Monday, February 28, 2011

సామెతలు 40

1. తనవాసి తప్పితే తన వన్నె తరుగుతుంది.
2. తనసొమ్ము అయినా దాపుగా తినవలె.
3. తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం.
4. తన సొమ్ము కాసుబెట్టడు కానీ పరులసొమ్ము హరింప (కాజేయ) బ్రహ్మకాయ.
5. తనసొమ్ము తను దిని, తన బట్ట తను కట్టి, సావిట్లో వానితో చావు దెబ్బలు తిందిట.
6. తన సొమ్ము సోమవారం, మందిసొమ్ము మంగళవారం.
7. తనుగాక తన కొక పిల్లట.
8. తనువు తాను కాదనువానికి తపసుచేయనేల?
9. తనువులు నిత్యం కావు మా వారిని ఓలిపైకం ఖర్చు పెట్టవద్దని చెప్పమన్నట్లు.
10. తనువు వెళ్ళినా దినము వెళ్ళదు.
11. తన్ని తల్లే గుంజుకుపోతే, చెప్పున కొట్టి చిప్ప తెచ్చుకోవాలి.
12. తన్నితే తల పగులుతుంది, కొడితే కొప్పెర పగలాలి అంటాడు.
13. తన్నితే పోయి బూరెల గంపలో పడీనట్లు.
14. తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.
15. తన్ను తప్పించి, ఆకాశమంత పిడుగు పడమన్నట్లు.
16. తన్నుదా పొగడుకుంటే, తన్నుకొని చచ్చినట్లుంటుంది.
17. తన్నే కాలికి రోకలి అడ్డమైనట్లు.
18. తపము పండినమీద జడలు తాల్చడమెందుకు?
19. తప్పతాగి కులము మఱచినట్లు.
20. తప్పించబోయి తగిలించుకొన్నట్లు.
21. తప్పు చేసినవానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు.
22. తప్పుడు దండుగకు తలో యింత.
23. తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు.
24. తప్పులెన్నువారు తండోపతండాలు.
25. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.
26. తప్పులేనివానిని ఉప్పులో వెయ్యమన్నట్లు.
27. తప్పులేనివారు ధరణిలో లేరు.
28. తప్పూ ఒప్పూ దైవమెఱుగును, పప్పూ కూడూ బాపడెరుగును.
29. తప్పెటకొట్టిన వాడు దాసరి, శంఖమూదినవాడు జంగము.
30. తప్పెట కొట్టినా పెండ్లే, చప్పెటకొట్టినా పెండ్లే.
31. తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులగుట.
32. తమలంలో సున్నమంతటివాడు, తక్కువైనా ఎక్కువైనా బెడదే.
33. తమ వంశగౌరవాన్ని గుర్తుంచుకొననివి గాడిదలు మాత్రమే.
34. తమంలేకున్న తల్లినిపిల్లలే పరిహాస మాడుకుంటారు.
35. తమాం లేదంటే, తవ్వెడైనా ఇవ్వమన్నట్లు.
36. తము(మ)లపాకుతో తా నిట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లంటి.
37. తము(మ)లము వేయని నోరు, కమలము లేని కోనేరు.
38. తమ్ముడు తనవాడైనా, ధర్మం సరిగా చెప్పవలె.
39. తరవాణి తల్లి (తరవాణి=పుల్లనీళ్ళు, కలికుండ).
40. తరి ఉంటే, వరి అంటారు (తరి=మాగాణి, మబ్బు).
41. తరి పట్టిన కఱ్ఱ, చెరపట్తిన కుఱ్ఱ.
42. తరి మెడకు ఉరి.
43. తఱిమి చల్లితే తవ్వెడే.
44. తలంత బలగమే కానీ తలలో పెట్టువారు లేరు.
45. తల ఊపినందుకు తంబూరా బుఱ్ఱ ఇచ్చిపొమ్మన్నట్లు.
46. తలకాయ లోపలికి దూర్చిన తాబేలు వలె.
47. తలకింది కొఱవి వలె.
48. తలకు చెప్పులడిగినట్లు.
49. తలకు దాకకున్న, తనకేమి తెలియదు.
50. తలకు దారిలేదు, బుడ్డకు అటకలి.
51. తలకు మించిన శిక్ష, గోచికి మించిన దారిద్ర్యం లేవు.
52. తలకు వచ్చిన భాదను తలపాగా మోసినట్లు.
53. తలకోసి ఇచ్చినా పుచ్చకాయ అనేవాడు.
54. తలకోసి ముందర పెట్టినా గారడివిద్యే అన్నట్లు.
55. తలకోసుకుపోగా తమ్మపోగుల కేడ్చినట్లు.
56. తలగడ కింద త్రాచుపాము వలె.
57. తలగడ తిరుగవేస్తే తలనొప్పి తీరునా?
58. తలగొట్టేవానికైనా మూడు మనవు లుంటాయి.
59. తల గొరిగించుకున్న తరువాత తిధి నక్షత్రం చూచినట్లు.
60. తలగోసి మొల వేసినట్లు.
61. తలచినప్పుడే తాత పెళ్ళి.
62. తల చుట్టం, తోక పగ.
63. తల తడవి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు.
64. తల తడిపిన మట్టుకు గొరిగి తీరవలె.
65. తల తిరిగి ముద్ద నోటికి వచ్చినట్లు.
66. తల దన్నేవాడు పోతే, తాడి దన్నేవాడు వస్తాడు.
67. తలదాచుకొన చోటిచ్చిన వానికే తావు లేకుండా చేసినట్లు.
68. తల నరకడంలో, మొల నరకడంలో తారతమ్యమేమిటి?
69. తల నరికె వానికి తలవారిచ్చినట్లు (తలవారు=పెద్ద కత్తి, తల్వార్-హింది).
70. తలనొప్పి తగిలిందని తలగడ మార్చినట్లు.
71. తల పడేచోటికి కాళ్ళు ఈడ్చుకొనిపోవును.
72. తలపాగా చుట్టలేక తలవంకర అన్నట్లు.
73. తలప్రాణం తోకకు వచ్చినట్లు.
74. తలంబ్రాలకు తద్దినాలకి ఒకే మంత్రమా.
75. తలంబ్రాలనాటి త్రాడు తానుపోయిన నాడే పోతుంది.
76. తల మాసినవాడెవడంటే ఆలి(లు)చచ్చినవాడు అన్నట్లు.
77. తలరాత(వ్రాత) తప్పించుకోరానిది.
78. తలరాతేగాని, తనరాత ఎక్కదు.
79. తలలు బోడులైన తలపులు బోడులా?
80. తలపులు బోడులైన దక్కునా తత్వంబు.
81. తలలో నాలుక, పూసలలో దారము వలె
82. తలవంచుకుంటే, ఏడు గోడల చాటు.
83. తలవరిదగు పొందు తలతోడ తీరురా.
84. తల విడిచి మోకాలికి బాసికం కట్టినట్లు.
85. తల వెంట్రుకలంత బలగమున్నా తల కొఱవి పెట్టె దిక్కులేదు.
86. తల వెంట్రుకలున్నమ్మ ఏకొప్పు అయినా పెట్టవచ్చు.
87. తలాతోకా లేని కత, ముక్కు మొగము లేని పిల్ల.
88. తలారి దుప్పటి రెడ్డి బహుమానం చేసినట్లు.
89. తలారి పగ తలతో తీరును.
90. తలారి రుమాలు రెడ్డి చదివించినట్లు.
91. తలుగు తెంచుకున్న బఱ్ఱె, తాడు తెంచుకున్న గుఱ్ఱం.
92. తలుగు దొఱకిందని ఎనుమును కొన్నట్లు.
93. తలుగు పెట్టి తంతూ ఉంటే, కొలువు పెట్టి కొలిచినట్లు.
94. తలుచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎలాగు?
95. తలుపు పెట్టి చెబుతుంటే, కొలుపు పెట్టి అడుగుతాడు (కొలుపు=పశుబలి లేని జాతర, గలాబా).
96. తలుపులు మింగేవానికి అప్పడాలు లొటలొట.
97. తలుపొకరింటికి తీసిబెట్టి తా కుక్కలు దోలినట్లు.
98. తలుపేల చాపగుడిసెకు.
99. తలుము-తక్కువవాడు పనికిముందు వంగి, పనికాగానే నిగుడుకొంటాడు (తలుము=ఏతము).
100. తల్లి అయినా ఏడవందే పాలివ్వదు.

Wednesday, February 16, 2011

సామెతలు 39

1. తంతే బూర్ల (గారెల) గంపలో పడ్డట్లు.
2. తంబళి అనుమానం తలతిక్కతో సరి.
3. తంబళి తన లొటలొటె గానీ, ఎదుటి లొటలొట ఎరుగడు.
4. తంబళ్ళ అక్కయ్య మొదుమూడి వెళ్ళను వెళ్ళాడు, రానూ వచ్చాడు.
5. తక్కువజాతికి (వానికి) ఎక్కువకూడైతే తిక్క తెగులు.
6. తక్కువనోములు నోచి, ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?
7. తక్కువవాడికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి పొంగెక్కువ.
8. తక్కువ వానికి నిక్కులు లావు.
9. తగపండిన పండు తనంత తానే పడుతుంది.
10. తగవు చెప్పు ధర్మరాజా! అంటే, దూడా, బఱ్ఱె నాదే అన్నాడట.
11. తగవు ఎలావస్తుంది జంగమదేవరా అంటే, బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడట.
12. తగవున ఓడినా,ముదిమిది చచ్చినా బంది లేదు.
13. తగినట్లు కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ.
14. తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడం కష్టం.
15. తగిలిన కాలికే తగులును, నొగిలిన కొంపే నొగులును.
16. తగు దాసరికీ, మెడపూసలకీ, అమ్మకన్న కాన్పుకు, అయ్య ఇచ్చిన మానవుకూ సరి.
17. తగునే కఱకుట్లును జంక పొత్తమున్.
18. తగులుకున్న మొగుడు, తాటిచెట్టు నీడ నిలకడలేనివి.
19. తట్టాలో కాపురం బుట్టలోకి వచ్చె, బుట్టలో కాపురం బూడిదలో కలిసె.
20. తట్టుకు తగాడినట్లు (తట్టుకు=నడుస్తున్నప్పుడు కాలికి తగిలే చిన్న దెబ్బ, తగాడు= తగవు చెప్పు, న్యాయం తీర్పు చేయు).
21. తట్టెడు గుల్లల కొక దుడ్డుపెట్టు.
22. తడిక కుక్కకు అడ్డం కానీ మనిషికి అడ్డమా?
23. తడ(డి)క కొంపలో దీపాలు వెలుగవా?
24. తడ(డి)క గట్టు గోడను తన్నరాదు.
25. తడిక తీసినవాడిదే తప్పు.
26. తడవకుండానే తెంచే అచ్చన్న కంటే తడిపితెంచే బుచ్చన్న కొంతమేలు.
27. తడిక దాసరివలే. (తడిక=చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం).
28. తడిక దొబ్బింది ఎవరంటే ఆలులేనివాడు అన్నట్లు.
29. తడికలేని ఇంట్లో కుక్క దూరినట్లు.
30. తడి గుడ్డలతో గొంతు కోసినట్లు.
31. తడిగుడ్డలో పేలాలు వేయించినట్లు.
32. తడిసిగానీ గుడిసె కట్టడు, (కప్పుడు) తాగి(కి)గానీ మొగ్గడు.
33. తడిసిగానీ గుడిసె వేయడు, తగిలికానీ ఎత్తు చేయడు.
34. తడిసిల తక్కెడ, ఎండిన ధడా.
35. తడిసిన (మంచపు) కుక్కి బిగిసినట్లు.
36. తడిసి ముప్పందుము మోసినట్లు.
37. తడిసి ముప్పందుము మోసేకంటే, తడవక పందుం మోసేది మేలు.
38. తణుకుపోయి మాచారం వెళ్ళినట్లు.(చుట్టు దారిన పోవుటకు).
39. తత్సమయానికి తడి ఇసుకే సరి- అని పలుదోమినట్లు.
40. తద్దినం కొని తెచ్చుకొన్నట్లు.
41. తద్దినం నాటి జందెం వలె.
42. తద్దినం పెట్టెవాని తమ్ముని వలె.
43. తద్దినానికి తక్కువ, మాసికానికి ఎక్కువ.
44. తద్దినానికి భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట.
45. తనాన్నం తాను తింటూ, తనగుడ్డ తాను కట్టుతూ, ఊరికి భయపడవలెనా?
46. తన కంట్లో దూలం పెట్టుకొని, పరుల కంట్లో నలుసులెంచినట్లు.
47. తనకంపు తన కింపు, ఒకరికంపు ఒకరింపు.
48. తన కంపు తనకింపు, పెఱకంపు తను జంపు.
49. తన కలిమి ఇంద్రభోగం, తనలేమి స్వర్గలోకదారిద్ర్యం, తన చావు జలప్రళయం- అనుకొన్నట్లు.
50. తనకాళ్ళకు తానే మొక్కుకొన్నట్లు.
51. తనకు అని తవ్వెడూ ఉంటే, ఆకటివేళకు భుజించవచ్చు.
52. తనకుగానిది గూదలంజ(బోడిముండ).
53. తనకుగాని రాజ్యం పండితేనేమీ? మండితే (ఎండితే) నేమి?
54. తనకుగాని ఆలు దానవురాలురా.
55. తనకుచెప్ప తడికెల చాటు, ఒకరికిచెప్ప ఒప్పులకుప్ప.
56. తనకు తోచకున్న మొకాటుతోనైనా ఆలోచించమన్నారు.
57. తనకు పాసిన వెంట్రుకలు ఏరేవులో పోతేనేమీ?
58. తనకు బుట్టినిల్లు తనరు కైలాసంబు.
59. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం.
60. తనకు ముక్తిలేదు తలపులు మెండైన.
61. తనకు రొట్టె, ఇతరులకు ముక్క.
62. తనకులేక తంటాలు పడుతుంటే, తొంటికాళ్ళ పిల్లి వెంటపడినట్లు.
63. తనకు లేదని ఏడ్చి ఒక కన్నుపోతే, ఎదుటివారికున్నదని ఏడ్చి ఇంకొక కన్ను పోయిందట.
64. తన కొంగున కట్టిన రూక, తన కడుపున పుట్టిన బిడ్డ.
65. తనకోపమె తన శత్రువు.
66. తన గుణము మంచిదైతే, సానివాడలో కూడా కాపురం చెయ్యవచ్చును.
67. త గుద్దకింద నలుపు గురిగింజ కేమితెలుసు?
68. తనగుద్ద కాకుంటే కాశీదాకా దేకమన్నారు.
69. తన గుద్ద గాయం కాకుంటే, తాటియీనెలకు ఎదురు దేకమన్నారు.
70. తన చల్ల పుల్లనిదని తానే చెప్పుకుంటాడా?
71. తన చావు జలప్రళయం.
72. తన చెయ్యి కాలుతుందని, సవతిబిడ్ద చేతితో కలియబెట్టిందట.
73. తన తనయ ప్రసవ వేదనకోర్వలేకుంటే, తన అల్లునిపై అహంకారపడనేల?
74. తనతప్పు తప్పుకాదు, తనబిడ్ద దుడుకుకాదు.
75. తన తలుపుతీసి పొరుగింటికి పెట్టి రాత్రంతా కుక్కలను తోలుతూ కూర్చున్నట్లు.
76. తనదని తవ్వెడు తవుడూన్నా ఆకటివేళకు తినవచ్చు.
77. తనదాకా వస్తేకానీ, తలనొప్పి బాధ తెలియదు.
78. తనదూడ పొదుగుకుమ్మి పాలుతాగితే ఊరుకుంటుందికానీ, పరాయిదూడ పాలుతాగితే ఊరకుంటుందా?
79. తనదాకా వస్తే తగవే లేదు.
80. తనది తాటాకు, ఇవతలవాళ్ళది ఈతాకు.
81. తన దీపమని ముద్దుపెట్టుకుంటే, మూతిమీసాలన్ని కాలినాయట.
82. తనదు కాలిగోయ తనతమ్ముడేడ్చునా?
83. తనదు మేలుకీడు తనతోడనుండురా.
84. తననీడ తప్పితే, తరుగునొక వన్నె.
85. తననీడ తానే తొక్కుకున్నట్లు.
86. తనను కట్ట త్రాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.
87. తననోటికి తవుడు లేదు, లంజనోటికి పంచదారట.
88. తనపిల్ల గంజికేడిస్తే, లంజపిల్ల దాని రేక కేడ్చిందట (రేక=తాటిఆకుతో కట్టిన పెద్దదొప్ప).
89. తనపుట్టి పిచ్చగా ఉంటే, పొరుగుపందుంతో అపరాలు కొలిచినాడట (పిచ్చ=తక్కువ కొలత కలిగిన కొలపాత్ర, అపరాలు=కాయధాన్యాలు).
90. తన పెరటిచెట్టు మందుకు పనికిరానట్లు.
91. తన బలిమికన్నా స్థానబలిమి మిన్న.
92. తన బుద్ధి మంచిదైతే, లంజగేరిలో ఇల్లు కడితేనేమి? (లంజగేరు=నాగవాసం, బోగమువాడ).
93. తనభార్య విరహవేదన జారుడెరుగునా?
94. తనలో తప్పులేకపోతే, గురువుతో గుద్దులాడవచ్చును.
95. తనముడ్డి కాకపోతే గంగదాకా దేకమన్నట్లు.
96. తనముడ్డి(కి) కాకపోతే తాటిపట్టుకు ఎదురుడెక మన్నట్లు.
97. తనయుని పుట్టుక తల్లి ఎఱుగును.
98. తనవృఇ కెంతకలిగిన తనభాగ్యమే తనది.
99. తనవారిని ఎఱుగని మొఱ్ఱి తెడ్డున్నదా?
100. తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు (గట్టుకు) తీతురు.

Sunday, February 13, 2011

సామెతలు 38



1. జనుములో పాము పోతే పాతిక నష్టం.
2. జన్మానికంతా శివరాత్రి అన్నట్లు.
3. జన్నెరోగికి బఱ్ఱెజున్ను పెట్టినట్లు, పిల్లి నెత్తిన వెన్న పెట్టినట్లు.
4. జపం వదిలి లొట్టల్లో పడినట్లు.
5. జబ్బబలిమి మీద బలాత్కార గానవినోదమన్నట్లు.
6. జమ్మి ఆకుతో విస్తర కుట్టినట్లు.
7. జనముండేవరకూ భయము లేదు.
8. జయాపజయంబు లెవరి సొమ్ము?
9. జరిగితే జల్లెడతో నీళ్ళు మోస్తారు.
10. జరిగేమటుకు జయభేరి, జరక్కపోతే రణభేరి.
11. జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు.
12. జరుగుబాటు తక్కువ, అదరి(రు)పాటు ఎక్కువ.
13. జలుబు మందుతింటే వారం దినాలుంటుంది, తినకపోతే ఏడుదినాలుంటుంది.
14. జలుబు విచారణ లేని జబ్బు.
15. జవ్వాది పూసుకొని చంక లెత్తినట్లు.
16. జ్వర జిహ్వకు పంచదార లేదు.


జా


17. జాణకు మూడుతావు లంటును.
18. జాణలకు పురాణాగమశాస్త్రవేదజప ప్రసంగ త్రాణకల్గి ప్రయోజనమేమి?
19. జాతికొద్దీ బుద్ధి, కులంకొద్దీ ఆచారం.
20. జాతినాగుల చంపుతూ, ప్రతిమనాగులకు పాలుపోసినట్లు. 
21. జాబు వ్రాసిపెట్టమంటే, కాళ్ళు నొప్పులంటే, వాటితో పనేమంటే, నేను రాసింది నేనే చదవాలన్నాడట.
22. జామాతా దశమగ్రహం.
23. జారతోడి పొందు చావునకే యగు.
24. జారితే పడమన్నారు, జరిగితే (సాగితే) పడమన్నారు.


జి


25. జింక కన్నీరు వేటగానికి ముద్దా?
26. జింకకు కొమ్ములు బరువా?
27. జిలిబిలి పలుకుల వెలది నకారగుళ్ళ పాలైనట్లు (నకారగుళ్ళు=నియోగులు).
28. జిల్లేడు పూలకు తుమ్మెద లాశించినట్లు.
29. జిల్లేళ్ళకు మల్లెలు పూయునా?
30. జివ తక్కువ, జీత మెక్కువ.
31. జిహ్వ కొక రుచి, పుఱ్ఱె కొక బుద్ధి.
32. జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా.


జీ


33. జీతంబెత్తం లేకుండా తోడేలు గొఱ్ఱెలను కాస్తానన్నదిట.
34. జీతంలేని నౌకరు, కోపంలేని దొర.
35. జీతగాడికి, నేతగాడికి చావులేదు.
36. జీతగాడు అతగాడైనట్లు.
37. జీలకఱ్ఱా సింగినాదం.
38. జీలుగు (జీలగ) పెఱిగిన మాలెకు కంబము కాదు.
39. జీలగ బెండ్లు చెవుల పెంచుతాయిగానీ కుండలాలిస్తాయా?
40. జీవరత్నాన్ని ఇత్తడిలో పొదిగితే రత్నానికేమి లోటు?
41. జీవితమొక వ్యాధి, నిద్రావస్థ ఉపశమనము, మరణమే ఆరోగ్యము.


జు


42. జుట్టుంటే ఎన్ని జడలైనా వెయ్యవచ్చు.
43. జుట్టుకాలి ఏదుస్తుంటే, చుట్ట నిప్పడిగినట్లు.
44. జుట్టు ఉన్న అమ్మ ఏకొప్పయినా పెట్టవచ్చు.
45. జున్ను రుచి వెన్నకబ్బునా?


జె


46. జెముడుకు కాయలూ లేవు నిలువ నీడాలేదు.
47. జెముడు కంచెకు శ్రేష్టం, రేగడ చేనికి శ్రేష్టం.


జే


48. జేనెడు ఇంట్లో మూరెడు కఱ్ఱ.
49. జేనెడు దొరకు మూరెడు బంటు.
50. జేనెడు పిట్టకు మూరెడు తోక.
51. జ్యేష్ట చెడకురియును, మూల మురుగ కురియును.


జై


52. జైనవాని చేతి పేనువలె. (చంపడనుట).


జొ


53. జొన్న పెరిగితే జాడు, వరిపెరిగితే వడ్లు.


జో


54. జోగీ జోగీ రాసుకుంటే, బూడిద రాలిందట.
55. జోడులేని బ్రతుకు, త్రాడులేని బొంగరం.
56. జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు.
57. జోలి పల్కులు తీసేలోగా బిక్షపు వేళ పోయిందట.




58. టంకం పెట్టిన గుడిసె దెబ్బ కొడితే వడిసె.
59. టంగుటూరు పెద్దమాలను తగవుతీర్చమంటే, తనకు ఇద్దరున్నారన్నాడట.


టా


60. టాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రుడికి సద్దెన్నం.


టె


61. టెంకాయ చెట్టెందుకు ఎక్కినావురా అంటే దూడగడ్డి కన్నాడట, గడ్డి చెట్టుపైన ఉంటుందా? అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నా అన్నాడుట కాయలదొంగ.
62. టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే దొంగ కడ్డమా?




63. డంబము ఎప్పుడూ పూవులు పూయుచుండునే గానీ కాయలు కాయదు.
64. డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
65. డబ్బిచ్చి తేలు కుట్టించుకొన్నట్లు.
66. డబ్బు ఇవ్వనివాడు పడవ ముందర ఎక్కును.
67. డబ్బు ఉంటే, కొండమీద కోతికూడా దిగివస్తుంది.
68. డబ్బుకు ప్రాణానికి లంకె.
69. డబ్బుకు వచ్చిన చెయ్యే వరహాకు వస్తుంది.
70. డబ్బు (దస్తు) దస్కం లేదుగానీ, దవాలు బంట్రోతు.
71. డబ్బు పాపిష్టిది.
72. డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు.
73. డబ్బురాని విద్య దరిద్రానికే.
74. డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు.
75. డబ్బు లేనివానికి బోగముది తల్లివరుస.
76. డబ్బు సభ కట్టును, ముద్ద నోరు కట్టును.
77. డఱ్ఱుబుఱ్ఱు డాలుకత్తి, చూరులోన చురుకత్తి.


డా


78. డాగుపడిన పండు బాగులేదందురు.
79. డాబుసరి బావా! అంటే డబ్బులేదు మరదలా అన్నాడట.


డి


80. డిందుపడినవాని నెందునూ లెక్కింపరు.


డూ


81. డూడూ బసవన్నా అంటే తలూపినట్లు.


డొం


82. డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా?
83. డొంకలో షరాబున్నాడు, నాణెము చూపుకోవచ్చును అన్నాడట దొంగలచేజిక్కిన వాడు.


డౌ


84. డౌలు దస్తు పెండ్లాము పస్తు (డౌలు=భూమి సిస్తు, దస్తు=వసూలు చేసిన పైకము ఖజానాకు చెల్లించుట).
85. డౌలు చూపితే దరిద్రం పోతుందా? (డౌలు=డంభము, డాబు).


ఢి


86. ఢిల్లీకి ఢిల్లే, పల్లెకు పల్లే.
87. ఢిల్లీపాచ్చా కూతురైనా పెండ్లికొడుకుకు లోకువే.
88. ఢిల్లీకి పోయి ఉల్లిగడ్డ తెచ్చినట్లు.
89. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.




90. తంగేటి జుంటిని దాప ఎందుకు? (దాచుటెందుకు?)(జున్ను= తేనెతుట్టె).
91. తంగేడు పూచినట్లు.
92. తంటాలమారి గుఱ్ఱానికి తాటిపట్ట గోఱపము (గోఱపము=కోకుడు దువ్వెన).
93. తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది.
94. తండ్రికదా అని తలాటి కీడ్చినట్లు.
95. తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది, తల్లి చస్తే కాపురం తెలుస్తుంది.
96. తండ్రి తవ్విన నుయ్యి అని దానిలో దూకవచ్చునా?
97. తండ్రిని చంపబోయిన పాపం, అత్తవారింటికి పోయి, అంబటికట్ట తెగేవఱకు ఉంటే పోవును.
98. తండ్రి వంకవారు దాయాది వర్గమే.
99. తండ్రి సేద్యం కొడుకు వైద్యం కూడు మధ్యం.
100. తంతే దూదిపరుపు మీద పడ్డట్లు.

Wednesday, February 9, 2011

సామెతలు 37

1. చెల్లెలి మగని చూచుకొని చెయ్యి విఱుగ బడ్డదట.
2. చెల్లెలి వరుస చెడి చేసుకోవాలి, తల్లి వరుస తప్పి చేసుకోవాలి.
3. చెవికోసిన మేక, కరివేపాకు కోసే ఎరుకలవాడు ఊరకుండరు.
4. చెవికోసిన మేకవలే అరుస్తాడు.
5. చెవిటి చెన్నప్పా! అంటే సెనగల మల్లప్పా అన్నాడట.
6. చెవిటి చెన్నారమా? అంటే చెనిగలు పదకొండు అందిట.
7. చెవిటిదానా సేసలు పట్టమంటే- బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అన్నదట.
8. చెవిటి పెద్దమ్మా! చేంతాడు తేవే అంటే, చెవులపోగులు నా జన్మలో ఎఱుగనన్నదట.
9. చెవిటివానికి శంఖమూదినట్లు, మూగవానికి ముక్కు గీరుకున్నట్లు.
10. చెవిటివాని ఎదుట శంఖం ఊదితే, అది కొరకటానికి నీ తండ్రి తాతల తరము కాదన్నాడట.
11. చెవిలో చెప్పిన మాట గానీ, అరచి చెప్పినమాట గానీ వినదగియుండవు.
12. చెవిటివానికి వినిపించాలంటే శంఖచక్రాలవాడు దిగిరావాలి.
13. చెవిదగ్గర కందురీగ (కంతిరీగ) వలె.
14. చెవుడు, చెవుడూ అంటే, తవుడు తవుడూ అన్నట్లు.
15. చెవులు కోసుకు పోతుంటే, కుట్టుకాడలకు ఏడ్చినట్లు.
16. చెవులపిల్లి ఎదురైతే చేటు వస్తుంది.
17. చెవులో గుమి(బి)లికి ఏపుల్ల ఐతేనేమి గెలుక్కోను.
18. చెవ్వాకు పోయినమ్మకు దుఃఖమూలేదు, దొరికినమ్మకు సంతోషమూ లేదు.


చే


19. చేటను కొట్టి పిల్లిని బెదరించినట్లు.
20. చేటభారతము - కంప రామాయణము.
21. చేటలో వెలగకాయల వలె.
22. చేటు ఎరుగని చేడె మొగుడికి పెళ్ళి చేసిందట.
23. చేటుకాలమయిన చెరువ నల్పుడే చాలు.
24. చేటుకాలానికి చెడ్డ బుద్ధులు.
25. చేటు మూడినప్పుడు మాటలు దోపవు.
26. చేటూ పాటూ ఎఱుగనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట.
27. చేటూ పాటూ ఎఱుగనమ్మ మగని పెళ్ళి కెళ్ళిందట.
28. చేటెడు తిని చెడితి, వాకిలి దాటి పడితి.
29. చేతకానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.
30. చేతకానమ్మకు శౌర్యమెక్కువ.
31. చేతనైన మగోడు (మగవాడు) చాలాపొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకొకచోట వండుకొన్నాడట.
32. చేత వెన్నయుండ నేతికేడ్చెడి వారె.
33. చేతికలుపు - వైద్యునిచేతి తళుకు.
34. చేతికి అందినది వాతి కందదు.
35. చేతికి దొరికిన రత్నం నాచుక పోయినట్లు.
36. చేతికిబట్టిన జిడ్డు లెక్కకు రాదు.
37. చేతిచమురు భాగవతం చెప్పుకొన్నట్లు.
38. చేతిమల్లెపూవు గుండ్రాతికి ఓర్వజాలునా?
39. చేతిలో ఉంటే అర్ధం, చేరువలో ఉంటే పెళ్ళాం.
40. చేతిలో కఱ్ఱ చేదోడు, వాదోడు.
41. చేతిలోది లేత, చేలోది ముదురు.
42. చేతిలోని అన్నం చెరువులోకి విసిరి, చెయ్యినాకి చెరువు నీళ్ళు తాగినట్లు.
43. చేతిలో లేనిది చేలోకి ఎలావస్తుంది?
44. చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యికోసం ఊరంతా వెతికినట్లు.
45. చేతివేళ్ళు అయిదు ఒకరీతిగా ఉంటాయా?
46. చేతిసొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
47. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు.
48. చేతులు చెయ్యవు, నోరుతినదు.
49. చేతులు పొడుగని మూతులు పొడుస్తారా?
50. చేదతాడు (చేంతాడు) కురుచైతే బావి పూడ్చుకుంటారా?
51. చేదు తింటారా? చెట్టు కొడతారా?
52. చేనికి ఎరువు, మడికి మంద.
53. చేనికి గట్టు, ఊరికి కట్టు ఉండాలి.
54. చేసినపాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయి హరహరా అన్నాడుట.
55. చేసినపాపం చెపితే తీరుతుంది.
56. చేసినపాపం చెఱగున కాశీకిపోతే కడతేరుతుందా?
57. చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి.
58. చేసినమ్మ చేవ, చేయనమ్మ చెదలు.
59. చేసినవాడు (చేసినోడు) చేసిపోగా, నిలుచున్నోడికి నీళ్ళు కారిపోయినట్లు.
60. చేసినవారికి చేసినంత మహదేవ!
61. చేసిపోయిన కాపురం చూసిపోను వచ్చినట్లు.
62. చేసుకున్న కర్మమోయి శంభులింగమా! అంటే, అనుభవించక తీరదోయి అబ్బులింగమా! అన్నాడట.
63. చేసుకున్న తరవాత వండిపెట్టక తప్పుతుందా?
64. చేసుకున్నదానుకి మూసుకోను లేదు, ఉంచుకున్నదానికి ఉభయరాగాల చీర.
65. చేసుకున్న కడుపు దించుకోక తప్పదు.
66. చేసేది బీద కాపురం, వచ్చేవి రాజభోగాలు.
67. చేసేది శివపూజ, కుడిచేది మాలకూడు.
68. చేసేది శివపూజ, దూరేది దొమ్మరి గుడిసె.
69. చేసేపని వదలి నేసేవాని వెంట పోయినట్లు.
70. చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు.
71. చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
72. చేసేవి లోపాలు, చెపితే కోపాలు.
73. చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్ధాలు.


చై


74. చైత్ర వైశాఖలలో పెండ్లి కావిళ్ళు (సారెకావిళ్ళు), శ్రావణ భాద్రపదాలలో దినం కావిళ్ళు.


చొ


75. చొప్పవామిలో నిప్పు దాచుకొన్నాట్లు.
76. చొల్లంగి తీర్ధానికి చోడిగింజలంతేసి (మామిడిపిందెలు).


చో


77. చోటే లేదంటే మూల ఎక్కడ వెదుకుదును అన్నాడట.
78. చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట.
79. చోద్యాల సోమిదేవమ్మకు వాద్యారి మొగుడు.
80. చోళ్ళు చల్లితే జొన్నలు పండునా?
81. చోళ్ళు విసరే తిరగలి, జొన్నలు విసరునా?
82. చోళ్ళు విసరే తిరగలి ఆళ్ళు విసరునా?


చౌ


83. చౌక దూబరతిండికి కారణం.
84. చౌటినేల వల్ల జలమెల్ల చెడిపోయె.
85. చౌడోలు గాడిదపై గట్టినట్లు.
86. చౌదంతి నెక్కగానే చక్రవర్తి అగునా?


ఛీ


87. ఛీ! కుక్కా అంటే, ఏమక్కా ! అన్నదట.
88. ఛీ! ఛీ! అనేదీ ఈ నోరే, శివశివా అనేదీ ఈ నోరే.




89. జంగమైన వెనుక జాతినెంచగరాదు.
90. జంగానికి పిల్లలు పుడితే, ఊరివారి గోడు పోసుకున్నాడట.
91. జంగానికి బిడ్దలు ఊరికి ఉపాధి.
92. జంగాలపాలు దేవాంగుల విత్తము, కాపు విత్తం పంజుగాని పాలు (పంజుగాడు=దివిటిలు పట్టేవాడు).
93. జంగాలో! దాసర్లో ! ముందూరుని బట్టి.
94. జగడమెట్లా వస్తాది లింగమయ్యా అంటే, బిచ్చంపెట్టవే బొచ్చుముండా అన్నాడట.
95. జగ బిరుదు, ముండమొఱ్ఱ.
96. జగమెరిగిన బ్రాహ్మడికి జందె మెందుకు?
97. జడరాశిలో దాగని జడబానలమా?
98. జడ్డిగములోనే మిడతపోటు.
99. జన మర్లు, జాతర మర్లు.
100. జనవాక్యం కర్తవ్యం.

Friday, February 4, 2011

సామెతలు 36


1. చెడిన చేనుకు ఇంటివడ్లు పొంగలా?
2. చెడిన చేలుకి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి?
3. చెడిన శ్రాద్ధం చెడనే చెడ్డది, పిత్తరా పీట పగుల.
4. చెడినా పడినా చేసుకున్న మొగుడు తప్పడు.
5. చెడినా సెట్టి సెట్టే, చిరిగినా పట్టు పట్టే.
6. చెడిపోయిన బ్రహ్మణుడికి చచ్చిపోయిన ఆవు దానం.
7. చెడిపోయెపో గుడిపాడని కోడలంటే, పచ్చరాగులపాడు పాడు పాడాయెపో అన్నదట అత్త.
8. చెడి బతికినమ్మ చేతులు చూడు, బతికి చెడ్డమ్మ చెవులు చూడు.
9. చెడి బ్రతికినవాడికి శౌర్యమెక్కువ, బ్రతికి చెడినవాదికి బదవలు ఎక్కువ.
10. చెడి బ్రతికిన వాని చెంపలు చూడు, బ్రతికి చెడినవాని బట్టలు చూడు.
11. చెడి స్నేహితునింటికి పోవచ్చునుకానీ, చుట్టాలింటికి (చెల్లెలింటికి) పోరాదు.
12. చెడుకాలానికి చెడు బుద్ధులు.
13. చెడుకాలమైన ఎవ్వరి దెస నే వికారము వచ్చునో?
14. చెడు చెడు అనగానే చెడేవారు లేరు.
15. చెడు చెడు మనేవారేగానీ, చేతిలో పెట్టేవారే లేరు.
16. చెడ్డచేనుకు ఇన్ని మంచెలా?
17. చెడ్డచేనుకు ఇంట్లో పొంగళ్ళా?
18. చెడ్డసొమ్ము చెరి సొగం.
19. చెడ్డాపడ్డా చేబ్రోలే గతి.
20. చెడ్డాపడ్డా శ్రీకాకుళమే గతి.
21. చెదలుకాళ్ళవాడు క్షణ మొకచోట నిలువడు.
22. చెన్నంపల్లి పంచాయతి చెరిసొగం.
23. చెప్పంత పొలం చెప్పినట్లు కొనాలి.
24. చెప్పకపోయినా దుప్పికొమ్ముల ఎద్దునే కొను.
25. చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం.
26. చెప్పనేర్చిన మాట సెబాస్ మాట.
27. చెప్పింది చేయబోకురా! చేసేది చెప్పబోకురా.
28. చెప్పి చెప్పి చెప్పుతో కొట్టించుకో, మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో.
29. చెపితే పాపంగానీ, తిరగేసి పొడిస్తే చస్తుంది అన్నట్లు.
30. చెపితే సిగ్గు దాస్తే దుఃఖం.
31. చెప్పినంత చేసేవారు శివుడికన్నా లేరు.
32. చెప్పిన కొద్ది చెవుడు పడిపోతారు.
33. చెప్పిన బుద్ధి, కట్టిన సద్ది ఎంతకాలం నిలుచును?
34. చెప్పిన మాట విని వచ్చేవాడిని చెవు బట్టుకొని లాక్కొచ్చి, ఎదురు తిరిగిన వాడికి సాక్ష్యం బెట్టి వచ్చినా.
35. చెప్పుకాలు నెత్తిన బెట్టి శఠగోపుర మంటాడు.
36. చెప్పు కింద తేలువలె.
37. చెప్పు కొరికినామని సిద్ది కొరుకుతామా?
38. చెప్పటం కంటే చెయ్యటం మేలు.
39. చెప్పుడూ మాటలకన్నా తప్పుడు మాటలు నయం.
40. చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్లు.
41. చెప్పు తినెడి కుక్క చెఱుకు తీపెరుగునా?
42. చెప్పు పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు.
43. చెప్పులవానికి చేనంతా తోలుతో కప్పినట్లుంటుంది.
44. చెప్పులు ఉన్నవాడితోనూ, అప్పులున్నవాడితోనూ పోరాదు.
45. చెప్పులు చిన్నవని కాలు తెగకోసుకుంటారా?
46. చెప్పులు ఉన్నా, చెప్పులు తెగినా చుట్ట(ట్టి)రికం తప్పదు.
47. చెప్పులోని రాయి- చెవిలోని జోరీగ-ఇంటిలోని పోరు.
48. చెప్పుడుమాటలు చేటు.
49. చెప్పేది చెవిదగ్గఱ, వినేది రోటిదగ్గఱ.
50. చెప్పేవానికి చేదస్తమయితే, వినేవానికి వివేకం వద్దా?
51. చెప్పేవానికి వినేవాడు లోకువ.
52. చెప్పేవి నీతులు, చేసేవి గోతులు.
53. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
54. చెయ్యగానని వారికి నీతులు మెండు, చెల్లని రూపాయికి గీతలు మెండు.
55. చెయ్యా పెట్టాలేనాతడికి దిశ పన్నెండామడ.
56. చెయ్యి అలసిన వేళ తెప్ప దొరికినరీతి (ఈది అలసినప్పుడు).
57. చెయ్యి కాలినప్పుడల్లా కుండ వదిలిపెడతామా?
58. చెయ్యిచూపి అవలక్షణ మనిపించుకొన్నట్లు.
59. చెయ్యి దాచుకుంటాము గాని, కులం దాచుకుంటామా?
60. చెయ్యి పుచ్చుకుని లాగితే రాలేదుగానీ, ఇంటికి చీటీ వ్రాసాడుట.
61. చెరు(ఱు)కా ! బెల్లం (పెట్టు) అంటే పెడుతుందా?
62. చెరుకు అని వేళ్ళతో పెరకకూడదు.
63. చెరుకు ఉండేచోటుకి చీమలు తామే వస్తవి.
64. చెరుకుకు చెఱువు సూలంగి.
65. చెరుకు కొనఏమి, మొదలేమి?
66. చెరుకు తియ్యనని వేళ్ళతో గూడా తిన్నట్లు.
67. చెరుకుతోటలో ఏనుగు పడినట్లు.
68. చెరుకు నమలడానికి కూలీ అడిగినట్లు.
69. చెరుకు పిప్పికి ఈగలు మూగినట్లు.
70. చెరుకు వంకరబోతే, తీపి చెడుతుందా?
71. చెఱకుతోటలోన చెత్తకుప్పుండిన కొంచమైన దాని గుణము చెడదు.
72. చెఱకుదిన్న నోరు చేదారగించునా?
73. చెఱకురసము కన్న చెలిమాట తీపురా.
74. చెఱకువిల్తుడు విరహిణులపాలిటి పచ్చితురక.
75. చెఱపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
76. చెఱపటానికి చేట పెయ్య చాలును.
77. చెఱపటానికి చేతులు వస్తాయిగానీ, నిలవడానికి మతులు రావు.
78. చెఱువు ఎండితే చేపలు బయటపడతాయి.
79. చెఱువు ఎండిపోయి, చేను బీడైతే కరణం పెండ్లానికి కాసులదండట.
80. చెఱువు వోడు, ఊరు పాడు.
81. చెఱువుకు చేరువగానూ, చుట్టాలకు దూరముగాను ఉండవలె.
82. చెఱువుకు నీటి ఆశ, నీటికి చెఱువు ఆశ.
83. చెఱువు తెగగొట్టి చేపలు వండిపెట్టాగానే మాన్యుడగునా?
84. చెఱువు నిండితే కప్పలు చేరవా?
85. చెఱువును చూడబోయిన తూటితీగ (తూడు) తిరిగివచ్చునా?
86. చెఱువును మూకుడుతో మూయనగునా?
87. చెఱువును విడిచి కాలువను పొగిడినట్లు.
88. చెఱువును విడిచి వరవను పొగిడినట్లు.
89. చెఱువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా పోయినట్లు.
90. చెఱువు మీద కొంగ అలిగినట్లు.
91. చెఱువు ముందు చలివేంద్రమా?
92. చెఱువులు తెంచి, చేపలు వండినట్లు.
93. చెఱువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూచి బేరం చేసినట్లు.
94.చెలమకు పిట్టలు చేరినట్లు.
95. చెలిమాత చెఱకు ఊట.
96. చెలిమిని చేదు తినిపించవచ్చు గానీ, బలిమిని పాలు త్రాగించలేము.
97. చెల్లని కాసుకు గరుకులు (గీతలు) మెండు.
98. చెల్లని కాసు-వ(వొ)ల్లని మొగుడు.
99. చెల్లని దాన్ని చేనుకాడ పెడితే, అయినకంకులన్నీ అమ్మగారింటికి పంపింది.
100. చెల్లీ చెల్లడములకు (పుట్టచాటున) సెట్టిగారున్నారు (దారిదోపుడుగాండ్రతో).

Tuesday, February 1, 2011

సామెతలు 35

1. చీరపేల బొంత ఎప్పుడైనా కాలవేసేదే.
2. చీరపోగా నాకో మొగుడు.
3. చీరపోతుకు సిరివస్తే, గోలకొండకాడికి గొడుగు తెమ్మన్నదట.
4. చీరపోతు లేరివేయటంకన్నా, బొంతను కాల్చివేయటం నిమ్మళం (మేలు).
5. చీర సింగారించేప్పటికి, పట్నమంతా చూర (కొల్ల) పోయిందట.
6. చీర సింగారించేప్పటికి, ఊరు మాటుమణిగింది.
7. చీరే స్త్రీకి శృంగారం.
8. చీలమడిమలదాకా చీర ఉంటే, మోకాలుదాకా సిరి ఉంటుందనుకొన్నట్లు.


చు


9. చుక్కలూళ్ళో చక్కిలాలు.
10. చుట్టం ఆకలి మంచాని కెరుక.
11. చుట్టంగా వచ్చి దెయ్యమై పట్టుకొన్నాడట.
12. చుట్టకాలిస్తే మాట్లాడనీయదు.
13. చుట్టం వచ్చాడంటే, చెప్పులు ఎక్కడవదిలాడో చూసిరా అన్నట్లు.
14. చుట్టతాగి చూరులో పెడితే ఇల్లుకాలి వెళ్ళవలసి వచ్చిందట.
15. చుట్టము చేప మూన్నాళ్ళకు మురుగుకంపు కొట్టును.
16. చుట్టమై చూడవస్తే దెయ్యమై పట్తుకున్నాడట.
17. చుట్టరికం, పేరంటం కలిసివచ్చినట్లు.
18. చుట్టాలకు పెట్టినిల్లు చూఱపోయింది, వేల్పులకు పెట్టినిల్లు హెచ్చిపోయింది.
19. చుట్టు అయినా మెట్టదారి మేలు. (దారిన పొమ్మన్నారు).
20. చుట్టు అయినా సుఖంగా పొయేదిమేలు.
21. చుట్టు అయినా సుళువుదారి మేలు.
22. చుట్టుకపోయే చాప, మూసుకుపోయే తలుపు, అలిగిపోయే పెండ్లాము.
23. చుట్టుడు చాప, విసురుడు తలుపు, పెడసరపు పెండ్లాము.
24. చుట్టూ చూరుమంగళం, నడుమ జయమంగళం.
25. చుట్టూరా శ్రీవైష్ణవులే, చూస్తే కల్లుకుండ లేదు.


చూ


26. చూచింది పాము, కఱచింది మామిడిటెంక.
27. చూచిందెల్లా సుంకము, పాసిందెల్లా పంకము.
28. చూచిగానీ తాగవలదు, చదివిగానీ వ్రాలుంచవలదు.
29. చూచినమ్మ కళ్ళు శూలాలు, మా అమ్మ కళ్ళు పేలాలు.
30. చూచి మురుసుకొని, చెప్పి ఏడ్చుకొని.
31. చూచిరమ్మంటే కాల్చివచ్చినాడట.
32. చూచిరమ్మంటే పెండ్లాడి వచ్చినట్లు.
33. చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి, చేసే వారుంటే పిల్లలు కనాలి.
34. చూడగా చుట్టము లేడు, మ్రొక్కగా దైవము లేడు.
35. చూడగా చూడగా గుఱ్ఱం గాడిద అయిందట.
36. చూను చుంచెలుక, గోడలు తవ్వను పందికొక్కు.
37. చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు.
38. చూడబోతే చుండెలుక (చుంచెలుక) తెంచేదేమో తోలుమోకులు.
39. చూడబోతే వెండిగిన్నె, తాగబోతే వెలితిగిన్నె.
40. చూడవచ్చిన వారికి శుక్రవారమేమి?
41. చూడవమ్మా సుతారాం! ఇంటావిడ అవతారం.
42. చూపనిదే చూపెనయ్య నూరవరాజా.
43. చూపితే మానం పోయె, చూపకపోతే ప్రాణం పోయె.
44. చూపులకు గుఱ్ఱమే కానీ, మఱుకుతనం లేదు (చుఱుకుతనానికి గాడిద).
45. చూపులకి చుంచు, పనికి పర్వతం.
46. చూపులకు మొగుడే కానీ సుఖానికి మొగుడు కాదు.
47. చూపుల పసేగానీ చేపుల పస లేదు.
48. చూరులో నిప్పు పెట్టి, కొప్పులో పెట్టనా అన్నట్లు.
49. చూస్తూ ఊరకుంటే, మేస్తూ పోయిందట.
50. చూస్తే చుక్క, లేస్తే కుక్క.
51. చూస్తే నీది, చూడకుంటే నాది.
52. చూస్తే పొరపాటు, చూకుంటే సాపాటు.
53. చూస్తే సుంకం, చూడకుంటే బింకం.
54. చూస్తే సూది మాదిరి ఉంది, లేస్తే గాలి మాదిరి ఉంది.
55. చూపులకు గుర్రమేగానీ, చురుకుదనానికి దున్న.
56. చూరుకత్తి తెగుతుందిగానీ, చూపుడుకత్తి తెగుతుందా?


చె


57. చెంత దీపమిడక చీకటి పోవునా?
58. చెంపలు నెరసిన వెనుక, చామ (చాన) పతివ్రత.
59. చెంబు అమ్మి తప్పేలా, తప్పేలా అమ్మి చెంబు.
60. చెంబు ఎక్కడపెట్టి మరచిపోయినావురా? అంటే నీళ్ళచాయ (చెంబట్లకు) కూర్చున్న చోటికి ఇటు అన్నాడు; నీళ్ళచాయ ఎక్కడ కూర్చున్నావంటే, చెంబుబెట్టిన దానికి అటు అన్నాడట.
61. చెంబు కంచం పోతే, ముఖంమీద కొట్టినట్లు ముంత మూకుడు తెచ్చుకోలేదా?
62. చెట్టబట్టని నా భీతి, బొట్టు గట్టని కన్య రీతి.
63. చెట్టడిచిన చేటెడన్ని, నిటలాంబక మూర్తులు (లింగాలనుట).
64. చెట్టుఎక్కి, కాయపట్టిచూచి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.
65. చెట్టుఎక్కేవానికి ఎంతదాకా ఎక్కుడు పెట్టగలము?
66. చెట్టు ఎక్కిందని నిచ్చన తీసినట్లు.
67. చెట్టు ఎక్కేవాడిని ఎంతదాకా తొయ్యగలము?
68. చెట్టుకు (మానుకు) కరువు, కోమటికి బరువు లేవు.
69. చెట్టుకు చావ నలుపు, మనిషికి చావ తెలుపు.
70. చెట్టుకు తగినగాలి (ఎంతచెట్టో అంత గాలి).
71. చెట్టుకు పుట్టకు వరుసగానీ, మనిషికేమి వరుసరా మాల నాయాలా?
72. చెట్టుకు మడిగుడ్డ కట్టి ఉన్నదిలే, దొంగ చెట్టెక్కడు అన్నదిట సోమిదేవమ్మ.
73. చెట్టుకు విస్తళ్ళు కట్టినట్లు.
74. చెట్టు చచ్చినా చేప చావదు.
75. చెట్టు చెడేకాలానికి కుమ్మమూతి పిందెలు పుట్టును.
76. చెట్టునరికి పండ్లు దానము చేయగానే సుకృతి అగునా?
77. చెట్టుపెట్టి నాటినవాడు నీళ్ళు పోయడా?
78. చెట్టు నాటే దొకడు, ఫలమనుభవించే దొకడు.
79. చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి పడ్డట్లు.
80. చెట్టును తేరా అంటే గుట్టను తెచ్చినట్లు.
81. చెట్టుపట్టించి చేతులు వదిలినట్లు.
82. చెట్టు పెరగటం మొదలు నరుకుడికే.
83. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు.
84. చెట్టును బట్టే కాయ.
85. చెట్టుమీదనుండి పడ్డవానికి గాయాలెన్నేమిటి?
86. చెట్టుమీదిది చేతికి వచ్చినట్టెగానీ, ఇక తొమ్మిదయితే పదవుతాయి.
87. చెట్టుమీది వాడు జుట్టుమీదికెక్కె.
88. చెట్టుమీది విరులైనా చేతుల కోయక రావు.
89. చెట్టులేని చేను, చుట్టము లేని ఊరు.
90. చెట్టులేని చోట ఆముదము చెట్టే మహావృక్షము.
91. చెట్టు ముదరనిచ్చి చిదిమిన పోవునా?
92. చెట్టు మొండి ఐతే చేరికలో వాన.
93. చెట్టెక్కి చేతులు విడిచినట్లు.
94. చెట్టెఱుగువానికి ఆకులు చిదుమనేల?
95. చెడదున్ని సెనగలు చల్లమన్నారు.
96. చెడిందిరా పిల్ల అంటే, చేరిందిరా తెనాలి అన్నట్లు.
97. చెడి కాపు పొరుగు చేరు, బ్రతికి కమ్మ పొరుగు చేరు.
98. చెడి చెన్నపట్నం చేరు.
99. చెడిన కాపురానికి ముప్పేమిటి చంద్రవంకలు వండే పెళ్ళామా? అంటే, అయిన అప్పుకి అంతేమిటి? అవే వండుతాను మగడా! అన్నదిట. 
100. చెడిన చేను చెరుకు, రాజనాలు పండునా?