Wednesday, August 10, 2011

సామెతలు 63


1. పూట బత్తెము -- పుల్ల వెలుగు.
2. పూటలు మూడు భోజనం ఒకటి.
3. పూడ్చలేనంత గొయ్యి, తీర్చలేనంత అప్పు చెయ్యరాదు.
4. పూతకు ముందే పురుగు పట్టినట్లు.
5. పూబోడి అంటే ఎవర్రా బోడి? నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అన్నదట.
6. పూరణంలేని బూరె వీరణంలేని పెండ్లి వ్యర్థము.
7. పూరి గుడిసెకు చాందినీ మంచం కావలెనా?
8. పుర్ణిమనాడు కొంగుపట్టుక పిలిస్తే రానిది, అమావాశ్యనాడు కన్ను గీటితే వస్తుందా?
9. పూర్వజన్మ కృతముల్ కాబోలు ఈ నెయ్యముల్.
10. పూర్వోత్తరమీమాంసలకు బాబూ అమ్మగారు వ్యాఖ్యానం వ్రాసినట్లు.
11. పూర్వోత్తరా లెరిగి పొత్తు చేసికోవలె.
12. పూల చేరెత్తినట్లు.
13. పూలతో గూడ నార తలకెక్కినట్లు.
14. పూల వాసన నారకు పట్టినట్లు.
15. పూలమ్మి బ్రతికిన వారిని పుల్లలమ్మ బిలువరాదు.
16. పూవు పుట్టగానే పరిమళం వెదజల్లుతుంది.
17. పూవు పుట్టగానే వాసన.
18. పూవు లమ్మిన అంగడిలోనే కట్టెలు అమ్మినట్లు.
19. పూస, పోగు ఉంటే భుజ మెక్కవలెనా?
20. పూసలలో దారమువలె
21. పూసుకురావే బూరెముక్కా అంటే, నేనూ వస్తానే నేతిచుక్కా అన్నట్లు.


పె


22. పెంటకుప్ప పెరిగితే, పేదరైతు పెద్దవాడగును.
23. పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా?
24. పెంట తినే బఱ్ఱెపాలు పనికిరాకుండా పోతున్నవా?
25. పెంటదినెడు కాకి పితరుండెట్లాయె?
26. పెంటదినెడు కాకి పెద్ద యేలాగయ్యె?
27. పెంటమీద చెట్టు ప్రబలం, నిరుపోసిన చెట్టు నిర్మలం.
28. పెంటమీద పంట, మంటమీద వంట.
29. పెంటమీద రాయివేస్తె, తనపైనె పడుతుంది.
30. పెండ్లాన్ని కొట్టడం ఎప్పుడు మానినావు అని అడిగినట్లు.
31. పెండ్లాము కొట్టితే చస్తామనుకుంటె, చావటం అలవాతు లేకపోయెనే అని అఘోరించాడట.
32. పెండ్లాము (భార్య) పాలిండ్లు రిక్తకుంభములు, రాయివెలది చనుదోయి పూర్ణకుంభములు (రాయివెలది=వెలయాలి).
33. పెండ్లాము బెల్లము, తల్లి దయ్యము.
34. పెండ్లి అయిన ఇంటిలో ఆరునెలలు కఱవు.
35. పెండ్లికి చేసిన పప్పు, పేరంటాండ్రు చవిచూడను సరిపోయింది.
36. పెండ్లికి ముందు బాగా కండ్లు తెరచుకొని చూచి, పెండ్లికాగానే కండ్లు సగం మూసుకొని చూచీ చూడనట్లుండాల.
37. పెండ్లికి వచ్చినవాళ్ళంతా పెళ్ళాలేనా?
38. పెండ్లికి వెడుతూ పిల్లిని చంకన పెట్టుక వెళ్ళినట్లు.
39. ఓండ్లికూతురు పిత్తినట్లు.
40. పెండ్లి కొచ్చినమ్మ పెదవు లెండినాయి అంటే, నీ వెన్నడొచ్చినావమ్మ నిలువుకండ్లు పడినాయి అన్నదట.
41. పెండ్లి కొచ్చినవారు వారే చేస్తారు, పెండ్లామా! నీ ఒళ్ళు అలిపించుకోకు.
42. పెండ్లికొడుకు కుంటి కుడికాలుచూచి అత్త ఏడుస్తుంటె ఏడ్పులో ఏడ్పు ఎడమకాలుగూడా చూపమన్నాడట-తోటిపెండ్లికొడుకు.
43. పెండ్లికొడుకు మనవాడేగానీ చెవులపోగులు మాత్రం మనవిగావు.
44. పెండ్లినాటి పప్పుకూడు దినమూ రమ్మంటే వస్తుందా?
45. పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాడు తలచుకొన్నట్లు.
46. పెండ్లినాడే పరగడుపైతే పైని పిల్లలు కూడానా?
47. పెండ్లిని చూస్తు ఒకడుంటే పెండ్లాన్ని చూస్తూ ఒకడున్నాడు.
48. పెండ్లి మర్నాడు పెండ్లికొడుకు ముఖాన్న పెద్దమ్మ వేలాడుతుంది.
49. పెండ్లివారికి పెండ్లి సందడి, అడుసుకాళ్ళ వాదికి దోమల సందడి.
50. పెండ్లి సందడిలో పుస్తె కట్ట మరచాడట.
51. పెగ్గెలకోసం పెళ్ళాడాను కానీ, కూడుపెట్టటం మా కులాన లేదు.
52. పెట్టక కీర్తి రాదు, నలపింపక ఇంతికి నింపురాదు.
53. పెట్టకపోయినా, పెట్టే ఇల్లు చూపమన్నారు.
54. పెట్ట కేరితే, పుంజు కూస్తుంది.
55. పెట్టగతులు లేకున్న, పుట్టగతులు ఉండవు.
56. పెట్టగల బచ్చలిపాదు(ది) కొనగల గేదె మేసిపోయింది.
57. పెట్టదు పిన్నాం, పోయది పిన్నాం, పిన్నానికి నాకు ప్రాణం-ప్రాణం.
58. పెట్టనమ్మ పెట్టనే పెట్టదు, పెట్టేముండ కేమొచ్చింది పెద్దరోగం?
59. పెట్టనమ్మా! పెట్టే ఇల్లయినా చూపించు.
60. పెట్టనేరని రండ పెక్కు నీతులకు పెద్ద.
61. పెట్టనేరని విభుడు కోపింప పెద్ద.
62. పెట్టితే తింటారుగానీ, తిడితే పడతారా.
63. పెట్టితే తినేవారేగానీ, తిడితే పడేవారు లేరు.
64. పెట్టితే పెండ్లి, పెట్టకుంటే పెడాకులు (తీరాలు=అపక్రియలు).
65. పెట్టి దెప్పితివో, పెద్దల తిడితివో.
66. పెట్టినదంతా పైరు కాదు, కడుపులన్ని కాంపులు కావు.
67. పెట్టిన పెళ్ళిగోరు, పెట్టకున్న చావు గోరు.
68. పెట్టిన పైరంతా మట్టిపాలైతే, రాఇతు బ్రతుకు కట్ట తెగిన చెఱువు.
69. పెట్టినమ్మకు ప్రాణహాని, పెట్టనమ్మకు జన్మహాని.
70. పెట్టినమ్మ పుణ్యాన పోదు, పెట్టనమ్మ పాపాన పోదు.
71. పెట్టినవానికి తెలియునునిక్షేపము (ఉన్నచోటు)
72. పెట్టినదానికి పుట్టిందే సాక్షి.
73. పెట్టిపొయ్యనమ్మ కొట్టటనికి వచ్చిందట.
74. పెట్టిపోయని పెద్దమ్మా కుట్టుబార గుద్దవే
75. పెట్టిపోయని మొగుడు కుట్లువెడల పొడిచినాడట.
76. పెట్టిపోయని వట్టి బెరములేల?
77. పెట్టిపోసిన నాడే చ్ట్టాల రాకడ, కలిమిగలిగిననాడే వారకాంత వలపు.
78. పెట్టుకు ఆయం లేదు, తిట్టుకు సింగారం లేదు.
79. పెట్టు చుట్టం, తిట్టు పగ.
80. పెట్టు చుట్టము, పొగడ్త సిరి.
81. పెట్టుతానంటె ఆశ, తిట్టుతానంటే భయం.
82. పెట్టుపోతలు లేని వట్టి కూతలు - పువ్వుపిందె లేని వట్టిచెట్టు.
83. పెట్టేమ్మ బుద్ధిలో ఉంటే, ఏ బంతినైనా పెడుతుంది.
84. పెట్టేవి రెండు (చివాట్లు) పెందలాడే పెట్టు, దూడ గడ్డికి పోవాలన్నాడట.
85. పెడతల దురద పేనుకేమి తెలుసు.
86. పెడద్రానికి, పెద్దరోగానికి మందులేదు (పెడద్రం=మొండి పట్టుదల; పెద్దరోగం=కుష్టురోగం).
87. పెడమోము బెట్టుట ప్రీతిలేక.
88. పెడితే శాపం, ఇస్తే వరం.
89. పెత్తనం చేసేవాడు, పెంటి సంతానం కలవాదు అందరికీ లోకువే.
90. పెత్తనానికి పోతే దుత్త చేతికివస్తుంది.
91. పెత్తర అమావాశ్యకు పెద్దరొట్టె ఇస్తా నన్నాడు (పెత్తర అమావాశ్య=మహాశయ అమావాశ్య).
92. పెద్దబావగారు ఆడంగులతో సమానం.
93. పెదవికి మించిన పల్లు-ప్రమిదకు మించిన వత్తి.
94. పెదవిదాటితే పెన్న దాటుతుంది, పెన్న దాటితే పృథివి దాటుతుంది.
95. పెదవిపై మందహాసం, ఎదలో చంద్రహాసం.
96. పెద్ద ఇంటి బొట్టె(ట్ట) - ఎద్దులున్న వ్యవసాయం.
97. పెద్ద ఇంటి బొడ్డి(ట్టె) అయినా కావాల, పెద్ద చెఱువు అయినా కావాల (బొడ్డి= ఇల్లాలు, స్త్రీ).
98. పెద్ద ఇంటి ఱంకు, పెద్దచెఱువు కంపు తెలియవు.
99. పెద్ద ఇంటి ఱంకు, పెద్దమనిషి బొంకు తెలియవు.
100. పెద్ద కత్తి పెరుమాళ్ళు (మాటలకు అడ్డులేనివాడనుట).

No comments: