోపల ఊబి, పైన పూరికమ్మిన పాడునూయి.
35. లోపల కంపు, వెలుపల సొంపు.
36. లోపల లొటలొట, మీద (బయట) మిటమిట.
37. లోభికి ధర్మచింత, వెఱ్ఱివానికి వివేకము దూరము.
38. లోభికి నాలుగందాల నష్టము.
39. లోభికి మూట నష్టి.
40. లోభి గడన సుంకరులకు వర్నసంకరులకు.
41. లోభి బీదకంటే బీడు.
42. లోభి సొమ్ము లోకుల పాలు.
43. లోలోపల లొట్టి, నామొగుడు విన్న కొట్టి.
44. లోవి మూయవచ్చును గానీ లోకమునోరు మూయలేరు (లోవి=అన్నమువండు వెడల్పు మూతిగల మట్టికుండ).




45. వంకరకట్టే కింగలమే మందు.
46. వంకరటింకర కాయలేమిటి? అంటే, చిన్ననాడు అమ్మిన చింతకాయలు అన్నట్లు.
47. వంకరో టింకరో వయసే చక్కన.
48. వంకాయ తమ్ముడు వాకుడు కాయ.
49. వంకాయ దొంగిలించినవాడు టెంకాయకు రాడా?
50. వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ రుచి రాజెరుగును.
51. వంకాయలేనమ్మ డొంకపట్టుక వేళ్ళాడిందట.
52. వంకాయవంటి కూర లేదు, శంకరునివంటి దైవమూ లేడు (లంకాధిపువైరివంటి రాజు లేడు).
53. వంగకు ముదురు నాటు, అరటికి లేత నాటు.
54. వంగతోటకాడ మాత్రం వదినా (బావా) అనవద్దు అన్నట్లు.
55. వంగతోటలో గ్రుడ్డివాని భాగవతం వలె.
56. వంగతోట వానికి కన్నుగ్రుడ్డి, ఆకుతోటవానికి చెముడు.
57. వంగ ముదురు - -వరి లేత.
58. వంగలేనమ్మ టొంక పట్టూకొని ఏడ్చిందట (టొంక=టంకం).
59. వంగనములో పుట్టినది, పొంగలిపెడితే పోతుందా? (వంగనము=వంశము, వంగడము).
60. వంగితే తెలుస్తుందమ్మా! వరిమడి కలుపు, నిలబడినవానికి నీళ్ళు కారుతాయా?
61. వంగినవాని కింద మఱీ వంగినవానికి వట్టలే తగులును.
62. వంగుని వంకాయ, తొంగుని దోసకాయ తిన్నాడు అన్నట్లు.
63. వంచని కాలి ధర్మం నా ఒడిలో ఉన్న దత్తా! కానక నా కాళ్ళు తగిలి నీ కళ్ళు పోయినవి.
64. వంటంతా అయినదికానీ, వడ్లు ఒక (వాటు) పొలుపు ఎండవలె.
65. వంట ఇంటి కుందేలు ఎక్కడికిపోతుంది?
66. వంట ఇంటిలో చిలుకకొయ్య మినహాయింపు.
67. వంట ఇల్లు కుందేలు సొచ్చినట్లు.
68. వంట చేయ కెట్లు వంతక మమరురా?
69. వంట ముగిసిన తరువాత పొయ్యి మండుతుంది.
70. వంటలక్కను వయలుబండిమీద తెచ్చి, తోటకూరకు ఎసరెంత? అంటే, చంకచేతెడు పెట్టమన్నదట.
71. వంటాపె అని తెచ్చుకుంటే ఇంటాపై కూర్చున్నదట.
72. వండ నింటికి అగ్గిబాధ.
73. వండని కూడు, వడకని బట్ట. (చాకలిది).
74. వండమని అక్కకాళ్ళకు మొక్కవలె, వినుమని (తినమని) బావ కాళ్ళకు మొక్కవలె.
75. వండలేనక్కకు వగపులు మెండు, తినలేనన్నకు తిండి మెండు.
76. వండవే పెండ్లి కూతురా! అంటే, మందిని చూస్తూ మంచినీళ్ళు తెస్తానన్నదిట.
77. వండా లేదు, వార్చాలేదు, ముక్కున్న మనసెక్కడిదే అన్నట్లు.
78. వండింది తినెనో, గంజితోనే పోయెనో?
79. వండినంతలోనే కుండకు దొరయగు.
80. వండినంతవరకుండి, వార్చేలోపల పోయినట్లు.
81. వండిన కుండలో ఒక్క మెతుకే పట్టి చూసేది.
82. వండినమ్మ కంటే, దండుకున్నమ్మ మేలు.
83. వండుకున్నమ్మకు ఒకటే కూర, అడుక్కుతినే అమ్మకు ఆరు కూరలు.
84. వండుతూ ఉండగా వాంతి వస్తున్నది అంటే, ఉండి భోజనం చేసి పొమ్మన్నదట.
85. వండేది అడ్డెడు, ఓగెంగా తిను అల్లుడా! అంటే, అన్నంపై ద్వేషమెందుకు? ఉన్నదంతా ఊడ్చిపెట్టత్తా అన్నాడట.
86. వంతుకు మా పక్కవాడు, పాలికి మా బక్కవాడు.
87. వంతుకు గంతేస్తే, ఒరు(రి)బీజం దిగిందట.
88. వంతు పెట్టుకున్నా, వాత వేసుకొనేదాని కిచ్చి పెట్టుకోవాల.
89. వంద మాటలు మాటలాడవచ్చు, వక్కనికి పెట్టేది కష్టం.
90. వంపున్న చోటికే వాగులు పోతాయి.
91. వంశం బొట్లంతమ్మా! కడివెడు కల్లెట్లమ్మా! వడబోసి అక్కడ పెట్టమ్మా1 వడవకున్న ఒట్టుబెట్టమ్మ! అందట.
92. వంశమెఱిగి వనితను, వన్నె నెఱిగి పశువును కొనవలె.
93. వక్క కొఱికి ఒక్కప్రొద్దు చెడుపుకొన్నట్లు.
94. వక్క పేడిత్తునా, వనము దాటింతునా? చెక్క పేడితున్నా చేను దాటింతునా/
95. వక్కలింత తప్పిన వగిరింత, వగిరింత తప్పిన వగిరింత. (వక్కలింత=వేవిళ్ళు).
96. వక్రమా! వక్రమా! ఎందుకు పుట్టినావంటే, సక్రమైన వాళ్ళను వెక్కిరించను అన్నదట.
97. వగచనట్టే ఉండాల, వాడి ఆలి తాడు తెగినట్లే ఉండాల.
98. వగిచినట్టూ ఉండవలె, వాత పెట్టినట్టూ ఉండవలె.
99. వగలమారి వంకాయ సెగలేక ఉడికినదట.
100. వగలాడికి ముసలాతడు మగడైతే దాని వంత యింతింతా?

No comments: