Monday, November 28, 2011

సామెతలు 81


1. రత్నాన్ని రువ్వి గాజును కోరినట్లు.
2. రత్నాలన్ని ఒక చోటికి, రాళ్ళన్నీ ఒక చోటికి.
3. రత్నాలు తినే పక్షికి రత్నాలు, రాళ్ళు తినే పక్షికి రాళ్ళు.
4. రత్నాలున్న గనిలోనే రాళ్ళుండేది.
5. రమాపతే, సీతాపతే, పొద్దున లేస్తే పొట్టేగతి.
6. రమ్మన్నారు తిమ్మన్న బంతికి - అన్నట్లు.
7. రవిక, పగలు బిడ్డ కడ్డము, రాత్రి మగని కడ్డము.
8. రవికలోనే చీర మిగిలించాలంటే ఎలాగు?
9. రవి గాననిచో కవిగాంచనేర్చు నెయ్యెడన్.
10. రవ్వ రవ్వతో తెగుతుందికానీ, రాతితో తెగుతుందా?
11. రసం ముదిరితే రాగం, పాకం ముదిరితే పాట.
12. రహస్యమేమిటంటే, (విశేషమేమిటంటే) వడ్లగింజలోది బియ్యపుగింజ అన్నట్లు.  
13. రక్షలు పోతే మచ్చలు పోతాయా? (రక్షలు=రక్ష కోసం వాతలు).


రా


14. రా అమ్మేగానీ పో అమ్మ లేదు.
15. రాకుండా చూచి పోకుండా కొట్టినట్లు.
16. రాకు, పోకు బంగారు చిలక.
17. రాగం లేని భోగం, త్యాగం లేని ఈవి.
18. రాగం తియ్యనివాడు, రోగం రానివాడు లేడు.
19. రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు.
20. రాగిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారంటే, చుట్టుచుట్టుకు పొట్ట చూచుకొన్నదట.
21. రాగిపైసా చల్లగుంటే, రాచబిడ్డగూడా దిగివస్తుంది.
22. రాగిపోగులు తగిలించుకున్నావేమిరా? అంటే, నీకు అవైనా లేవుకదా అన్నాడట.
23. రాగిపైరులచెంత రమ్యమౌ వరిమొలక రాజిల్ల నేర్చునా?
24. రాగి రాగోరును.
25. రాగులరాయి తిరుగుతూ ఉంటే రాజ్యమంతా చుట్టాలే.
26. రాఘవా! స్వస్తి. రావణా స్వస్తి. (అందరికి మంచిగా ఉండుట).
27. రాచతనానికి జందెపుపోచా గుర్తు?
28. రాచపగ - త్రాచు (పాము) పగ.
29. రాచపీనుగు తోడులేకుండా పోదు.
30. రాచబిడ్డ స్మరాలయము కాగానే పూజకు దాసాని పువ్వగునా?
31. రాచవారి పసులకు బందిలేదు.
32. రాచవారి భోగం రైతుల త్యాగం.
33. రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు, ఐశ్వర్యం ఆనందమును కొనిపెట్టలేదు.
34. రాజరాజులకు రాజదండం, కాపుకు కరుకోల (కరుకోల=కఱ్ఱు).
35. రాజు ఎంతో, ప్రజలూ అంతే.
36. రాజులు ఎవరైనా రాగులు విసరేది తప్పదు.
37. రాజుకంటే మొండివాడు బలవంతుడు.
38. రాజు కత్తికి రెండువైపులా పదునే (వాదరే).
39. రాజుకన్నా చిన్న, మంత్రి కన్నా పెద్ద.
40. రాజుకు కంటను, పాముకు పంటను విషం.
41. రాజు కూతురైనా ఒకని ఆలే.
42. రాజుగారి కొడుకైనా కావాలి, సానిదాని తమ్ముడైనా కావాలి.
43. రాజుగారి గుఱ్ఱమైతే మాత్రం తొక్కితే కాలు నొవ్వదా?
44. రాజుగారి పెద్దభార్య పతివ్రత అన్నట్లు.
45. రాజుగారి పెళ్ళాం మేడ ఎక్కితే, కుమ్మరివాడి పెళ్ళాం ఆవ మెక్కిందట.
46. రాజుచేసిన కార్యాలకు, రాముడు జేసిన కార్యాలకు ఎన్నికలేదు.
47. రాజుతలిస్తే గాజుకంబాల కేమి కొదువ?
48. రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు కొరవా?
49. రాజు దృష్టికి రాయి పగులును.
50. రాజు నీతి తప్పితే, నేల సారం తప్పుతుంది.
51. రాజుని చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్ట బుద్దయింది.
52. రాజపాపం పురోహితుని కొట్టుకపోవును.
53. రాజు పెద్దకూతురిని పెండ్లి చేసుకోను నాకేమి అభ్యంతరం లేదన్నట్లు.
54. రాజు పోతులాగే ఉన్నాడు, రాజుపెండ్లం రంభలాగే ఉంది.
55. రాజు మెచ్చింది మాట, మొగుడు మెచ్చింది రంభ.
56. రాజు రాకడ లేదు! నూకుడు లేదు (నూకుడు=కొట్టుట, చిమ్ముట).
57. రాజులకు పిల్లనిస్తే రాళ్ళ కిచ్చినట్లే.
58. రాజుల చనవు ఎన్నాళ్ళు?
59. రాజుల సొమ్ము రాళ్ళ పాలు.
60. రాజుల సొమ్ము లంజల పాలు.
61. రాజులు పోతే రాజ్యాలు పోతవా?
62. రాజు లేని ఊళ్ళు, పూజలేని గుళ్ళు.
63. రాజులేని రాజ్యం, కాపులేని గ్రామం.
64. రాజు వలచిన రంభ, రాజు విడిచిన తుంబ.
65. రాజ్యము వీరభోజ్యం.
66. రాజ్యాలు ఉడిగినా లక్షణాలు ఉడగలేదు.
67. రాజ్యాలు పోయినా, రాచరికాలు (రాజసాలు) పోలేదు.
68. రాట్నం వచ్చింది, బండి అడ్డం తీయరా అన్నాడట.
69. రాట్నానికి రెండు చెవులు, నాకూ రెండు చెవులు.
70. రాణివాసం వచ్చి మూలవాసం పీకిందట (రాణివాసం=రాజభోగం, మూలవాసం= ప్రధానమైన ఇంటివాసం).
71. రాతకు (వ్రాతకు) మించిన లొతు లేదు (రాత=నొసటివ్రాత).
72. రాత బొడిచినా చావు లేదు.
73. రాతికట్ట, పంత చెరువుకు గాక గండి గుంట కేల?
74. రాతి కుండకు ఇనుప తెడ్డు.
75. రాతి పశువును పూజిస్తారు, చేతిపశువును బాదుతారు.
76. రాతిబొమ్మకు చక్కిలిగింతలు పెట్టినట్లు.
77. రాతిలో కప్ప, రాతిలోనే బ్రతికినట్లు.
78. రాత్రి అంతా రభసైతే, రక్తి ఎప్పుడు?
79. రాత్రికి వెన్నెల, పైరుకు వెన్నులు పస.
80. రాత్రి పడ్డ గొతిలో పగలు పడతారా?
81. రాదన్న పని రాజుపని, వస్తుందన్నపని తొత్తు పని.
82. రాని అప్పు (సొమ్ము) రాతితో సమానమన్నాడట.
83. రానిపాట పాడ వేడుక, బోడితల అంట వేడుక.
84. రానివాడి మీద ఱాయి.
85. రాని వానినిఉ పిలువ వేడుక.
86. రానురాను గుఱ్ఱం గాడి దయిందట.
87. రానూవచ్చె, పోనూపోయె, రాగులువిసరి సంకటి చేయమన్నాడట.
88. రాబందుకు, రాజుకు తేడాలేదు.
89. రామక్క దేమిపోయె? రామన్న దేమిపోయె? రాసిలోనిదే దోసెడుపోయె.
90. రామనామధారి రాక్షసుండు.
91. రామాండ కతలెల్ల మే మెఱుంగని పనే? కాటమరాజుకు కర్ణుడోడె - అన్నట్లు.
92. రామాయపట్నం మధ్యస్థం. (న్యాయం చెప్పమంటే, చెరిసగం చేసుకోమన్నట్లు).
93. రామాయణం అంటే ఏమో అనుకున్నానుగానీ, మాశి బరువుంది అన్నాడట.
94. రామాయణం అంటే సామాన్యంగాదు, గాడిద మోతంత ఉందే, అన్నాడట.
95. రామాయణం ఱంకు, భారతం బొంకు.
96. రామాయణంలో పిడకల (పిటకల) వేట్లాట (కాట్లాట, కొట్లాట).
97. రామాయణం అంతా విని, రాముడికి సీత ఏంకావాలని అడిగాడట.
98. రాముడినాడు లేదు, భరతుడినాడూ లేదు, శత్రుఘ్నునినాడు చెవుల వాదులు అన్నట్లు.
99. రాముడులేని రాజ్యం లాగా.
100. రాముని పాదాలు తగిలితే, రాళ్ళు రమణులవుతవి.

No comments: