Friday, May 23, 2008

సామెతలు 1

1. అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది.
2. అంగట్లో అరువు, తలమీద బరువు.
3. అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం (అష్ట దరిద్రం).
4. అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది.
5. అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం.
6. అంగడిలో అమ్మి గొంగడి (కప్పు) కొన్నట్టు.
7. అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను.
8. అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు.
9. అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు.
10. అంచు డాబే గాని, పంచె డాబులేదు.
11. అంటే ఆరడి అవుతుంది, అనకపోతే అలుసవుతుంది.
12. అండలుంటె కొండలు దాటవచ్చు.
13. అంతంత కోడికి అర్థసేరు మసాలా.
14. అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?
15. అంతకు ఇంతయింది, ఇంతకెంతవుతుందో, ఇంతకింతే!
16. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
17. అంతనాడులేదు, ఇంతనాడూలేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.
18. అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.
19. అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
20. అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
21. అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
22. అంతా తడిసిన తరువాత చలేమిటి.
23. అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
24. అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
25. అంతా బావలే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
26. అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
27. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
28. అందని ద్రాక్షపళ్ళు పుల్లన.

29. అందని ఫూలు దేవికర్పణ.
30. అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.
31. అందఱికన్న తాడిచెట్టు పెద్ద.
32. అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.
33. అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.
34. అందరికి అన్నం పెట్టేవడు రైతు.
35. అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.
36. అందఱిని మెప్పించటం అలవిగానిపని.
37. అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?
38. అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?
39. అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.
40. అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
41. అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
42. అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
43. అంధునికి అద్దం చూపినట్లు.
44. అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
45. అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
46. అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
47. అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
48. "అ ఆ " లు రావు అగ్రతాంబూలం కావాల
49. అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
50. అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
51. అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
52. అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
53. అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
54. అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
55. అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
56. అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.

57. అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
58. అగ్గువ అయితే అందరూ కొంటారు.
59. అగ్నికి వాయువు తోడైనట్టు.
60. అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
61. అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
62. అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
63. అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
64. అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
65. అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
66. అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
67. అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
68. అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.
69. అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).
70. అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.
71. అటునుంచి నరుక్కురమ్మన్నారు.
72. అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.
73. అడక్కుండ చెప్పులిచాడు, అడిగితే గుఱ్రమిస్తాడని అనుకొన్నట్లు.
74. అడగనిదే అమ్మయినా పెట్టదు.
75. అడవిపంది చేనుమేసిపోతే, ఊరపంది చెవులు కోసినట్లు.
76. అడవిని గాచిన వెన్నెల, ముదిమిని చేసున పెండ్లి.
77. అడిగితే చిరాకు, అడుగకపోతే పరాకు.
78. అడిగినట్లు ఇస్తే, కడిగినట్టు పోతుంది. (బేరంలో).
79. అడిగేవాడికి చెప్పేవాడులోకువ.
80. అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
81. అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
82. అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.
83. అతుకుల బొంత, గతుకుల బాట.
84. అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.
85. అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?
86. అత్తకు అల్లుడాశ, బాపనికి పప్పాశ.
87. అత్తకు మొగుడల్లుడు.
88. అత్తకు లేక అటికలు నాకుతుంటే, అల్లుడు వచ్చి దీపావళిపండుగ అన్నడుట.
89. అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?
90. అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
91. అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.
92. అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.
93. అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.
94. అత్తని కొట్టి అటకెక్కింది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది.
95. అత్తని కొడితే కోడలేడ్చినట్లు.
96. అత్త పెట్టే ఆరళ్ళు కనపడతాయి కాని, కోడలు చేసే కొంటెపనులు కనపడవు.
97. అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు.
98. అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.
99. అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.
100. అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.

5 comments:

Anonymous said...

మంచి కలెక్షన్. మీకు తెలిసిన మరిన్ని సామెతలను ఇలాగే జత చెయ్యండి. ఇంక మీ దాడి కొనసాగించండి. వారానికొక్కటైనా పోస్ట్ చేస్తూండండి. అభినందన.

Naveen Garla said...

కొత్త సామెతలన్నీ దయచేసి తెలుగు వికీపిడియాలో చేర్చండి:
http://te.wikipedia.org/wiki/సామెతలు

Anonymous said...

బ్లాగు లోకానికి స్వాగతం

-- విహారి

పద్మనాభం దూర్వాసుల said...

మీ కృషి హర్షించ తగ్గదే. మరోలా భావించకండి. కొన్ని అచ్చు తప్పులు దొర్లాయి. వాటిని సరిచెయ్యండి.
ఉదాహరణకు:
అబద్ధాల - అని ఉండాలి(సామెతలు 3-1)

త్రవ్విస్తే (3-4)

సామెత 3-4 "అబ్బ తవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు" అని ఉంటే బాగుంటుందేమో చూడండి. సామెతలలో వ్యావహారిక భాష బాగుంటుందని నా అభిప్రాయం.
ఇవి కొన్ని సవరణలు, చూచనలు మాత్రమే. మీరు అక్షరాలను "జూమ్" చేసి చూస్తే అచ్చుతప్పులు మీకే తెలుస్తాయి. కొత్తగా టైప్ చేసినపుడు ఇవి మామూలే.
దూర్వాసుల పద్మనాభం

Bolloju Baba said...

మంచి సేకరణ. బాగున్నాయి.

బొల్లోజు బాబా